MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • ఆల్ఫా వేవ్ గ్లోబల్:హల్దిరామ్‌లో ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ బ్యాకర్ భారీ పెట్టుబడులు !

ఆల్ఫా వేవ్ గ్లోబల్:హల్దిరామ్‌లో ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ బ్యాకర్ భారీ పెట్టుబడులు !

Elon Musk SpaceX backer Alpha Wave Global: టెక్ రంగంలో తనదైన ముద్రవేసిన ఎలాన్ మస్క్ అండగా ఉన్న సంస్థ ఇప్పుడు ఫుడ్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదికూడా భారతీయ కంపెనీతో.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 01 2025, 09:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

Elon Musk SpaceX backer Alpha Wave Global: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు మద్దతుదారు అయిన ఆల్ఫా వేవ్ గ్లోబల్ హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్‌లో 6% వాటాను దాదాపు ₹5,160 కోట్లకు కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

వివరాల్లోకెళ్తే.. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌కు మద్దతుదారు అయిన ఆల్ఫా వేవ్ గ్లోబల్, హల్దిరామ్ స్నాక్ ఫుడ్‌లో ఆరు శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఆదివారం తెలిపింది. గతంలో ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్‌గా పిలువబడే ఆల్ఫా వేవ్ గ్లోబల్, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నూన్ బిన్ జాయెద్  ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యంలో ఇది ఒక భాగం.

ఈటీ నివేదికల ప్రకారం.. ఆల్ఫా వేవ్ భారతీయ స్నాక్ దిగ్గజం హల్దీరామ్ స్నాక్స్ లో వాటాలను రూ.5,160 కోట్లకు కొనుగోలు చేస్తుంది. హల్దిరామ్ వాటాలను విక్రయించడం ఇది రెండోసారి. గతంలో సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ హల్దిరామ్ ప్రమోటర్లతో కంపెనీలో దాదాపు తొమ్మిది శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 

ఆల్ఫా వేవ్ పెట్టుబడుల డీల్ ఒకే అయితే భారత్ లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పీఈ కన్స్యూమర్ డీల్ గా నిలుస్తుందని ఈటీ నివేదిక పేర్కొంది. అయితే, ఆల్ఫా వేవ్‌కు హల్దిరామ్ బోర్డులో స్థానం ఉండదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు, టెమాసెక్ హల్దిరామ్ బోర్డులో కనీసం ఒక స్థానాన్ని పొందే అవకాశం ఉంది. స్పేస్‌ఎక్స్ కాకుండా, ఆల్ఫా వేవ్ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో లిఫ్ట్, క్లార్నా మొదలైనవి ఉన్నాయి.

కాగా, హల్దీరామ్ భారతదేశంలో చాలా పెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. భారతీయ పోర్ట్‌ఫోలియోలో VLCC, లెన్స్‌కార్ట్, చాయోస్, డ్రీమ్ 11 మొదలైనవి ఉన్నాయి. కాగా, ఈ డీల్ కు సంబంధించి ఆల్ఫా వేవ్ లేదా హల్దిరామ్ ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 2023 అంచనాల ప్రకారం భారతదేశ స్నాక్ మార్కెట్ రూ. 42,694 కోట్లుగా ఉంటుందని ఈటీ నివేదిక పేర్కొంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పర్సనల్ పైనాన్స్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved