రూ.60,000 కంటే తక్కువధరకే .. టాప్ 5 బడ్జెట్ ప్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లివే
తక్కువ బడ్జెట్‌లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? అయితే Ola Gig, Komaki XGT KM, Zelio Knight+, Evolet Pony, Odysse HyFy లాంటి 5 బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇక్కడ చూడండి.

తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్స్ లిస్ట్
తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే కేవలం రూ.60,000 లోపు కొన్ని మంచి ఆప్షన్లు ఇండియాలో ఉన్నాయి. పెట్రోల్ ఖర్చు, మెయింటెనెన్స్ తగ్గించుకోవడమే కాదు బడ్జెట్ ధరలో ఈవి స్కూటర్ పొందవచ్చు. ఇలా 5 బెస్ట్ బడ్జెట్ ev-Scooters లిస్ట్ ఇక్కడ ఉంది.
ఓలా గిగ్ (Ola Gig)
ముందుగా ఓలా గిగ్ (Ola Gig) గురించి తెలుసుకుందాం. ఇది కేవలం రూ.39,999 నుండి రూ.49,999 ధరలో లభిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. బ్యాటరీ స్వాపింగ్ ఉండటం వల్ల లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్లకి, డెలివరీ చేసేవాళ్లకి బాగుంటుంది.
కోమకి ఎక్స్జిటి-కెఎం (Komaki XGT-KM)
కోమకి ఎక్స్జిటి-కెఎం (Komaki XGT-KM) కూడా బడ్జెట్ ధరలో లభించే ఈ-స్కూటర్. దీని ధర ₹59,999 ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60–65 కి.మీ వెళ్తుంది. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి స్టూడెంట్స్, సిటీ రైడర్స్ కి బాగుంటుంది.
జెలో నైట్ ప్లస్ (Zelo Knight+)
జెలో నైట్ ప్లస్ (Zelo Knight+) ధర ₹59,990. 100 కి.మీ. వరకు రేంజ్. క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్ ఉంది. దీనివల్ల ఈజీగా, కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు.
ఎవోలెట్ పోని (Evolet Pony)
ఎవోలెట్ పోని (Evolet Pony) ev స్కూటర్ ధర ₹57,999. రేంజ్ 80 కి.మీ. డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్, డిజిటల్ డిస్ప్లే, USB ఛార్జింగ్, మొబైల్ యాప్ కనెక్షన్, e-ABS లాంటి ఫీచర్స్ ఉన్నాయి. స్టైలిష్ లుక్, టెక్ ఫీచర్స్ కావాలనుకునేవాళ్లకి మంచిది.
ఒడిస్సె హైఫై (Odysse HyFy)
అతి తక్కువ ధరకే ఒడిస్సె హైఫై (Odysse HyFy) ఈవీ మార్కెట్లో ఉంది. దీని ధర ₹42,000. 70 కి.మీ. రేంజ్. బేసిక్ ఫీచర్స్ తో సిటీ యూజర్స్, కొత్త EV యూజర్స్ కి మంచి “ఎంట్రీ లెవెల్” ఆప్షన్.
మీ ఆప్షన్ ని బట్టి ఎంచుకొండి
మొత్తానికి ఎక్కువ రేంజ్ కావాలంటే Ola Gig, Zelio Knight+… ఫీచర్స్ ఎక్కువ కావాలంటే Evolet Pony… తక్కువ బడ్జెట్ లేదా కొత్తగా EV వాడేవాళ్లకి Odysse HyFy… లైసెన్స్ లేకుండా ఈజీగా వాడాలంటే Komaki XGT KM బెస్ట్. ఇవన్నీ ₹60,000 లోపు దొరుకుతాయి.