MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Best Mileage Cars : ఈవి, సీఎన్‌జీ లతో పనే లేదు.. వీటిని తలదన్నేలా మైలేజ్ ఇచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు ఇవే

Best Mileage Cars : ఈవి, సీఎన్‌జీ లతో పనే లేదు.. వీటిని తలదన్నేలా మైలేజ్ ఇచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు ఇవే

తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ధర, ఇంజిన్, మైలేజ్ పరంగా ఇండియాలోని 5 అత్యుత్తమ ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 29 2026, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బెస్ట్ మైలేజ్ పెట్రోల్ కార్లు
Image Credit : stockPhoto

బెస్ట్ మైలేజ్ పెట్రోల్ కార్లు

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లపై కస్టమర్ల ఆసక్తి పెరుగుతోంది. రోజూ ఆఫీస్‌కు, వ్యాపారానికి లేదా కుటుంబ అవసరాలకు కారు వాడేవాళ్లు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లే మోడళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాహనాల మైలేజ్‌ను ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ధృవీకరిస్తుంది… ఆ లెక్కల ప్రకారం ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఐదు కార్ల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెస్ట్ పెట్రోల్-హైబ్రిడ్ కార్లు
Image Credit : Maruti Suzuki

బెస్ట్ పెట్రోల్-హైబ్రిడ్ కార్లు

ఈ జాబితాలో మారుతి సుజుకి ఇన్విక్టో స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ టాప్‌లో ఉంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఈ డ్యూయల్ పవర్ సిస్టమ్ మంచి పనితీరుతో పాటు తక్కువ ఇంధనంతో బెస్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ARAI టెస్టింగ్ ప్రకారం ఇది లీటర్ పెట్రోల్‌కు 28.65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని తర్వాత టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లు ఉన్నాయి. ఇవి లీటర్‌కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని కంపెనీలు చెబుతున్నాయి.

35
హోండా కార్లలో బెస్ట్ మైలేజ్
Image Credit : X

హోండా కార్లలో బెస్ట్ మైలేజ్

సెడాన్ కార్లను ఇష్టపడేవారికి హోండా సిటీ హైబ్రిడ్ మంచి ఆప్షన్. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేయడం వల్ల పర్ఫార్మెన్స్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ రెండూ బాగుంటాయి. ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 27.26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని సర్టిఫై చేశారు. లాంగ్ డ్రైవ్‌లకు, సిటీ ప్రయాణాలకు ఇది చాలా అనువుగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.
45
మారుతి సుజుకి మైలేజ్ కార్లు
Image Credit : maruti suzuki

మారుతి సుజుకి మైలేజ్ కార్లు

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ కోరుకునే కస్టమర్లకు మారుతి సుజుకి సెలెరియో బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా దీని ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్లు కూడా దాదాపు 25 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి. 

ఇక కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ కూడా తక్కువ ఇంధనంతో మంచి మైలేజ్ ఇస్తుంది. దీని ఆటోమేటిక్ మోడల్ లీటర్‌కు 25.75 కిలోమీటర్లు, మాన్యువల్ మోడల్ 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని చెబుతున్నారు.

55
గమనిక
Image Credit : maruti suzuki

గమనిక

అయితే ఈ మైలేజ్ లెక్కలన్నీ ల్యాబ్ టెస్టుల ఆధారంగా ఇచ్చినవని గుర్తుంచుకోవాలి. నిజ జీవితంలో డ్రైవింగ్ చేసే విధానం, రోడ్ల క్వాలిటీ, ట్రాఫిక్, వాహన నిర్వహణ, బరువు, వాతావరణం వంటి అనేక కారణాల వల్ల మైలేజ్‌లో మార్పులు ఉంటాయి. కాబట్టి కారు కొనేటప్పుడు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చు, సేఫ్టీ ఫీచర్లు, వాడుక అవసరాలు వంటివి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Offers : అక్టోబర్ లో ఈ కారు కొంటే.. ఏకంగా రూ.2.34 లక్షలు సేవ్
Recommended image2
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Recommended image3
Top 5 Budget Cars : ఈ దసరాకి కొత్తకారు ప్లాన్ చేస్తున్నారా? రూ.10 లక్షల్లోపు బడ్జెట్లో టాప్-5 కార్లు ఇవే
Related Stories
Recommended image1
Car Mileage Tips : కారు ఏ స్పీడ్ లో నడిపితే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? తెలుసుకుంటే పెట్రోల్ ఖర్చులు కంట్రోలే..!
Recommended image2
Best CNG Cars : ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు సరిగ్గా సెట్టయ్యే టాప్ 7 డ్యూయల్ సిఎన్జీ కార్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved