MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • 8th Pay Commission: ఉద్యోగులకు పండగే.. జీతాలు లేట్ అయితే ఏకంగా ₹93 లక్షల బోనస్ !

8th Pay Commission: ఉద్యోగులకు పండగే.. జీతాలు లేట్ అయితే ఏకంగా ₹93 లక్షల బోనస్ !

8th Pay Commission: 8వ వేతన సంఘం అమలు ఆలస్యమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ₹93 లక్షల వరకు బంపర్ అరియర్స్ లభించే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా బేసిక్ శాలరీ భారీగా పెరగనుంది. ఆ వివరాలు గమనిస్తే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
8వ వేతన సంఘం: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరకబోతున్నాయా?
Image Credit : Gemini

8వ వేతన సంఘం: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరకబోతున్నాయా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులు అమలుల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి. బేసిక్ శాలరీ నుంచి డియర్నెస్ అలవెన్స్ లెక్కల వరకు అన్నీ మారిపోతాయి.

అయితే, ఈ సిఫార్సుల అమలు ఆలస్యమైతే తమకు ఎంత అరియర్స్ లభిస్తుందనే ప్రశ్న ఉద్యోగుల మనస్సులో ఉంది. ఒకవేళ 8వ వేతన సంఘం అమలులో ఆలస్యం జరిగితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్స్‌కు లక్షల రూపాయల అరియర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆలస్యమైతే ఉద్యోగులకు లాటరీ తగిలినట్లేనా?
Image Credit : Getty

ఆలస్యమైతే ఉద్యోగులకు లాటరీ తగిలినట్లేనా?

8వ వేతన సంఘం సిఫార్సుల అమలు ఆలస్యమైతే కేంద్ర ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా అరియర్స్ ప్రయోజనం అందుతుంది. 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. ఆ తర్వాత 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలు చేయాలనే ప్లాన్ ఉంది. కానీ, కమిషన్ రిపోర్టు తయారీ, ప్రభుత్వ ఆమోదం పొందడానికి టైమ్ పట్టేలా కనిపిస్తోంది.

ఈ లేట్ కావడం వల్లే ఉద్యోగులకు అరియర్స్ రూపంలో భారీ లాభం కలగనుంది. ఇందులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఆధారంగానే కొత్త బేసిక్ శాలరీ ఎంత అనేది ఫిక్స్ అవుతుంది. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.0 - 2.87 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

35
సీనియర్ అధికారులకు భారీగా అరియర్స్
Image Credit : ChatGPT

సీనియర్ అధికారులకు భారీగా అరియర్స్

8వ వేతన సంఘం సిఫార్సులు లేట్ అయితే ఉద్యోగులకు అరియర్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందుతాయి. ముఖ్యంగా లెవెల్ 15 నుంచి లెవెల్ 18 వరకు ఉన్న సీనియర్ అధికారులకు ఈ అరియర్స్ ఏకంగా రూ. 90 లక్షల కంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. లెవెల్-15 నుంచి లెవెల్-18 కేటగిరీలో ప్రత్యేక కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, జీజీ స్థాయి అధికారులు, క్యాబినెట్ సెక్రటరీ లాంటి సీనియర్ అధికారులు ఉంటారు. ఈ లెవెల్ అధికారుల ప్రస్తుత బేసిక్ శాలరీ రూ. 1,82,200 నుంచి రూ. 2,50,000 వరకు ఉంటుంది.

45
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఉంటే లెక్కలు ఇవే !
Image Credit : Social Media

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఉంటే లెక్కలు ఇవే !

ఒకవేళ 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఫిక్స్ అయితే, లెవెల్ 15 నుంచి 18 వరకు ఉన్న ఉద్యోగులకు లక్షల్లో అరియర్స్ వస్తాయి. 20 నెలల అరియర్స్ బేస్ చేసుకుని లెక్కిస్తే, ఈ అమౌంట్ గరిష్ఠంగా రూ. 93 లక్షల వరకు చేరుకుంటుంది. అయితే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. అరియర్స్ ఫైనల్ క్యాలిక్యులేషన్ అనేది పే కమిషన్ సిఫార్సులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, 8వ వేతన సంఘం అమలులోకి వచ్చే ఫైనల్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.

ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.0 బేస్‌తో లెక్కిస్తే, ఈ అరియర్స్ రూ. 36 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉండొచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే బేసిక్ శాలరీతో పాటు అరియర్స్ కూడా పెరుగుతాయి.

55
అసలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?
Image Credit : ChatGPT

అసలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక మల్టిప్లయర్. దీని ఆధారంగానే పే కమిషన్ కేంద్ర ఉద్యోగుల బేసిక్ శాలరీని లెక్కిస్తుంది. కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు, పాత బేసిక్ శాలరీని ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించి కొత్త బేసిక్ శాలరీని డిసైడ్ చేస్తారు. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగగానే బేసిక్ శాలరీ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అరియర్స్ అన్నీ ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించారు. ఇది 2016 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image2
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image3
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Related Stories
Recommended image1
Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !
Recommended image2
ITR Filing 2026: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్.. మారిన డెడ్‌లైన్, ఐటీఆర్ ఫామ్స్‌లో కొత్త మార్పులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved