Samsung గెలాక్సీ ఫోన్లలో ఇన్ని సీక్రెట్ ఫీచర్లు ఉన్నాయా?
మీరు Samsung గెలాక్సీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. Samsung గెలాక్సీ ఫోన్లలో చాలామందికి తెలియని అద్భుతమైన ఫీచర్ల గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Samsung గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే ఫోన్లలో Samsung కంపెనీవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో సామ్సంగ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. అత్యంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ ఒకటి. ఈ ఫోన్‌లు చాలా మందికి తెలియని కొన్ని ఫీచర్లను కూడా అందిస్తాయి. ఈ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
1. Samsung గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ లో ‘బిక్స్‌బీ అసిస్టెంట్’తో వినియోగదారులు అనేక ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. యాప్‌లను నియంత్రించడం నుండి బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడం వరకు ప్రత్యేక సాధనాల ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. కెమెరా యాప్ నుండి నేరుగా టెక్స్ట్‌లను అనువదించడానికి ‘బిక్స్‌బీ విజన్’ మంచి ఆప్షన్.
2. Samsung గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ లో ‘ఎడ్జ్ ప్యానెల్స్’ సామ్సంగ్ గెలాక్సీ వినియోగదారులను ఆకర్షించే శక్తివంతమైన ఫీచర్. కానీ చాలా మంది గెలాక్సీ ఫోన్ ఉపయోగించే వారికి దీని గురించి ఇంకా తెలియదు. సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగదారులు ఒక సైడ్ నుండి స్వైప్ చేసినప్పుడు కొన్ని యాప్స్, సెట్టింగ్స్ ఉన్న జాబితా ఓపెన్ అవుతుంది. ఈ ఎడ్జ్-ప్యానెల్ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. దీని ద్వారా వినియోగదారులు యాప్‌లను త్వరగా యాక్సెస్ చేయవచ్చు. ఇదే కాకుండా ప్రత్యేక ‘గుడ్ లాక్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్‌లో అనేక ఆప్షన్స్ ని ఇక్కడి నుంచే ఆపరేట్ చేయొచ్చు.
4. WhatsApp వంటి యాప్‌లలో వీడియో కాల్ ఆప్షన్ ఉన్నప్పటికీ Samsung గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు One UI ఇంటర్‌ఫేస్ ఉపయోగిస్తే వీడియో కాల్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. సెట్టింగ్‌లకు వెళితే ఈ ఫీచర్ కనిపిస్తుంది.
ఈ ఫీచర్‌ను Google Meet, Zoom Meetings, WhatsApp వీడియో కాల్స్ కి కూడా ఉపయోగించవచ్చు.
5. సామ్సంగ్ గ్యాలరీ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఒక ప్రత్యేక ఫీచర్ ‘షేర్డ్ ఆల్బమ్’. దీని ద్వారా మీరు ఒక ఆల్బమ్‌ను క్రియేట్ చేసి ఇతరులకు షేర్ చేయొచ్చు. మీ స్నేహితులు ఈ ఆల్బమ్‌లోని ఫోటోలను చూడటమే కాకుండా, ఈ ఆల్బమ్‌కు అదనపు ఫోటోలను కూడా జోడించవచ్చు. ఈ యాప్ అడుగున కుడి వైపున ఉన్న ‘హాంబర్గర్ ఐకాన్’పై నొక్కడం ద్వారా మీరు ఆల్బమ్ తయారు చేయవచ్చు.