Electric Scooter: ఫ్యామిలీకి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
Electric Scooter: రివర్ ఇండీ vs ఏథర్ రిజ్టా.. ఫ్యామిలీకి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? ధర, బ్యాటరీ రేంజ్, 43 లీటర్ల బూట్ స్పేస్, స్మార్ట్ ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఫ్యామిలీకి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
ఇండియాలో ఫ్యామిలీ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. మార్కెట్లో ఎక్కువ స్పేస్, వెనుక సీటు కంఫర్ట్, మంచి రేంజ్ ఇచ్చే 'రివర్ ఇండీ', 'ఏథర్ రిజ్టా' ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ఫుల్ కంపారిజన్ చూద్దాం.
ధర & వేరియంట్లు
ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'SUV' అని పిలిచే రివర్ ఇండీ ఒకే ఒక స్టాండర్డ్ వేరియంట్లో రూ.1.57 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు 5 కలర్లలో లభిస్తోంది. మరోవైపు ఏథర్ రిజ్టా రూ.1.22 లక్షల నుంచి రూ.1.61 లక్షల వరకు ధరతో 'రిజ్టా S', 'రిజ్టా Z' అనే 20 వేరియంట్లలో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో కొనాలనుకునే ఫ్యామిలీలకు రివర్ ఇండీ కన్నా ఏథర్ రిజ్టా ప్రారంభ మోడల్ రూ.35,000 తక్కువకు దొరకడం పెద్ద ప్లస్ పాయింట్.
బ్యాటరీ, రేంజ్ & పెర్ఫార్మెన్స్
రివర్ ఇండీలో 4 kWh బ్యాటరీ, 6.7 kW మోటార్ (26 Nm టార్క్) ఉన్నాయి. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 163 కి.మీ రేంజ్ (ప్రాక్టికల్‌గా 120-130 కి.మీ) ఇస్తుంది. హోమ్ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ. ఇందులో ఈకో, రైడ్, రష్ అనే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఏథర్ రిజ్టాలో 4.3 kW మోటార్‌తో 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. 2.9 kWh బ్యాటరీ 123 కి.మీ రేంజ్‌ను, పెద్ద బ్యాటరీ 160 కి.మీ రేంజ్‌ను ఇస్తాయి. ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 60 నిమిషాల్లో 80% ఛార్జ్ చేయవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీ. ఇందులో స్మార్ట్ ఈకో, జిప్ మోడ్స్, 'మ్యాజిక్ ట్విస్ట్' బ్రేకింగ్ ఫీచర్ ఉన్నాయి.
బూట్ స్పేస్ & స్మార్ట్ ఫీచర్లు
స్పేస్ విషయానికొస్తే, రివర్ ఇండీ సీటు కింద 43 లీటర్ల స్పేస్, పెద్ద ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉంది. ఏథర్ రిజ్టా 34 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.
టెక్నాలజీ పరంగా ఏథర్ రిజ్టా Z మోడల్ 7-అంగుళాల కలర్ TFT స్క్రీన్, బ్లూటూత్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఫాల్‌సేఫ్ (FallSafe), ఆటో హోల్డ్ లాంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. రివర్ ఇండీ 6-అంగుళాల LCD స్క్రీన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, CBS, పెద్ద 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో స్ట్రాంగ్ బిల్డ్‌ను కలిగి ఉంది. రెండింటిలోనూ రివర్స్ అసిస్ట్, USB ఛార్జింగ్, LED లైట్స్ ఉన్నాయి.
ఎక్కువ స్పేస్, స్ట్రాంగ్ బిల్డ్, స్పీడ్ కావాలనుకునే వాళ్లు రివర్ ఇండీని.. బడ్జెట్ ధర, మోడ్రన్ స్మార్ట్ టెక్నాలజీ, ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కావాలనుకునే వాళ్లు ఏథర్ రిజ్టాను ఎంచుకోవచ్చు.















