14 carat Gold: 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్, పెళ్లిళ్ల సీజన్ వల్లే
14 carat Gold: పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. 22 క్యారెట్ బంగారం ధర తగ్గినా కూడా చాలామంది ఇప్పుడు 14 క్యారెట్ల బంగారు ఆభరణాలను ఎంచుకుంటున్నారు. వీటి సేల్ ఇప్పుడు అధికంగా ఉంటుంది.

14 క్యారెట్ల బంగారు ఆభరణాలు
పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లోనే భారీగా బంగారం కొని పెడతారు. కానీ 22 క్యారెట్ల బంగారం ధర కొండెక్కి కూర్చోవడంతో తక్కువ ధరకే వస్తున్న 14 క్యారెట్ బంగారు నగలను భారీగా కొంటున్నారు. వటి బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 14 క్యారెట్ల బంగారు నగలు కొనేవారి సంఖ్యం అధికంగానే ఉంది.
బంగారం ధరలు ఎలా పెరిగాయంటే..
ఈ ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈ ఏడాది జనవరి నుంచి బంగారం ధర 60 శాతానికి పైగా పెరిగిపోయాయి. దీంతో ఈ బంగారాన్ని కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. జాయ్ అలుక్కాస్, పీఎన్‌జీ, సెన్కో గోల్డ్, కళ్యాణ్ వంటి జ్యువెలర్స్ వారు చెబుతున్న ప్రకారం ఇప్పుడు తక్కువ బరువున్న లైట్ వెయిట్ నగల అమ్మకాలు పెరిగాయి. తక్కువ ధర, తక్కువ తయారీ ఛార్జీల వల్ల చాలామంది వీటిని కొంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది.
ఈ నగలే బెటర్ అని
బంగారం ధరలు ఆగకుండా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బంగారం రీసేల్ విలువ కూడా పెరిగింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 94,000 రూపాయలు కాగా, 14 క్యారెట్ల బంగారం 73,000 రూపాయలుగా ఉంది. జీఎస్టీ, తయారీ ఛార్జీలు తీసేసినా, ధరలు పెరుగుతుండటంతో వీటి అమ్మకం ధరలు అధికంగానే ఉన్నాయి.
లక్షల్లో పెళ్లిళ్లు
పెళ్లిళ్ల సీజన్ కావడంతో మనదేశంలో ఏకంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఇది బంగారు వ్యాపారస్తులకు శుభవార్త. పెళ్లిళ్లకు ఎక్కువ ఖర్చుపెట్టేలేక ఎక్కువ 14 క్యారెట్ల బంగారు ఆభరణాలను కొంటున్నారు. దీంతో వీటిలో ఎన్నో రకాల ట్రెండీ డిజైన్లు వచ్చేస్తున్నాయి.

