- Home
- Business
- Amazon Prime Day Offers: అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో వన్ ప్లస్ ఫోన్లపై భారీ ఆఫర్లు! బడ్స్, టాబ్లెట్స్ కూడా తక్కువ ధరకే..
Amazon Prime Day Offers: అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో వన్ ప్లస్ ఫోన్లపై భారీ ఆఫర్లు! బడ్స్, టాబ్లెట్స్ కూడా తక్కువ ధరకే..
Amazon Prime Day Offers: అమెజాన్ ప్రైమ్ డే 2025, మాన్‌సూన్ సేల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో భారీ డిస్కౌంట్‌తో OnePlus 13 సిరీస్, బడ్స్, Nord CE 4 Lite, టాబ్లెట్ లభించనున్నాయి. మాన్‌సూన్ సేల్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
జూలై 10 నుండి ప్రారంభం
అమెజాన్ ప్రైమ్ డే 2025, మాన్‌సూన్ సేల్ వేడుక జూలై 10 ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా OnePlus దాని ఫేమస్ OnePlus 13 సిరీస్, Buds 3, ఇతర పరికరాలపై అన్ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లు జూలై 10 నుండి 14 వరకు అమెజాన్‌లో లైవ్‌లో ఉంటాయి. అంతేకాకుండా OnePlus అధికారిక వెబ్‌సైట్, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి రిటైలర్ దుకాణాల్లో లభిస్తాయి.
ప్రీమియం, మిడ్-రేంజ్ పరికరాలపై డిస్కౌంట్స్
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా OnePlus దాని ప్రీమియం, మిడ్ రేంజ్ పరికరాలపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. ప్రీమియం OnePlus 13 నుండి బడ్జెట్ ఫ్రెండ్లీ Nord CE 4 Lite వరకు అనేక ఆఫర్లు ఉన్నాయి. Buds Pro 3 వంటి ఫేమస్ ఆడియో పరికరాలు, దాని Pad సిరీస్ పై కంపెనీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అంతేకాకుండా ఉచిత బహుమతులు, నో కాస్ట్ EMI స్కీమ్ లను అందిస్తోంది.
OnePlus 13 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు
ముఖ్యమైన OnePlus 13 ఫోన్ అసలు ధర రూ.69,999. ప్రస్తుతం ఇది రూ.59,999 లకు అందుబాటులో ఉంది. ఇందులో రూ.5,000 ప్రత్యేక ధర తగ్గింపు కాగా, అదనంగా రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
కాంపాక్ట్ OnePlus 13Sపై రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ రూ.49,999లకు లభిస్తుంది. మీరు ఉపయోగించుకుంటే అదనంగా రూ.5,000 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
OnePlus 13R మోడల్ కూడా ఈ సేల్‌లో ఉంది. ఇది రూ.39,999లకి లభిస్తుంది. ఇందులో రూ.3,000 బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఉచిత OnePlus Buds 3 కూడా లభిస్తాయి.
OnePlus Nord CE 4 Liteపై ఆఫర్లు ఇవే..
బడ్జెట్ లో రూ.17,999 ధరకి లభించే Nord CE 4 Lite మాన్ సూన్ సేల్ సమయంలో రూ.15,999కి లభిస్తుంది. దీనిపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. స్టైలిష్ ఫోన్, నమ్మకమైన పనితీరును బడ్జెట్ ధరలో కోరుకునే వినియోగదారులకు ఈ ఫోన్ కరెక్ట్ గా సరిపోతుంది. ఈ డివైజ్ పై 3 నెలల వరకు నో కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.
OnePlus Buds Pro 3, Buds 3 ధరలు ఎలా ఉన్నాయంటే..
సాధారణంగా రూ.11,999 ధర కలిగిన OnePlus Buds Pro 3 ఇప్పుడు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్, ఇతర ఆఫర్ల ద్వారా రూ.8,999కి లభిస్తుంది. దాని అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో లక్షణాలు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటాయి. ఇది కాకుండా Buds 3 కేవలం రూ.4,299కి లభిస్తుంది. ఇది తక్కువ ధరకు మంచి ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోరుకునే కస్టమర్‌లకు ఇది సరిపోతుంది.