MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • ITR Filing 2026: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్.. మారిన డెడ్‌లైన్, ఐటీఆర్ ఫామ్స్‌లో కొత్త మార్పులు ఇవే

ITR Filing 2026: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్.. మారిన డెడ్‌లైన్, ఐటీఆర్ ఫామ్స్‌లో కొత్త మార్పులు ఇవే

ITR Filing 2026: ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. 2025-26 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్ నిబంధనలు మారాయి. నాన్ ఆడిట్ కేస్ గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఐటీఆర్ ఫామ్స్ 1, 2, 3, 4 లలో కీలక మార్పులు చేశారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2026, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐటీఆర్ ఫైలింగ్ 2026: ట్యాక్స్ పేయర్లు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే
Image Credit : social media

ఐటీఆర్ ఫైలింగ్ 2026: ట్యాక్స్ పేయర్లు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 ఐటీఆర్ ఫామ్స్‌లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ట్యాక్స్ చెల్లింపుల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి, డేటా ఆధారితంగా పరిశీలించడానికి వీలుగా ఈ మార్పులు తీసుకొచ్చారు. పెట్టుబడి లాభాలు, ట్రేడింగ్ యాక్టివిటీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డిడక్షన్ క్లెయిమ్‌లకు సంబంధించి ఇకపై మరిన్ని వివరాలు అందించాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 గడువు పొడిగింపు
Image Credit : Asianet News

ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 గడువు పొడిగింపు

ట్యాక్స్ ఫైలింగ్ క్యాలెండర్‌లో ఈసారి ఒక పెద్ద మార్పు జరిగింది. నాన్ ఆడిట్ కేసుల్లో ఐటీఆర్-3, ఐటీఆర్-4 రిటర్న్‌లను సమర్పించడానికి చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించారు. గతంలో ఈ రిటర్న్‌లను జూలై 31 లోపు ఫైల్ చేయాల్సి ఉండేది. ఈ అదనపు సమయం వ్యాపారవేత్తలు, నిపుణులు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అయితే, రిపోర్టింగ్ నిబంధనలు చాలా వివరంగా మారినందున, ఆర్థిక సమాచారాన్ని సేకరించడం టైమ్ తీసుకుంటుందని, ట్యాక్స్ పేయర్లు ఆలస్యం చేయకుండా ప్రిపేర్ అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

36
ఐటీఆర్-1 లో కొత్త వెసులుబాటు
Image Credit : Pixabay

ఐటీఆర్-1 లో కొత్త వెసులుబాటు

ఐటీఆర్-1 ఫామ్‌లో ఈ ఏడాది మరిన్ని మార్పులు తెచ్చారు. ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల ద్వారా ఆదాయం వచ్చే వారు గతంలో ఐటీఆర్-2 ఫామ్ ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రెండు రెసిడెన్షియల్ ప్రాపర్టీల నుంచి వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్-1 లోనే చూపించవచ్చు. 

46
ఐటీఆర్-2 లో క్యాపిటల్ గెయిన్స్ పారదర్శకత
Image Credit : ChatGPT

ఐటీఆర్-2 లో క్యాపిటల్ గెయిన్స్ పారదర్శకత

కొత్త ఐటీఆర్-2 ఫార్మాట్‌లో క్యాపిటల్ గెయిన్స్ రిపోర్టింగ్‌పై మరింత ఫోకస్ పెట్టారు. ఆస్తుల కొనుగోలు, విక్రయ తేదీలు, వచ్చిన మొత్తం, కొనుగోలు ఖర్చు వంటి ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలను ట్యాక్స్ పేయర్లు అందించాల్సి ఉంటుంది. దీనితో పాటు, షేర్ బైబ్యాక్ లావాదేవీల వల్ల వచ్చే నష్టాలను విడిగా చూపించడానికి ఈసారి ఫామ్‌లో ప్రత్యేక కాలమ్‌ను చేర్చారు. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇలాంటి లావాదేవీలను మరింత స్పష్టంగా పర్యవేక్షించడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

56
ఐటీఆర్-3 లో ట్రేడింగ్ కేటగిరీలు
Image Credit : freepik

ఐటీఆర్-3 లో ట్రేడింగ్ కేటగిరీలు

ట్రేడింగ్ చేసే వారికి ఐటీఆర్-3 లో పెద్ద మార్పు వచ్చింది. ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు, ఇంట్రాడే షేర్ ట్రేడింగ్, కమోడిటీ డీలింగ్స్, ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా వచ్చే లాభనష్టాలను ఇకపై విడివిడిగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ట్యాక్స్ ఆడిట్‌కు గురయ్యే వ్యాపారాలు, నిపుణుల కోసం కొన్ని ఆడిటర్ డిస్క్లోజర్ అవసరాలను ఈజీగా మార్చారు. దీనివల్ల పేపర్‌వర్క్ తగ్గి ఫైలింగ్ మరింత వేగంగా, సులువుగా పూర్తవుతుంది.

66
ఐటీఆర్-4 లో ప్రిజమ్టివ్ ట్యాక్స్ మార్పులు
Image Credit : freepik

ఐటీఆర్-4 లో ప్రిజమ్టివ్ ట్యాక్స్ మార్పులు

ప్రిజమ్టివ్ టాక్సేషన్ స్కీమ్‌ను ఎంచుకునే వ్యక్తులు, వ్యాపారాల కోసం ఐటీఆర్-4 లో వెసులుబాటు కల్పించారు. గరిష్ఠంగా రెండు ఇళ్ల నుండి వచ్చే ఆదాయాన్ని ఈ రిటర్న్‌లోనే చూపించుకోవచ్చు. దీనివల్ల ఫామ్ మార్చాల్సిన అవసరం రాదు. అలాగే సెక్షన్ 112A పరిధిలోకి వచ్చే లిస్టెడ్ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే రూ. 1.25 లక్షల వరకు ఉన్న దీర్ఘకాలిక మూలధన లాభాలను ఐటీఆర్-4 ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు రిపోర్ట్ చేయడానికి అనుమతించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image2
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image3
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Related Stories
Recommended image1
Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !
Recommended image2
Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved