గెట్ రెడీ.. కొత్త లుక్ తో యమహా ఆర్‌ఎక్స్ 100.. క్రేజీ స్టయిల్ లో యూత్ ని అట్రాక్ట్ చేసేలా..
యువతను జోష్ లో ముంచెత్తిన ఒకప్పటి యమహా ఆర్‌ఎక్స్ 100 మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కొత్త లుక్ అండ్ మరింత పవర్‌తో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. బైక్ లవర్స్ లో ఎంతో పాపులారిటీ పొందిన యమహా ఆర్ఎక్స్ 100 మళ్లీ రీఎంట్రీ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. Yamaha ఈ క్లాసిక్ బైక్ ని కొత్త లుక్ అండ్ ఎక్కువ పవర్ తో అప్‌డేట్ చేస్తోంది.
ఈ బైక్ కొత్త జనరేషన్ రైడర్‌లకు అనుకూలంగా రూపొందించబడింది. అప్‌డేట్ చేసిన Yamaha RX100 ఇంతకుముందు ఉన్న 100cc ఇంజిన్ నుండి హై అప్‌గ్రేడ్ చేయబడిన 200cc లేదా అంతకంటే ఎక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుందని భావిస్తున్నారు.
యమహా నుండి చాలా ఇష్టపడే మోడల్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించినప్పటికీ, దాని లాంచ్ అండ్ ఫీచర్ల గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ బైక్ 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
యమహా RX100 మొదటిసారిగా 1985లో ప్రవేశపెట్టారు. దీనిని 1996లో నిలిపివేయబడే వరకు బాగా పాపులరిటీ పొందింది. RX100 కొత్త వెర్షన్ 4-స్ట్రోక్ ఇంజన్‌తో వస్తుంది. రోడ్డుపై స్ట్రాంగ్ పవర్, టార్క్‌ను అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1 లక్ష వరకు ఉంటుందని అంచనా.
రాబోయే Yamaha RX100 డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్, రెట్రో-స్టైల్ డిజైన్‌తో ఉంటుంది. సిటీ రోడ్స్, ఆఫ్ రోడ్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కోసం మెరుగైన సౌకర్యాలతో వస్తుందని భావిస్తున్నారు.
LED హెడ్‌లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRL) కూడా ఉన్నాయి. ఒరిజినల్ Yamaha RX100 11 PS పవర్, 10.39 Nm టార్క్‌తో పాటు డ్రమ్ బ్రేక్స్ అందిస్తుంది. ముఖ్యంగా దినికి 10-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.