- Home
- Business
- Insurance Scheme: ఇంతకు మించిన బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందా? రూ.20కే రూ.2 లక్షల ప్రమాద బీమా
Insurance Scheme: ఇంతకు మించిన బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందా? రూ.20కే రూ.2 లక్షల ప్రమాద బీమా
Insurance Scheme: ఏ బీమా కంపెనీ అయినా రూ.20 లకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తుందా? కాని కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరిన వారికి రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తోంది. ఈ పాలసీ గురించి వివరంగా తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
పేదలకు వరంలా ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన
భారత ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది. అటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY). ప్రస్తుతం మన బిజీ లైఫ్ కి బీమా పాలసీని కలిగి ఉండటం చాలా అవసరం. కానీ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉండటంతో పేదలు బీమా పాలసీలు తీసుకోవడం లేదు. అలాంటి వారికి ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ఒక వరం లాంటిది.
సంవత్సరానికి రూ.20 ప్రీమియం
2015లో PMSBY ప్రారంభమైంది. కేవలం రూ.20 నామమాత్రపు వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. ఈ పథకం ప్రధానంగా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు, వారి కుటుంబాలకు ప్రమాదం జరిగినప్పుడు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. తద్వారా వారికి, వారి కుటుంబాలకు ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ స్కీమ్ లో చేరితే సంవత్సరానికి కేవలం రూ.20 కడితే సరిపోతుంది.
ప్రమాదం జరిగితే పరిహారం ఎంత ఇస్తారు?
ఈ పథకం కింద చేరిన పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి శాశ్వతంగా అంగవైకల్యం పొందితే రూ.2 లక్షలు పూర్తి పరిహారం లభిస్తుంది. కొంత అంగవైకల్యం కలిగితే రూ.1 లక్ష ఇస్తారు. కష్ట సమయాల్లో బాధిత కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందేలా ఈ ప్రయోజనాలు ఉన్నాయి.
ఎవరైనా ఈ బీమా పాలసీ తీసుకోవచ్చు
18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ బీమా పాలసీ తీసుకోవచ్చు. పాలసీ వ్యవధి ప్రతి సంవత్సరం. అంటే ప్రతి ఏడాది జూన్ 1 నుండి మే 31 వరకు వర్తిస్తుంది. ఏటా కట్టాల్సిన రూ.20 ప్రీమియం కూడా చందాదారుడి బ్యాంక్ ఖాతా నుండి ఆటోమెటిక్ గా డెబిట్ అవుతుంది. అందువల్ల రెన్యూవల్ ప్రాసెస్ చాలా సింపుల్ గా అయిపోతుంది.
మీరు గాని ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మీ బ్యాంక్ ద్వారా లేదా సమీపంలోని సామాన్య సేవా కేంద్రాన్ని(CSC) సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వండి.
అత్యవసర పరిస్థితుల్లో ఆదుకొనేందుకే ఈ పాలసీ
పేదలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదనే ఇంత తక్కువ ప్రీమియం నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన టాప్ లో నిలుస్తుంది.
మీరు ఇంకా ఈ బీమా చేయించుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకుని ఆర్థిక భరోసాని పొందండి.