- Home
- Automobile
- Top 3 Bikes : 50 కి.మీ మైలేజ్, 350 సీసీ పవర్ తో.. ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉన్న టాప్ 3 బైక్స్
Top 3 Bikes : 50 కి.మీ మైలేజ్, 350 సీసీ పవర్ తో.. ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉన్న టాప్ 3 బైక్స్
Top 3 Bikes : బైక్ కొనాలనుకున్నప్పుడు ధర, మైలేజ్, కస్టమర్లు ఇచ్చే రేటింగ్స్ ముఖ్యం. అలాంటి కస్టమర్ రేటింగ్స్‌లో ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో టాప్ 3 స్థానాల్లో నిలిచిన బైక్స్ ఏవి? వాటి ధర ఎంత? లీటర్ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి?

ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉన్న టాప్ 3 బైక్స్
ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో కొత్త బైక్ కొనాలనుకున్నప్పుడు.. కేవలం ఇంజిన్ కెపాసిటీ, ధర మాత్రమే చూస్తే సరిపోదు. ఆ బైక్ కొని వాడుతున్న కస్టమర్ల ఎక్స్పీరియన్స్, రివ్యూలు కూడా సరైన నిర్ణయం తీసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి.
పాపులర్ ఆటోమొబైల్ వెబ్సైట్ బైక్‌వాలే (BikeWale) యూజర్ల రేటింగ్స్ ప్రకారం.. ఇండియాలో అత్యంత ఆదరణ, నమ్మకం పొందిన టాప్ 3 బైక్స్‌గా యమహా ఆర్15 వీ4 (Yamaha R15 V4), రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350), బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 (Bajaj Pulsar NS200) నిలిచాయి. వీటి ధర, మైలేజ్, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
యమహా ఆర్15 వీ4 (Yamaha R15 V4)
కాలేజ్ కుర్రాళ్లు, యూత్ డ్రీమ్ బైక్ అయిన యమహా ఆర్15 వీ4.. దాదాపు 1,569 మంది యూజర్ల రేటింగ్స్‌తో 5కి 4.8 పాయింట్లు సాధించి ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. రేసింగ్ ట్రాక్ సూపర్‌బైక్ లాంటి అగ్రెసివ్ డిజైన్, షార్ప్ హ్యాండ్లింగ్‌కి ఈ బైక్ పెట్టింది పేరు.
ఇంజిన్ & పవర్ - ఇందులో 155 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.1 బీహెచ్పీ (BHP) పవర్‌ని ఇస్తుంది.
మైలేజ్ & ధర - స్పోర్ట్స్ బైక్ అయినా సరే లీటర్ పెట్రోల్‌కి దాదాపు 46 కి.మీ సర్టిఫైడ్ మైలేజ్ ఇవ్వడం దీని స్పెషాలిటీ. దీని సగటు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.76 లక్షలు. స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)
రాయల్ లుక్, కంఫర్టబుల్ రైడింగ్ ఇష్టపడే వారికి ఫేవరెట్ మోడల్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. దాదాపు 1,895 యూజర్ల రేటింగ్స్‌తో 5కి 4.7 పాయింట్లు తెచ్చుకుని ఇది రెండో ప్లేస్‌లో నిలిచింది. దీని కాంపాక్ట్ డిజైన్, తక్కువ సీట్ హైట్ వల్ల సిటీ ట్రాఫిక్‌లో, వీకెండ్ హైవే ట్రిప్స్‌లో చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు.
ఇంజిన్ & పవర్ - ఇందులో 349.34 సీసీ పెద్ద ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
మైలేజ్ & ధర - ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కి సుమారు 36.2 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని సగటు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.38 లక్షలుగా ఉంది.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 (Bajaj Pulsar NS200)
పెద్దగా బడ్జెట్ పెట్టకుండానే 200 సీసీ సెగ్మెంట్లో అదిరిపోయే స్పీడ్, మస్కులర్ లుక్ కోరుకునే యూత్‌కి ఫస్ట్ ఛాయిస్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200. సుమారు 3,360 మంది యూజర్ల రివ్యూలతో 5కి 4.7 పాయింట్లు దక్కించుకుని ఇది మూడో ప్లేస్‌లో ఉంది.
ఇంజిన్ & పవర్ - ఇందులో పవర్ఫుల్ 199.5 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 25.15 బీహెచ్పీ అదిరిపోయే పవర్‌ని ఇస్తుంది.
మైలేజ్ & ధర - ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కి సుమారు 36 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని సగటు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 1.39 లక్షలు. పవర్, స్ట్రీట్‌ఫైటర్ లుక్ ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్.
మీకు ఏది కరెక్ట్?
ఈ 3 బైక్స్ కస్టమర్ల నుంచి బెస్ట్ రేటింగ్స్ తెచ్చుకున్నవే. కాబట్టి మీ అవసరాన్ని బట్టి సరైనది ఎంచుకోవచ్చు. పక్కా రేసింగ్ స్పోర్ట్స్ బైక్ లుక్, మంచి మైలేజ్ కావాలనుకుంటే యమహా ఆర్15 వీ4 చూడొచ్చు. రాయల్ రెట్రో రోడ్‌స్టర్ లుక్, రిలాక్స్డ్ రైడింగ్ కావాలనుకునే వాళ్లు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక తక్కువ బడ్జెట్లో టాప్ స్పీడ్, పవర్ఫుల్ ఇంజిన్ కావాలనుకునే కుర్రాళ్లకు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.















