MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Automobile
  • Budget Car : స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లతో సూపర్ కారు.. కేవలం రూ.5 లక్షల్లోపే వచ్చేస్తుంది

Budget Car : స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లతో సూపర్ కారు.. కేవలం రూ.5 లక్షల్లోపే వచ్చేస్తుంది

5 లక్షల రూపాయల బడ్జెట్‌లో కొత్త కారు కొనాలనుకునే వాళ్లకు ఇది గుడ్ న్యూస్. రెనాల్ట్ కంపెనీ తన పాపులర్ క్విడ్ మోడల్‌ను సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో తీసుకురాబోతోంది. ఈ కారు ఫీచర్లు, ధర వివరాలు చూసేయండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 01 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రెనాల్ట్ క్విడ్ సరికొత్త డిజైన్, అదిరే లుక్
Image Credit : renault

రెనాల్ట్ క్విడ్ సరికొత్త డిజైన్, అదిరే లుక్

పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా కారులో తిరగాలని, కుటుంబాన్ని తిప్పాలనే కోరిక ఉంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో కార్ల ధరలను చూసి వాళ్లు వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే చాలావరకు కార్ల ధరలు అధికంగానే ఉంటాయి. టాటా ఆల్టొ కె10, సెలెరియో వంటి కొన్నికార్లు మాత్రమే సామాన్యుల బడ్జెట్ లో లభిస్తాయి.

అయితే తక్కువ ధరలో మంచి కారు కొనాలనుకునేవారి కోసం రెనాల్ట్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి వచ్చింది. కేవలం రూ.5 లక్షల లోపు ధరలో పాపులర్ క్విడ్ మోడల్‌ను సరికొత్తగా మార్కెట్లోకి తీసుకురాబోతోంది. జూలై 3, 2026న లాంచ్ కానున్న ఈ కారుపై మార్కెట్‌లో భారీ అంచనాలున్నాయి.

కొత్త రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో కంపెనీ చాలా మార్పులు చేసింది. కొత్త గ్రిల్, ముందు, వెనుక బంపర్లను మార్చారు. Y-ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్ హెడ్‌ల్యాంప్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. ఎస్‌యూవీ లాంటి డిజైన్‌తో సిటీ రోడ్లపై కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
క్విడ్ ఇంటీరియర్, ఇంజిన్, మైలేజ్, సేఫ్టీ అదుర్స్
Image Credit : Renault

క్విడ్ ఇంటీరియర్, ఇంజిన్, మైలేజ్, సేఫ్టీ అదుర్స్

రెనాల్ట్ క్విడ్ కారు లోపల కూడా చాలా అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. ఇవి యువతను, చిన్న కుటుంబాలను బాగా ఆకట్టుకుంటాయి.

ఇంజిన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. పాత 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించారు. 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తున్న ఈ కారు లీటర్‌కు సుమారు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా. సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

33
రెనాల్ట్ క్విడ్ ధర ఎంత?
Image Credit : stockPhoto

రెనాల్ట్ క్విడ్ ధర ఎంత?

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ఈ ధరతో ఇది మారుతి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు, రోజువారీ ప్రయాణానికి అనువైన కారు కోసం చూసేవారికి కొత్త రెనో క్విడ్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Recommended image2
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Recommended image3
Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
Related Stories
Recommended image1
Self Driving Car : స్టీరింగే కాదు క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ లేని కారు .. మరి డ్రైవింగ్ ఎలాాగో తెలుసా?
Recommended image2
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved