- Home
- Automobile
- Bikes
- Kawasaki Versys X 300: ఇండియాకు కవాసకి వెర్సిస్ X 300.. సూపర్ ఫీచర్లు.. ఈ బైక్ ధరెంతో తెలుసా?
Kawasaki Versys X 300: ఇండియాకు కవాసకి వెర్సిస్ X 300.. సూపర్ ఫీచర్లు.. ఈ బైక్ ధరెంతో తెలుసా?
Kawasaki Versys X 300 India: కవాసకి వెర్సిస్-X 300 భారత్‌లో విడుదలైంది. బిగినర్ అడ్వెంచర్ టూరింగ్ బైక్‌గా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఈ సూపర్ బైక్ ఫీచర్లు, ధరెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారత మార్కెట్ లోకి కవాసకి వెర్సిస్-X 300 బైక్
Kawasaki Versys X 300: ఇండియా కవాసకి మోటార్స్ తాజాగా 2025 వెర్షన్ వెర్సిస్-X 300 మోటార్‌సైకిల్‌ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ 296సీసీ ఇంజిన్‌తో వస్తోంది. ఇది బిగినర్స్‌కి అనువుగా ఉండేలా, అదే సమయంలో అడ్వెంచర్, టూరింగ్ అవసరాలను తీర్చగలిగేలా రూపొందించారు.
అడ్వెంచర్ ప్రపంచంలోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంట్రీ గా కవాసకి వెర్సిస్ x 300
గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా టూరింగ్ ప్రియులకు విశ్వసనీయంగా నిలిచిన కవాసకి వెర్సిస్ సిరీస్‌లో ఇప్పుడు కొత్తగా X 300 చేరింది. వెర్సిస్ 650, వెర్సిస్ 1100 లాంటి పెద్ద బైకుల తర్వాత, ఇప్పుడు కవాసాకి ఒక లైట్, అందుబాటు ధరలో లభించే అడ్వెంచర్ బైక్‌ను అందిస్తోంది.
సూపర్ ఫీచర్లతో కవాసకి వెర్సిస్-X 300
కవాసకి వెర్సిస్-X 300లో 296సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 11,500 RPM వద్ద 38.5bhp శక్తిని, 10,000 RPM వద్ద 26.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్, స్లిపర్ క్లచ్‌తో వస్తుంది. ఇది నగరాల్లో తేలికగా రైడ్ చేయడానికి, అలాగే శక్తివంతంగా సాగేందుకు సహాయపడుతుంది.
కవాసకి వెర్సిస్-X 300 ఫీచర్స్ హైలైట్స్
• 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, యూనీ-ట్రాక్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్
• 19 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక స్పోక్ వీల్స్
• 180mm గ్రౌండ్ క్లియరెన్స్
• 17 లీటర్ల ఇంధన ట్యాంక్
• టాల్ విండ్‌స్క్రీన్, అడ్వెంచర్ స్టైల్ ఫెయిరింగ్
లేటెస్ట్ ట్రెండీ డిజైన్
కవాసకి వెర్సిస్-X 300లో ఉన్న వైడ్ హ్యాండిల్‌బార్లు, నెరో సీట్, ఎర్గోనామిక్ గ్రాబ్ రైల్స్, పెద్ద పిలియన్ సీట్ వంటివి ప్రయాణికులకూ, రైడర్లకూ మంచి కంఫర్ట్ అందిస్తాయి. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎనలాగ్ టాకోమీటర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అభిరుచికి తగ్గ కస్టమైజేషన్
బైక్‌కి లగేజ్ ప్యాక్స్, ఫాగ్ ల్యాంప్స్, హ్యాండ్ గార్డ్స్, సెంటర్ స్టాండ్ వంటి అనేక జెన్యూయిన్ కవాసాకి యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి.
కవాసకి వెర్సిస్-X 300 ఏ రంగుల్లో లభిస్తుంది?
కవాసకి 2025 వెర్సిస్-X 300 రెండు డ్యూయల్-టోన్ రంగుల్లో అందుబాటులో ఉంది
1. మెటాలిక్ ఓషన్ బ్లూ / పియర్ల్ రోబోటిక్ వైట్
2. కాండీ లైమ్ గ్రీన్ / మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్
కవాసకి వెర్సిస్-X 300 బరువు 184 కిలోలు కాగా, లాంగ్ రైడ్స్ కోసం దీని డిజైన్ సరిపోతుంది. డెలివరీలు జూన్ 2025 నుండి దేశవ్యాప్తంగా కవాసాకి డీలర్‌షిప్‌లలో ప్రారంభం కానున్నాయి.
కవాసకి వెర్సిస్-X 300 బైకు ధర ఎంత?
కవాసకి వెర్సిస్-X 300 బైకు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్‌తో పోటీపడుతోంది. వాటితో పోలిస్తే వెర్సిస్-X 300 కొంచెం అధికధరతో లభిస్తోంది కానీ శక్తివంతమైన ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. హిమాలయన్ ధర రూ.2.85 లక్షల నుంచి మొదలవుతుంది, కేటీఎం 390 అడ్వెంచర్ రూ.3.68 లక్షలు (ఎక్స్-షోరూమ్). కవాసకి వెర్సిస్-X 300 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.79 లక్షలుగా ఉంది.
మొత్తంగా చెప్పాలంటే, కవాసకి వెర్సిస్-X 300 ఒక బిగినర్ ఫ్రెండ్లీ అడ్వెంచర్ బైక్‌గా నిలిచింది. టూరింగ్‌కు, వీకెండ్ ప్రయాణాలకు ఇది ఒక మంచి ఎంపికగా కనిపిస్తోంది.