ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, రొమాంటిక్ కార్.. అబ్బో మాములుగా లేదు వేరే లెవెల్..
రోల్స్ రాయిస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును ఆవిష్కరించింది. దీని ఖరీదు అంచనా వేయడం అసాధ్యం. రోల్స్ రాయిస్ అత్యుత్తమ డిజైన్, ప్రశాంతత, రిలాక్సేషన్ ఇంకా హై సెక్యూరిటీతో కారు ప్రియులను ఆకర్షిస్తున్న రొమాంటిక్ కారును ఆవిష్కరించింది.
లగ్జరీ అండ్ ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పుడు రోల్స్ రాయిస్ అద్భుతమైన ఆర్కాడియా డ్రాప్‌టైల్ స్పెషల్ ఎడిషన్ కారును తిసుకొచ్చింది .
ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. కొన్ని నివేదికల ప్రకారం, ఈ కారు ధర సుమారు £25M. అంటే భారతీయ రూపాయిలలో 262 కోట్ల రూపాయలు అని చెప్పారు. అయితే దీని ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
రోల్స్ రాయిస్ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన వాచ్ పేస్ కలిగి ఉంది. దీనిని అసెంబుల్ చేయడానికి ఐదు నెలల సమయం, చెక్క విభాగాలను నిర్మించడానికి 8,000 గంటలు పట్టింది.
ఆర్కాడియా అనేది పురాతన గ్రీకు పురాణాలలో ఒక నగరం, దీని అర్థం 'భూమిపై స్వర్గం'. రోల్స్ రాయిస్ ఆధునిక చరిత్రలో డ్రాప్‌టైల్ మొదటి రోడ్‌స్టర్ బాడీ స్టైల్ వాహనం.
రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టైల్ ప్రత్యేకత ఏమిటంటే దాని నాణ్యత. ఈ కోచ్ కస్టమర్ లైఫ్ స్టయిల్ కి విలువను జోడిస్తుంది. సింప్లిసిటీ, ప్రశాంతత, బ్యూటీ అనే మూడు అంశాలతో కూడిన ఈ ప్రత్యేకమైన ఉత్పత్తిలో భాగమైనందుకు నేను గర్విస్తున్నాను. మా మోటార్ కార్ డెవలప్‌మెంట్ టీమ్ రూపొందించిన ఈ ఉత్పత్తి వ్యక్తిగత స్టయిల్, సెన్సిబిలిటీని పూరిస్తుంది” అని కారు డిజైన్ డైరెక్టర్ అండర్స్ వార్మింగ్ అన్నారు.
ఈ కారు రోల్స్ రాయిస్ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి ఇంకా లగ్జరీ కార్ సెగ్మెంట్‌లో ప్రత్యేకమైన కాన్సెప్ట్. ఈ విభాగంలో, మా డిజైనర్లు, ఇంజనీర్లు అలాగే హస్తకళాకారులు పూర్తిగా కొత్త ఆలోచనలకు జీవం పోయడానికి కలిసి పని చేస్తారు, సున్నితమైన మోటారు కార్లను సృష్టిస్తారు, ”అని రోల్స్ రాయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ బ్రౌన్‌రిడ్జ్ అన్నారు.
ఈ కారు ప్రశాంతతను అందించే స్టైలిష్ కారు. ఆర్కాడియా డ్రాప్‌టైల్ ప్రశాంతత, గౌరవానికి చిహ్నం. కస్టమర్ వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా దీనిని రూపొందించినట్లు డిజైన్ హెడ్ అలెక్స్ ఇన్నెస్ తెలిపారు.
ఇప్పుడు రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టైల్ ఆవిష్కరణ తర్వాత చాలా హల చల్ చేస్తోంది. ఈ కారు త్వరలో లాంచ్ కానుంది అండ్ అధికారిక ధర కూడా వెల్లడికానుంది.