MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Top EV Scooters : ఓలా vs టివిఎస్ vs బజాజ్.. అత్యధికంగా ఏ కంపెనీ ఈవి స్కూటర్లు అమ్ముడుపోతున్నాయో తెలుసా?

Top EV Scooters : ఓలా vs టివిఎస్ vs బజాజ్.. అత్యధికంగా ఏ కంపెనీ ఈవి స్కూటర్లు అమ్ముడుపోతున్నాయో తెలుసా?

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) డిమాండ్ మామూలుగా లేదు. దేశ రాజధాని ఢిల్లీ నుండి హైదరాబాద్ గల్లీదాక జనాలు ఈవీలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ అమాంతం పెరిగాయి... మరి ఏ స్కూటర్ ఎక్కువగా అమ్ముడుపోయిందో చూద్దామా!

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 16 2026, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెప్టెంబర్ లో దుమ్ములేపిన ఈవి స్కూటర్ సేల్స్
Image Credit : X

సెప్టెంబర్ లో దుమ్ములేపిన ఈవి స్కూటర్ సేల్స్

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj), విడా (Vida), ఓలా (Ola) కంపెనీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇండియాలో పెట్రోల్ స్కూటర్లకు డిమాండ్ తగ్గుతోంది, దీంతో ఈవి స్కూటర్లు అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కస్టమర్ల ఆసక్తికి తగ్గట్లుగా కంపెనీలు ఈవి స్కూటర్లకు రెడీ చేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం పండగల సీజన్ కొనసాగుతోంది… ఈ నేపథ్యంలో ఈవి స్కూటర్ల అమ్మకాలు పెరిగాయి. గత నెల సెప్టెంబర్ లో అమ్మకాలు పుంజుకున్నాయి… అక్టోబర్ లో మరింత జోరందుకున్నాయి. గతనెలలో (సెప్టెంబర్ 2026) సేల్స్ లెక్కలు చూస్తే.. అంచనాలకు మించి స్కూటర్లు అమ్ముడుపోయాయి. అయితే అత్యధికంగా టీవీఎస్ కంపెనీ ఈవి స్కూటర్లను అమ్మి ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టివిఎస్ సెప్టెంబర్ లో ఎన్ని ఈవి స్కూటర్లు అమ్మిందో తెలుసా?
Image Credit : TVS

టివిఎస్ సెప్టెంబర్ లో ఎన్ని ఈవి స్కూటర్లు అమ్మిందో తెలుసా?

టీవీఎస్ కంపెనీ గతనెలలో (సెప్టెంబర్‌ 2026) దేశవ్యాప్తంగా ఏకంగా 54,037 యూనిట్ల ఈవి స్కూటర్లు అమ్మి మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సేల్స్ 125.87 శాతం పెరిగాయి. టీవీఎస్ ఐక్యూబ్ మోడల్ స్పోర్టీ లుక్ కోరుకునే వాళ్లను బాగా ఆకట్టుకుంటోంది… ఇలాంటి అనేక టివిఎస్ స్కూటర్లు కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి.

35
బజాజ్ (Bajaj)
Image Credit : stockPhoto

బజాజ్ (Bajaj)

బజాజ్ కంపెనీ సెప్టెంబర్ 2026లో 48,429 యూనిట్ల ఈవి స్కూటర్లను అమ్మి రెండో స్థానంలో నిలిచింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 138.87 శాతం ఎక్కువ. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనాలు బాగా ఇష్టపడుతున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర, నమ్మకమైన క్వాలిటీతో చేతక్ ప్రీమియం, చేతక్ అర్బన్ మోడల్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

45
ఏథర్ ఎనర్జీ (Ather Energy)
Image Credit : Website/konarc

ఏథర్ ఎనర్జీ (Ather Energy)

గతనెల అత్యధిక ఈవి వాహనాలను అమ్మిన కంపెనీల జాబితాలో ఏథర్ మూడో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌ 2026 లో ఈ కంపెనీ 30,533 యూనిట్స్ ఈవి స్కూటర్స్ అమ్మింది. ఏటేటా చూసుకుంటే ఏథర్ 55.62 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది.

55
హీరో విడా (Hero Vida)
Image Credit : ‍X

హీరో విడా (Hero Vida)

హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా సెప్టెంబర్ 2026లో 24,321 యూనిట్లను అమ్మింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 83.24 శాతం వృద్ధిని సాధించింది. విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో మోడల్స్ జనాలకు బాగా నచ్చాయి.

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)

మిగతా కంపెనీలతో పోలిస్తే ఓలా సేల్స్ విషయంలో కాస్త వెనుకబడింది. ఈ సెప్టెంబర్‌లో ఓలా మొత్తం 13,451 ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే అమ్మింది. కిందటి ఏడాదితో పోలిస్తే కేవలం 2.96 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. ఓలా ఎస్1 ఎక్స్ సిరీస్, ఓలా ఎస్1 ఎయిర్, ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఓలా ఎస్1 ప్రో (జెన్ 2) మోడల్స్ జనాలను ఆకర్షించాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tesla Roadster: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది.. రాకెట్ టెక్నాలజీతో టెస్లా రోడ్‌స్టర్ ఫ్లయింగ్ కార్ ఇదే
Recommended image2
Bike Mileage : మీ బైక్ పెట్రోల్ ను నీళ్లలా తాగేస్తోందా..? మైలేజ్ అమాంతం పెంచేసే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి
Recommended image3
62.5 kmpl మైలేజ్, అదిరిపోయే ఫీచర్స్ తో... మార్కెట్లోకి 125cc హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది
Related Stories
Recommended image1
EV battery replacement Cost : ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ మార్చాలంటే ఎంత ఖర్చవుతుంది?
Recommended image2
EV Car : సింగిల్ ఛార్జ్‌తో 600 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. 2 టన్నుల బరువునైనా మోసే సూపర్ ఈవి కారు ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved