MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Tata Cars : టాటా కారు కొనాలనుకుంటున్నారా..? ఈ ఐదు ట్రై చేయండి, భారీ డిస్కౌంట్ ఖాయం

Tata Cars : టాటా కారు కొనాలనుకుంటున్నారా..? ఈ ఐదు ట్రై చేయండి, భారీ డిస్కౌంట్ ఖాయం

కొత్త టాటా కారు కొనాలనుకుంటున్నారా..? ఏప్రిల్ 2026లో నెక్సాన్, హారియర్, సఫారీ మోడళ్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ గ్యాలరీలో చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 16 2026, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ టాటా కార్లపై బంపరాఫర్..
Image Credit : tata motors

ఈ టాటా కార్లపై బంపరాఫర్..

కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా..? అయితే ఇదే మీకు సరైన సమయం. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఏప్రిల్ 2026 నెలలో నెక్సాన్, టియాగో హ్యాచ్‌బ్యాక్, హారియర్, సఫారీ ఎస్‌యూవీ వంటి మోడళ్లపై మీరు సులభంగా డిస్కౌంట్లు పొందవచ్చు. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇక్కడ వివరంగా చూద్దాం.

24
టాటా నెక్సాన్, టియాగో కార్లపై డిస్కౌంట్లు
Image Credit : official website

టాటా నెక్సాన్, టియాగో కార్లపై డిస్కౌంట్లు

టాటా మోటార్స్ కొన్ని మోడల్ కార్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రెండింటినీ అందిస్తోంది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీలోని కొన్ని వేరియంట్లపై మొత్తం రూ.25,000 వరకు ఆఫర్ ఉంది. ఇందులో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. 

అలాగే టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.25,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. కానీ, ఈ ఆఫర్ బేస్ XE వేరియంట్‌కు వర్తించదు. 

టాటా కర్వ్ ఎస్‌యూవీ మోడల్‌పై మొత్తం రూ.50,000 డిస్కౌంట్ ప్రకటించారు. ఇందులో రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

Related Articles

Related image1
Tata Sierra : 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ తో దుమ్మురేపుతున్న టాటా కారు
Related image2
Tata: ఒక్క ఏడాదిలో 2.16 ల‌క్ష‌ల కార్ల అమ్మ‌కాలు.. ఇంత‌కీ కారులో అంతలా ఏముంద‌బ్బా.?
34
టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ ఆఫర్
Image Credit : tata motors

టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ ఆఫర్

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా ఆల్ట్రోజ్ చాలా పాపులర్ కారు. ఏప్రిల్ 2026 వరకు, ఈ కారుపై కస్టమర్లకు రూ.30,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందులో రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

 భారతదేశంలో ఆల్ట్రోజ్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.30 లక్షల నుంచి రూ.10.51 లక్షల వరకు ఉంది. ఇది హ్యుందాయ్ i20, మారుతి సుజుకి బాలెనో వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

44
టాటా హారియర్, సఫారీకి బోనస్
Image Credit : tata motors

టాటా హారియర్, సఫారీకి బోనస్

మీరు పెద్ద ఎస్‌యూవీ కొనాలనుకుంటే టాటా హారియర్, టాటా సఫారీ కార్లపై రూ.35,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అలాగే, ఈ నెలలో కొన్ని మోడళ్లపై ఎలాంటి డిస్కౌంట్ లేదు. కొత్త టాటా సియెర్రా, పాపులర్ పంచ్ ఎస్‌యూవీ ఈ జాబితాలో ఉన్నాయి.

 గమనిక: ఇక్కడ ఇచ్చిన డిస్కౌంట్ వివరాలు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇచ్చాం. ఈ ఆఫర్లు రాష్ట్రం, నగరం, డీలర్‌షిప్, స్టాక్, కారు రంగు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. అంటే మీ ఊరిలోని డీలర్‌షిప్‌లో ఈ డిస్కౌంట్ ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. కాబట్టి కారు కొనే ముందు, మీకు దగ్గర్లోని టాటా డీలర్‌ను సంప్రదించి సరైన డిస్కౌంట్, ఇతర వివరాలు తెలుసుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bike: జీవితంలో మొద‌టిసారి బైక్ కొంటున్నారా.? ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి
Recommended image2
Maruti Suzuki : బాలెనో నుంచి జిమ్నీ వరకు.. ఈ నెలలో మారుతి కార్లపై రూ.95000 డిస్కౌంట్
Recommended image3
Maruti Cars : ఏప్రిల్ లో మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. దీనిపై ఏకంగా రూ.45,000 వరకు డిస్కౌంట్..!
Related Stories
Recommended image1
Tata Sierra : 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ తో దుమ్మురేపుతున్న టాటా కారు
Recommended image2
Tata: ఒక్క ఏడాదిలో 2.16 ల‌క్ష‌ల కార్ల అమ్మ‌కాలు.. ఇంత‌కీ కారులో అంతలా ఏముంద‌బ్బా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved