MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Tesla : కేవలం రూ.6 లక్షలుంటే చాలు.. టెస్లా కారును మీ ఇంటికి పట్టుకెళ్లండి

Tesla : కేవలం రూ.6 లక్షలుంటే చాలు.. టెస్లా కారును మీ ఇంటికి పట్టుకెళ్లండి

భారత్‌లో టెస్లా తన మోడల్ Y కారు కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్ తీసుకొచ్చింది. రూ.3 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నెలకు రూ.49,000 నుంచి మొదలయ్యే EMIతో కస్టమర్లు సులభంగా ఈ ఎలక్ట్రిక్ కారుకు మారొచ్చు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 07 2026, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెస్లా కారు కొనేందుకు ఇదే సరైన సమయం..
Image Credit : tesla

టెస్లా కారు కొనేందుకు ఇదే సరైన సమయం..

Tesla Model Y : భారత మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెంచడానికి టెస్లా కొత్త ఆఫర్లు, ఫైనాన్స్ స్కీమ్స్ తీసుకొచ్చింది. పెట్రోల్-డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లకు మారాలనుకునే కస్టమర్ల కోసం రూ.3 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఇస్తోంది టెస్లా. ఇలా తక్కువ డౌన్ పేమెంట్, సులభమైన EMI ఆప్షన్లతో ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కొనడం ఇప్పుడు తేలికైంది.

25
ఇండియాలో టెస్లా కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి..?
Image Credit : ANI

ఇండియాలో టెస్లా కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి..?

భారతదేశంలో టెస్లా కార్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు... గతేడాది (2025లో) దేశవ్యాప్తంగా మొత్తం 1,76,817 ఎలక్ట్రిక్ కార్ల విక్రయం జరిగింది. కానీ ఇదే ఏడాది చివర్లో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశించిన టెస్లా కేవలం 225 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అమ్మినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇలా చాలా డల్ గా ఉన్న తమ EV కార్ల విక్రయాలను ఈ ఏడాదైనా పెంచుకోవాలని టెస్లా ప్రయత్నిస్తోంది... ఇందులో భాగమే ఫైనాన్స్ సదుపాయం.

Related Articles

Related image1
Tesla India: భార‌త్‌కు వ‌చ్చేసిన టెస్లా.. షోరూమ్ నెల రెంటే రూ. 35 ల‌క్ష‌లు, కారు ఫీచ‌ర్లు తెలిస్తే క‌ళ్లు తేలేయ్యాల్సిందే
Related image2
Tesla Car Model Y : అదరగొట్టే ఫీచర్లతో.. భారత్ లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ.. ధర ఎంత?
35
నెలకు కేవలం రూ.49,000 EMI
Image Credit : Getty

నెలకు కేవలం రూ.49,000 EMI

టెస్లా ప్రకటన ప్రకారం… కస్టమర్లు మోడల్ Yని నెలకు రూ.49,000 నుంచి మొదలయ్యే EMIతో కొనొచ్చు. కేవలం రూ.6 లక్షల డౌన్ పేమెంట్‌తో అంటే పెద్దగా పెట్టుబడి లేకుండానే టెస్లా కారు సొంతం చేసుకోవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో మోడల్ Y డెలివరీలు మొదలవగా, ఈ ఫైనాన్స్ ఆఫర్లు అమ్మకాలకు మరింత ఊతం ఇస్తాయని అంచనా.

45
ఈ టెస్లా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది..?
Image Credit : tesla

ఈ టెస్లా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది..?

ఇంధనం, నిర్వహణ ఖర్చులు తక్కువ కాబట్టి టెస్లా మోడల్ Yకి మారడం వల్ల నెలకు రూ.20,000 వరకు ఆదా చేయొచ్చని కంపెనీ తెలిపింది. దీర్ఘకాలంలో ఓనర్‌షిప్ ఖర్చు తక్కువ కాబట్టి, మిడ్-సైజ్ SUV, సెడాన్ కార్లు వాడేవాళ్లు కూడా నెలకు రూ.29,000 ఖర్చుతో టెస్లా కారును వాడొచ్చు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంలో ఉన్న సంకోచాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.

55
టెస్లా మోడల్ Y అసలు ధర ఎంత..?
Image Credit : ANI

టెస్లా మోడల్ Y అసలు ధర ఎంత..?

ధర వివరాలు చూస్తే మోడల్ Y రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 500 కి.మీ రేంజ్ ఇచ్చే రియర్-వీల్-డ్రైవ్ వేరియంట్ ధర రూ.59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). 661 కి.మీ రేంజ్ ఉన్న లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ.67.89 లక్షలు. 'స్విచ్ అండ్ సేవ్' ప్రోగ్రామ్‌తో భారత్‌లో పెరుగుతున్న EV మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని, సంప్రదాయ ICE కార్లకు చవకైన ప్రత్యామ్నాయంగా EVలను నిలబెట్టాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahindra Scorpio N : భారీ మార్పులతో స్కార్పియో వచ్చేస్తోంది.. ధర ఎంతో తెలుసా..?
Recommended image2
Bikes: ఈ బైక్స్ ఉంటే కాసుల వ‌ర్షం ఖాయం.. రూ. 70 వేల‌లో 70కిపైగా మైలేజ్
Recommended image3
Cars: CNG కారులో క‌చ్చితంగా పెట్రోల్ ఉండాలా.? లేక‌పోతే ఏమ‌వుతుందో తెలుసా.?
Related Stories
Recommended image1
Tesla India: భార‌త్‌కు వ‌చ్చేసిన టెస్లా.. షోరూమ్ నెల రెంటే రూ. 35 ల‌క్ష‌లు, కారు ఫీచ‌ర్లు తెలిస్తే క‌ళ్లు తేలేయ్యాల్సిందే
Recommended image2
Tesla Car Model Y : అదరగొట్టే ఫీచర్లతో.. భారత్ లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ.. ధర ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved