Tesla Model X India Launch: పక్షిరెక్కల టెస్లా కారు లాంఛ్ ఇండియాలోనా! ఏముంది గురూ!
Tesla Model X India Launch: ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అతి త్వరలో తన నూతన మోడల్ కారుని ముందుగా ఇండియన్స్‌కే పరిచయం చేయాలనుకుంటోందంట. అమెరికాలో మాంచి ప్రీమియర్ కార్లను తయారు చేసే సంస్థగా టెస్లాకు పేరుంది. ఇక ఇండియన్ మార్కెంట్‌పై కన్నేసిన టెస్లా బృందం.. ఇక్కడి కస్టమర్లను ఆకర్షించేలా.. పెద్దఎత్తున మార్కెంటింగ్ చేసే లక్ష్యంతో నూతన మోడల్‌ను లాంఛింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు ఇది పూర్తి ఎలక్ట్రికల్ వెహికల్. మరి కారు ధర ఎంత? కారు ప్రత్యేకతలు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా?

Tesla Model X With Falcon-Wing Doors Set for India Launch
ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అతి త్వరలో తన నూతన మోడల్ కారుని ముందుగా ఇండియన్స్‌కే పరిచయం చేయాలనుకుంటోందంట. అమెరికాలో మాంచి ప్రీమియర్ కార్లను తయారు చేసే సంస్థగా టెస్లాకు పేరుంది. ఇక ఇండియన్ మార్కెంట్‌పై కన్నేసిన టెస్లా బృందం.. ఇక్కడి కస్టమర్లను ఆకర్షించేలా.. పెద్దఎత్తున మార్కెంటింగ్ చేసే లక్ష్యంతో నూతన మోడల్‌ను లాంఛింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు ఇది పూర్తి ఎలక్ట్రికల్ వెహికల్. ఇక కారు ధర ఎంత? కారు ప్రత్యేకతలు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా?

Tesla Model X With Falcon-Wing Doors Set for India Launch
ఇండియాలో పెద్దఎత్తున వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా టెస్లా సంస్థ త్వరలో తన మోడల్ X ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందట. ఈ వివరాలను కంపెనీకి చెందిన అత్యంత సన్నిహితులు తెలియజేశారు. అయితే, కారును అమెరికా నుంచి టాక్స్‌లతో కాకుండా దిగుమతి చేసుకునే అవకాశాన్ని ఇండియన్స్‌కు కల్పించనున్నట్లు చెబుతున్నారు.

Tesla Model X With Falcon-Wing Doors Set for India Launch
ఇక టెస్లా మోడల్ X ధర వచ్చేసరికి మన దేశ కరెన్సీలో సుమారు రూ. 55-60 లక్షల మధ్య ఉంటుంది. ఇక మోడల్ Y రూ. 65-70 లక్షల వరకు ఉంది. అయితే.. ఇండియాకు దిగుమతి టాక్సులతో కలిపి సుమారు రూ. 85 లక్షల నుంచి రూ. 1.75 కోట్లకు ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ కార్ల రాకతో వైవిధ్యమైన కార్లు దేశంలో తిరిగే అవకాశం ఉంటుంది.

Tesla Model X With Falcon-Wing Doors Set for India Launch
టెస్లా ఎక్స్ మోడల్‌లో కనిష్టంగా ఐదుగురు.. గరిష్టంగా ఏడుగురు వరకు ప్రయాణించవచ్చని అంటున్నారు. ఇక సీటింగ్ ఎంతో లగ్జరీయస్‌గా ఉంటుందట. అత్యాధునిక ఫీచర్లతోపాటు ప్రత్యేకంగా ఐకానిక్ ఫాల్కన్-వింగ్ డోర్లు ఈ కారుకు ఉంటాయని అంటున్నారు. అంటే.. పక్షిరెక్కలు విచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందట. దీంతో లగ్జరీ ఈవీ కారు భారతీయులను అమితంగా ఆకట్టుకుంటుందని టెస్లా ప్రతినిధులు భావిస్తున్నారంట. ఈ కారు ఇండియాకి వస్తే.. ఇప్పటి వరకు ఉన్న బీఎండబ్లూ ఐఎక్స్, పోర్స్చే కయెన్ కూపే, ఆడి RS ఇ-ట్రాన్ GT వంటి ఈవీ కార్లకు గట్టిపోటీ ఇవ్వనుంది.

ఇప్పటికే టెస్లా ఎక్స్ మోడల్ డీటీయల్స్ బయటకు రావడంతో ఎప్పుడెప్పుడు కారును కొనుగోలు చేద్దామా అని అనేక మంది ఎదురుచూస్తున్నారంట. ఎందుకంటే కారులో ఉన్న ఫీచర్స్ కస్టమర్స్‌ని ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. ఇక టెస్లా గతంలో రైట్ సైడ్ డ్రైవింగ్ ఎక్స్ మోడల్ కార్ల తయారీని ఆపేశారు. కానీ ఇండియాలో లాంచ్ చేసే రైట్‌సైడ్ డ్రైవింగ్ వెహికల్స్‌ను అందుబాటులో ఉంచుతారని అంటున్నారు.

Tesla Model X With Falcon-Wing Doors Set for India Launch
టెస్లా ఇండియాలోకి అడుగుపెడితే మాత్రం కార్ల మార్కెట్ రంగంలో గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టెస్లా కారు లాంచింగ్ ఇండియాలో ఉంటుందా.. ఉండదా అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రణాళికలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టెస్లా కంపెనీ సన్నిహితులు చెబుతున్నారు. .