- Home
- Automobile
- Honda Rebel 500 : ఇక క్లచ్ లేేకుండానే గేర్ వేసేయండి.. కేవలం రూ.5000 తో ఈ-క్లచ్ బైక్ మీసొంతం
Honda Rebel 500 : ఇక క్లచ్ లేేకుండానే గేర్ వేసేయండి.. కేవలం రూ.5000 తో ఈ-క్లచ్ బైక్ మీసొంతం
హోండా రెబెల్ 500 బైక్ ఇప్పుడు ఇండియాలోనే అసెంబుల్ అవుతోంది. లోకల్ పార్ట్స్ వాడటం వల్ల మునుపటి కంటే చాలా తక్కువ ధరకు ఈ-క్లచ్ టెక్నాలజీ బైక్ మళ్లీ మార్కెట్లోకి వచ్చింది.

హోండా రెబెల్ 500 రీలాంచ్
ఇండియన్ ప్రీమియం క్రూయిజర్ బైక్ మార్కెట్లోకి హోండా రెబెల్ 500 కొత్త అప్డేట్స్తో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకుముందు ఇది కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU)గా ఇంపోర్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు దీన్ని లోకల్ పార్ట్స్‌తో ఇండియాలోనే అసెంబుల్ చేస్తున్నారు. దీనివల్ల ఈ బైక్ ధర భారీగా తగ్గింది.
రెబెల్ 500 ధర, వేరియంట్లు
కొత్త హోండా రెబెల్ 500 రెండు వేరియంట్లలో లభిస్తోంది. స్టాండర్డ్ మోడల్ ధర రూ.4,49,900 (ఎక్స్‌షోరూమ్) కాగా ఈ-క్లచ్ (E-Clutch) టెక్నాలజీ ఉన్న మోడల్ ధర రూ.4,89,900 గా ఉంది. గతంలో దీని ధర రూ.5.12 లక్షలు ఉండేది. ఇండియాలో తయారు చేయడం వల్ల కస్టమర్లకు ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.
ఇంజిన్, డిజైన్ ఫీచర్లు
ఈ బైక్‌లో 471 సీసీ, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 46 హెచ్‌పీ పవర్, 43.3 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది వస్తుంది. బాబర్ (Bobber) డిజైన్, బ్లాక్ థీమ్ పార్ట్స్, రౌండ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, 11.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 690 ఎంఎం తక్కువ సీట్ హైట్ దీని స్పెషాలిటీస్. 191 కేజీల బరువున్న ఈ బైక్ 16 అంగుళాల వీల్స్‌తో వస్తుంది.
ఈ-క్లచ్ టెక్నాలజీ, సేఫ్టీ
కొత్త రెబెల్ 500లో ఉన్న ఈ-క్లచ్ టెక్నాలజీ భలే ఉపయోగపడుతుంది. గేర్ మార్చేటప్పుడు, బైక్ ఆపి మళ్లీ స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ లివర్‌ను ఆటోమేటిక్‌గా అదే ఆపరేట్ చేస్తుంది. ట్రాఫిక్‌లో ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. కావాలంటే మ్యాన్యువల్‌గా క్లచ్ లివర్‌ను కూడా వాడుకోవచ్చు.
ఇంకా రెబెల్ 500 లో 3.5 ఇంచుల రౌండ్ టీఎఫ్టీ డిస్ప్లే, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్, టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
బుకింగ్స్, కాంపిటీషన్
రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 లాంటి బైక్స్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు రెబెల్ 500 రెడీ అయింది. మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ కలర్స్‌లో ఇది దొరుకుతుంది. హోండా వెబ్సైట్, బిగ్‌వింగ్ షోరూమ్స్‌లో రూ.5,000 అడ్వాన్స్‌తో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల తగ్గిన ధర, కొత్త ఈ-క్లచ్ ఫీచర్ క్రూయిజర్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయని కంపెనీ భావిస్తోంది.














