- Home
- Business
- Personal Loan: మాయ మాటలు నమ్మకండి, పర్సనల్ లోన్ తీసుకొనే ముందు ఈ 7 విషయాలు తెలుసుకోండి
Personal Loan: మాయ మాటలు నమ్మకండి, పర్సనల్ లోన్ తీసుకొనే ముందు ఈ 7 విషయాలు తెలుసుకోండి
Personal Loan:ఈ కాలంలో పర్సనల్ లోన్ పొందడం చాలా సింపుల్. మీరు జస్ట్ గూగుల్ లో పర్సనల్ లోన్ అని సెర్చ్ చేస్తే చాలు.. గూగుల్ అల్గారిథమ్ ని ఫాలో అవుతున్న బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మీ కాంటాక్ట్ డీటైల్స్ సంపాదించి వారే మీకు కాల్ చేస్తారు. మీరు వద్దన్నా ఆఫర్స్ ఉన్నాయని, తక్కువ వడ్డీ రేటని, రాయితీలు ఇస్తున్నామని ఒప్పించి మరీ పర్సనల్ లోన్ ఇచ్చేస్తారు. అయితే వారి మాటలకు టెంప్ట్ అయి మీరు కమిట్ అయితే వడ్డీ రూపంలో మీరు చాలా ఎక్కువ డబ్బు కట్టాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకొనే ముందు ఈ విషయాలు ఓ సారి పరిశీలిస్తే ఫ్యూచర్ లో సమస్యలు రాకుండా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
1. అధిక వడ్డీ రేట్లు
సాధారణంగా చాలా మంది పర్సనల్ లోన్లు అత్యవసరమైతేనే తీసుకుంటారు. ఇదే ఆసరాగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీలు వసూలు చేస్తాయి. అత్యవసరం కాబట్టి ఇంకేం మాట్లాడకుండా పర్సనల్ లోన్ తీసుకుంటారు. కానీ వాటి వడ్డీ రేట్లు ఇతర లోన్ల కంటే ఎక్కువగా ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈఎంఐలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి.
2. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి
ఏదో చిన్న చిన్న అవసరాలకు తొందరపడి పర్సనల్ లోన్ తీసుకుంటే తర్వాత చాలా బాధ పడతారు. వడ్డీ తక్కువ ఉండే చోట మాత్రమే లోన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడండి. తక్కువ ఉన్న దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.
3. అవసరమైనంత మాత్రమే తీసుకోండి
పర్సనల్ లోన్ తీసుకొనేటప్పుడు మీరు ఎంచుకొనే ఈఎంఐ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెలా కట్టగలరు అనుకుంటేనే తీసుకోండి. ఎక్కువ లోన్ తీసుకొని, ఈఎంఐ ఎలాగోలా కట్టేంద్దాం అనుకుంటే ప్రతి నెలా మీకు ఈఎంఐ కట్టడం గండంగా మారుతుంది. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. దాని ద్వారా ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి.
4. సకాలంలో ఈఎంఐ చెల్లింపులు
మీరు ఈఎంఐలను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలి. ఎందుకుంటే ఈఎంఐలు కట్టడం ఆలస్యమైతే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్తు ఇతర లోన్లు తీసుకోవాలంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈఎంఐలు లేట్ గా కట్టడం వల్ల కూడా మీకు ఫైన్ లు పడతాయి. తర్వాత మీరు ఫైన్ లతో ఈఎంఐలు కట్టేసినా మీ సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది.
5. టెన్యూర్ తక్కువ పెట్టుకోండి
మీరు ఎంత పర్సనల్ లోన్ తీసుకున్నా టైమ్ పీరియడ్ మాత్రం తక్కువ పెట్టుకోండి. దీని వల్ల మీకు వడ్డీ తగ్గుతుంది. ఎక్కువ ఈఎంఐలు పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు కట్టడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కాని ఫైనల్ గా చూస్తే అధిక వడ్డీ కట్టారని మీకు అర్థమవుతుంది.
6. లోన్ నిబంధనలను అర్థం చేసుకోండి
పర్సనల్ లోన్ తీసుకొనే ముందే బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా చదవండి. అర్థం కాని విషయం ఉంటే అడిగి వివరంగా తెలుసుకోండి. అనుమానాలు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
7. ఫ్లాట్ రేట్లతో మోసపోకండి
ఒకవేళ ఏ బ్యాంకైనా, ఫైనాన్స్ కంపెనీ అయినా ఫ్లాట్ రేట్ పర్సనల్ లోన్లు ఇస్తుంటే మీరు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే అవి ప్రిన్సిపల్‌పై అంతటా ఒకే వడ్డీని వసూలు చేస్తాయి. దీనివల్ల మీరు భారీ మొత్తం జతచేసి లోన్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.