MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Small Cars in India : చిరు ఉద్యోగులు, వ్యాపారుల కోసం.. రూ.5 లక్షలలోపు బడ్జెట్లో వచ్చే టాప్ 5 కార్లు ఇవే

Small Cars in India : చిరు ఉద్యోగులు, వ్యాపారుల కోసం.. రూ.5 లక్షలలోపు బడ్జెట్లో వచ్చే టాప్ 5 కార్లు ఇవే

మీ నగరంలో కారు డ్రైవింగ్, పార్కింగ్ పెద్ద తలనొప్పిగా మారిందా? అయితే చింతించకండి. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చి, సిటీ ప్రయాణాలను సులభం చేసే టాప్ 5 చిన్న కార్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 23 2026, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సిటీలో ప్రయాణాానికి బెస్ట్ కార్లు ఇవే..
Image Credit : gemini ai

సిటీలో ప్రయాణాానికి బెస్ట్ కార్లు ఇవే..

భారతీయ నగరాల్లో ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోంది... హైదరాబాద్ ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో పెద్ద కార్లలో ప్రయాణం చాలా కష్టం. ఇక బాగా డెవలప్ అయిన హైటెక్ సిటీ, మాధాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయాయి.. ఇరుకైన రోడ్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, పార్కింగ్ ఇబ్బందులు తప్పడంలేదు. ఇది ఏ ఒక్కరోజో, రెండ్రోజుల సమస్యో కాదు… నిత్యం వేదించేది. అందుకే ఇలాంటి కష్టాలను తట్టుకోవాలంటే పెద్దపెద్ద లగ్జరీ కార్లు కాదు చిన్న కార్లే బెస్ట్ ఆప్షన్. సిటీ ప్రయాణాలకు సరిగ్గా సరిపోయే 5 చిన్న కార్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి… వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
MG Comet EV – ఇండియాలో అత్యంత చిన్న కారు ఇదే
Image Credit : Gemini

MG Comet EV – ఇండియాలో అత్యంత చిన్న కారు ఇదే

ప్రస్తుతం ఇండియాలో అమ్ముడవుతున్న కార్లలో MG Comet EV (ఎంజి కామెట్ ఈవి) అత్యంత చిన్నది. దీని పొడవు కేవలం 2,974 మిమీ మాత్రమే… అంటే 3 మీటర్ల కంటే తక్కువ. ఈ ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా సిటీ ట్రాఫిక్ కోసమే డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా ఇరుకైన ప్రదేశాల్లో కూడా దీన్ని నడపవచ్చు, సులభంగా పార్క్ చేయవచ్చు. 

ఎంజీ కామెట్ ఈవి ముఖ్యమైన ఫీచర్లు

పొడవు : 2,974 మిల్లి మీటర్లు 

ఎలక్ట్రిక్ రేంజ్ : సుమారు 230 కిలోమీటర్లు 

ప్రారంభ ధర : రూ. 4.92 లక్షల నుంచి 

సిటీస్ లో రోజూ ఆఫీసుకు, వ్యాపార పనులకు బయటకు వెళ్లేవారికి ఎంజీ కామెట్ ఈవి ఒక మంచి ఎంపిక.

Related Articles

Related image1
Car Cleaning Tips: వాషింగ్ సెంటర్ తో పనే లేదు.. 10 రూపాయలతో మీ కారును తళతళలా మెరిసేలా చేయండి
Related image2
Car Tips: కారు సైడ్ అద్దాలు ఎలా సెట్ చేసుకోవాలో 90 శాతం మందికి తెలియదు.. మ‌రి మీకు.?
36
Maruti Suzuki Alto K10 – చిన్నకార్లలో బడ్జెట్ కింగ్ ఇదే
Image Credit : stockPhoto

Maruti Suzuki Alto K10 – చిన్నకార్లలో బడ్జెట్ కింగ్ ఇదే

మారుతి సుజుకి ఆల్టో K10 ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న కారు. తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు దీని బలాలు. 

 మారుతి సుజుకి ఆల్టొ K10 ముఖ్య ఫీచర్లు

పొడవు : 3,530 మిమీ

మైలేజ్: 24.3 – 33.8 కిమీ/లీటర్ (CNG)

ప్రారంభ ధర: రూ. 3.70 లక్షలు 

మొదటిసారి కారు కొనేవారికి మారుతి సుజుకి ఆల్టో సరైన ఎంపిక. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి ఆల్టో K10 ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్.

