MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. జీతాల పెంపు, డిఏ విలీనంపై 5 కీలక డిమాండ్లు

8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. జీతాల పెంపు, డిఏ విలీనంపై 5 కీలక డిమాండ్లు

8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, డిఏ విలీనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ప్రధాన సంఘాల డిమాండ్ల పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 18 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేంద్ర ఉద్యోగులకు డబుల్ ధమాకా: కనీస వేతనం రూ.69 వేలు పెంపు?
Image Credit : chatgpt

కేంద్ర ఉద్యోగులకు డబుల్ ధమాకా: కనీస వేతనం రూ.69 వేలు పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, అలవెన్సులను పునఃసమీక్షించేందుకు 8వ కేంద్ర వేతన సంఘం విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతోంది. వచ్చే ఏడాది మే నాటికి ఫైనల్ రిపోర్టు సమర్పించాల్సి ఉన్నందున, వివిధ ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధుల నుంచి కమిషన్ అభిప్రాయాలను సేకరిస్తోంది.

ఈ పే కమిషన్ తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లతో కలిపి మొత్తం కోటి మందికి పైగా లబ్ధి చేకూర్చనున్నాయి. డిఫెన్స్, రైల్వే విభాగానికి చెందిన సిబ్బంది కూడా ఈ పరిధిలోకి వస్తారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 22, 23 తేదీల్లో ముంబైలో వివిధ ఎంప్లాయ్ యూనియన్లు, పెన్షనర్ అసోసియేషన్లతో పే కమిటీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బేసిక్ పేలో డిఏ విలీనం: ప్రధాన డిమాండ్
Image Credit : chatgpt

బేసిక్ పేలో డిఏ విలీనం: ప్రధాన డిమాండ్

ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న అతిపెద్ద డిమాండ్ కరవు భత్యం (డీఏ)ను ప్రాథమిక వేతనం లో విలీనం చేయడమే. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏ 50 శాతాన్ని దాటితే దానిని ప్రాథమిక వేతనంలో కలిపి వేయాలి. ప్రస్తుతం డిఏ ఇప్పటికే 60 శాతానికి చేరుకుంది.

ఇప్పటివరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రాథమిక వేతనం పెరిగితే దానికి అనుగుణంగా ప్రొవిడెంట్ ఫండ్ (పీఎఫ్), పెన్షన్, గ్యాట్యుటీల మొత్తం భారీగా పెరుగుతుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరిగి ఉద్యోగుల చేతికి వచ్చే మొత్తం జీతం గణనీయంగా పెరుగుతుంది.

35
కనీస వేతనం పెంపుపై యూనియన్ల ఒత్తిడి
Image Credit : Asianet News

కనీస వేతనం పెంపుపై యూనియన్ల ఒత్తిడి

కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ప్రాథమిక స్థాయి ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచాలని ప్రధాన ఎంప్లాయ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్‌సి-జెసిఎమ్, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయ్స్ ఫెడరేషన్ సంస్థలు కనీస వేతనాన్ని రూ. 69,000గా నిర్ణయించాలని కోరుతుండగా, మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ అసోసియేషన్ రూ. 65,000గా చేయాలని ప్రతిపాదించింది.

మరోవైపు ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కనీస జీతాన్ని రూ. 52,600కి సవరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే జనవరి 1, 2026 నాటి ధరల సూచీ ఆధారంగా కనీస వేతనాన్ని ఖరారు చేయాలని రైల్వేస్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ కమిషన్‌ను కోరింది.

45
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డిఏ లెక్కింపు విధానంలో మార్పులు
Image Credit : Asianet News

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డిఏ లెక్కింపు విధానంలో మార్పులు

పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతన సవరణ ఉండాలని యూనియన్లు గట్టిగా పట్టుబడుతున్నాయి. మహారాష్ట్ర అసోసియేషన్ కనీసం 4 శాతం డిఏ పెంపుతో పాటు 50 శాతం డిఏ విలీనాన్ని డిమాండ్ చేసింది. రైల్వే శాఖలో భద్రతకు సంబంధించిన కేటగిరీ పోస్టులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.92, 3.50, 3.80 స్థాయిల్లో అధికంగా వర్తింపజేయాలని ఐఆర్‌టిఎస్‌ఎ స్పష్టం చేసింది.

దీనితో పాటు, డీఏ లెక్కింపు సూత్రంలో మార్పులు తీసుకురావాలని ఎఐడిఇఎఫ్ రెండో సారి తన వినతులను అందజేసింది. తక్కువ వేతనం పొందే ఉద్యోగులు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని ఆహారం, విద్య, వైద్యం, ఇంటి అద్దె వంటి నిత్యావసరాలకే ఖర్చు చేస్తున్నందున, డిఏను మరింత రెక్టిఫై చేసి ప్రాక్టికల్ ప్రాతిపదికన లెక్కించాలని కోరింది.

55
సిఫార్సుల అమలు ఎప్పుడు? ఏళ్ల తరబడి నిరీక్షణ
Image Credit : Asianet News

సిఫార్సుల అమలు ఎప్పుడు? ఏళ్ల తరబడి నిరీక్షణ

8వ పే కమిషన్ నియమించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం.. కమిషన్ ఏర్పాటైన 18 నెలల్లోగా (నవంబర్ 3, 2025 నుండి) తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మే 2027 నాటికి కమిషన్ తన ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తుంది.

అయితే పే కమిషన్ రిపోర్టు ఇచ్చినప్పటికీ, దానిని పూర్తిగా పరిశీలించి అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వానికి మరో 2 నుండి 3 ఏళ్ల సమయం పట్టే అవకాశముంది. అంటే 2027లో జీతాల పెంపు ప్రకటన వచ్చినా, అది ఉద్యోగులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేసరికి 2029 లేదా 2030 సంవత్సరం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Recommended image2
Gold Price Hike: పసిడి ప్రియులకు మరో షాక్...తగ్గుతూ ఒక్కసారిగా బాంబ్ పేల్చిన బంగారం
Recommended image3
ATM పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుంది? దీని వెనుకున్న‌ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Recommended image2
World Best Cities: ప్రపంచంలో నంబర్ 1 నగరం ఏదో తెలుసా? టాప్ 7 బెస్ట్ సిటీల లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved