Top Cars : హ్యుందాయ్ నుండి కొత్త కారు.. ఇలా లాంచ్ అయ్యిందో లేదో అలా టాప్ 10 లోకి
హ్యుందాయ్ నుండి కొత్తగా వచ్చిన బేయాన్ తన తొలి నెల అమ్మకాల్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఈ ఎస్‌యూవీ అక్టోబర్ నెలలో ఏకంగా 3,499 యూనిట్లు అమ్ముడుపోయింది.

హ్యుందాయ్ బేయాన్ ఆరంభమే అదుర్స్
హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త ఎస్‌యూవీ బేయాన్, మొదటి నెలలోనే మంచి అమ్మకాలను నమోదు చేసింది. 2026 అక్టోబర్ 26న మార్కెట్లోకి వచ్చిన ఈ కారు, ఆ ఒక్క నెలలోనే 3,449 యూనిట్లు అమ్ముడైంది. హ్యుందాయ్ మొత్తం కార్ల జాబితాలో ఈ మోడల్ ఏడో స్థానంలో నిలిచింది. కొత్త కారు మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి అమ్మకాల సంఖ్యను చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
క్రెటా కంటే చిన్న సైజు.. ధర ఎంతంటే?
హ్యుందాయ్ బేయాన్ ఇదే సంస్థకు చెందిన పాపులర్ మోడల్ క్రెటాతో పోటీ పడేలా కనిపిస్తోంది. ఈ బేయాన్ పొడవు 4,245 మి.మీ… అదే క్రెటా పొడవు సుమారు 4,330 మి.మీ… అంటే బేయాన్ పరిమాణంలో కాస్త చిన్నది. అయితే మిగతా అన్ని విషయాల్లో క్రెటాకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందట.
ఈ బేయాన్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. టాప్ ఎండ్ మోడల్ ధర రూ.18.14 లక్షల వరకు ఉంటుంది. మారుతి విక్టోరిస్, గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టాటా సియెర్రా లాంటి కార్లతో కూడా ఇది పోటీపడుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్ ప్రత్యేకత
ఈ హ్యుందాయ్ బేయాన్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత వాయిస్ అసిస్టెంట్. సాధారణ వాయిస్ కమాండ్స్‌కే పరిమితం కాకుండా, సహజమైన సంభాషణల్లాగా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందే సౌకర్యం ఇందులో ఉంది. ప్రయాణ ప్రణాళిక, వాతావరణం, రెస్టారెంట్లు, లాడ్జీలు వంటి వివరాలను కూడా అడగవచ్చు. రెండు 12.3 అంగుళాల స్క్రీన్లతో కూడిన డిజిటల్ సిస్టమ్, హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇంజిన, గేర్‌బాక్స్ వివరాలు
ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ల, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 115 పీఎస్ పవర్‌ను, 143.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఐవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి.
కారు పొడవే కాదు, టెక్నాలజీ ఫీచర్లు కూడా సిటీ వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. సీఎన్‌జీ మోడల్ లాంచ్ గురించి సమాచారం వచ్చినా, దానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను హ్యుందాయ్ సంస్థ ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.
హ్యుందాయ్ అమ్మకాల్లో క్రెటాదే అగ్రస్థానం
అక్టోబర్ నెలలో హ్యుందాయ్ సంస్థ భారత్‌లో 62,799 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 16.7 శాతం ఎక్కువ. సంస్థలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా క్రెటా 17,955 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంది. వెన్యూ 13,017 యూనిట్లతో, ఎక్స్‌టర్ 8,509 యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్న బేయాన్, హ్యుందాయ్ ఎస్‌యూవీ లైనప్‌లో కొత్త పోటీదారుగా అవతరించింది.