46
Maruti Suzuki S-Presso – మినీ SUV అనుభవం
Image Credit : stockPhoto

Maruti Suzuki S-Presso – మినీ SUV అనుభవం

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో చిన్న కారే అయినా SUV లాంటి ఎత్తైన సీటింగ్ పొజిషన్‌ కలిగివుంది.. అందుకే ఇందులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత. 

మారుతి ఎస్-ప్రెస్సో ముఖ్య ఫీచర్లు

పొడవు: 3,565 మిమీ 

మైలేజ్: 24.4-32.7 కిమీ/లీటర్ 

ప్రారంభ ధర: రూ. 3.50 లక్షలు 

ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది… కాబట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాడాలనుకునే కస్టమర్లకు ఎస్-ప్రెస్సో పర్ఫెక్ట్ ఛాయిస్. 

56
Maruti Suzuki Celerio – మైలేజ్ ఛాంపియన్ కారు ఇదే
Image Credit : stockPhoto

Maruti Suzuki Celerio – మైలేజ్ ఛాంపియన్ కారు ఇదే

ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్ల జాబితాలో మారుతి సుజుకి సెలెరియో ముందు వరుసలో ఉంది. 

మారుతి సుజుకి సెలెరియో ముఖ్య ఫీచర్లు

పొడవు: 3,695 మిమీ 

మైలేజ్: 25.1 – 34.4 కిమీ/లీటర్ 

ప్రారంభ ధర: రూ. 4.70 లక్షలు 

AMT ఆటోమేటిక్ సౌకర్యం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

66
Maruti Suzuki Wagon R – తక్కువ ధరలో ఫ్యామిలీ కారు
Image Credit : CHATGPT

Maruti Suzuki Wagon R – తక్కువ ధరలో ఫ్యామిలీ కారు

ఏళ్లుగా భారతీయ కుటుంబాల నమ్మకాన్ని చూరగొన్న కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. ఇది చిన్న సైజులో ఉన్నప్పటికీ, లోపల ఎక్కువ స్పేస్‌ను అందిస్తుంది. అందుకే ఓ ఫ్యాామిలీ సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 

మారుతి సుజుకి వ్యాగనార్ ముఖ్య ఫీచర్లు

 పొడవు: 3,655 మిమీ 

మైలేజ్: 23.5 – 34 కిమీ/లీటర్ 

ప్రారంభ ధర: రూ. 4.99 లక్షలు 

కుటుంబానికి సరిపోయే క్యాబిన్ స్పేస్ 'టాల్-బాయ్' డిజైన్, లోపల ఎక్కువ హెడ్‌రూమ్ ఉండటం ఈ  వ్యాగనార్ ప్రధాన బలం. 

ఏది బెస్ట్ ఛాయిస్? 

చిన్న సైజు EV కావాలా? – MG కామెట్ EV 

తక్కువ బడ్జెటా? – ఆల్టో K10 

SUV లాంటి లుక్ కావాలా? – S-Presso 

ఎక్కువ మైలేజా? – సెలెరియో 

ఫ్యామిలీ వాడకమా? – వ్యాగన్ ఆర్ 

సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి, పార్కింగ్ చేయడానికి, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి 2026లో ఈ 5 కార్లు ఉత్తమ ఎంపికలు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఛార్జింగ్ అయిపోతే ఎంచక్కా తొక్కుతూ వెళ్లిపోవచ్చు. అదిరిపోయే ఎలక్ట్రిక్ మొపెడ్
Recommended image2
Royal Enfield EV : రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర, రేంజ్ ఎంతో తెలుసా?
Recommended image3
ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.?
Related Stories
Recommended image1
Car Cleaning Tips: వాషింగ్ సెంటర్ తో పనే లేదు.. 10 రూపాయలతో మీ కారును తళతళలా మెరిసేలా చేయండి
Recommended image2
Car Tips: కారు సైడ్ అద్దాలు ఎలా సెట్ చేసుకోవాలో 90 శాతం మందికి తెలియదు.. మ‌రి మీకు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved