MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Self Driving Car : స్టీరింగే కాదు క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ లేని కారు .. మరి డ్రైవింగ్ ఎలాాగో తెలుసా?

Self Driving Car : స్టీరింగే కాదు క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ లేని కారు .. మరి డ్రైవింగ్ ఎలాాగో తెలుసా?

టెస్లా తన సైబర్‌క్యాబ్ ప్రొడక్షన్ వెర్షన్‌ను టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ వాహనానికి స్టీరింగ్ వీల్ మాత్రమే కాదు క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ వంటి పెడల్స్ కూడా లేవు. మరి డ్రైవింగ్ ఎలాగో తెలుసా?   

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 30 2026, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డ్రైవర్ లెస్ కాదు స్టీరింగ్ లెస్ టెస్లా కారు
Image Credit : X/elonmusk

డ్రైవర్ లెస్ కాదు స్టీరింగ్ లెస్ టెస్లా కారు

టెస్లా తన రోబోట్యాక్సీ కలను నిజం చేసే దిశగా మరో అడుగు ముందుకేసింది. టెక్సాస్‌లోని ఆస్టిన్ రోడ్లపై ప్రొడక్షన్ సైబర్‌క్యాబ్‌ ఇంజనీరింగ్ టెస్టులను ప్రారంభించింది. ఈ వాహనానికి స్టీరింగ్ వీల్, పెడల్స్ (క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్) లేవు… ఇది సిటీ రోడ్లపై తిరుగుతున్న వీడియోను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ షేర్ చేశారు.

టెస్ట్ సమయంలో వాహనంలో సేఫ్టీ మానిటర్ ఉన్నప్పటికీ, డ్రైవర్ నియంత్రణలు ఏవీ లేవు. 2024లో తొలిసారిగా చూపిన డిజైన్‌కు ఇది సరిగ్గా సరిపోతుంది. ప్రొడక్షన్-రెడీ సైబర్‌క్యాబ్‌లు పబ్లిక్ రోడ్లపై కనిపించడం ఇదే మొదటిసారి.

Cybercab with no steering wheel or pedals driving around Austin pic.twitter.com/Oo7uPoOjhp

— Elon Musk (@elonmusk) June 30, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సైబర్ క్యాబ్ ఆన్ రోడ్ టెస్ట్... అంటే త్వరలోనే మార్కెట్లోకి వస్తుందా..?
Image Credit : X/Whole Mars Catalog (@wholemars)

సైబర్ క్యాబ్ ఆన్ రోడ్ టెస్ట్... అంటే త్వరలోనే మార్కెట్లోకి వస్తుందా..?

టెస్లా అక్టోబర్ 10, 2024న సైబర్‌క్యాబ్‌ను పరిచయం చేసింది. ఇది పూర్తిగా అటానమస్ వాహనం, ప్రత్యేకంగా రైడ్-హెయిలింగ్ సేవల కోసం తయారు చేయబడింది. బేసెనర్ (Basenor) రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే ఉన్న టెస్లా మోడళ్లలా కాకుండా, దీన్ని మొదటి నుంచీ డ్రైవింగ్ కంట్రోల్స్ లేకుండానే డిజైన్ చేశారు.

ఈ కారును ఆవిష్కరించిన 20 నెలల్లోనే రోడ్ టెస్టులు ప్రారంభించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆస్టిన్‌లో ఇప్పటికే మోడల్ Y వాహనాలతో అటానమస్ రైడ్ సేవలను టెస్లా పరీక్షిస్తోంది. 2026 జూన్‌లో పబ్లిక్ రోబోట్యాక్సీ రైడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సైబర్‌క్యాబ్ టెస్లా అటానమస్ ప్రణాళికల్లో తదుపరి దశను సూచిస్తోందని బేసెనర్ రిపోర్ట్ పేర్కొంది.

35
సైబర్ క్యాబ్ లో అత్యుధునికి ఫీచర్లు
Image Credit : X/Nic Cruz Patane (@niccruzpatane)

సైబర్ క్యాబ్ లో అత్యుధునికి ఫీచర్లు

ఈ వీడియోలో సైబర్‌క్యాబ్ ఇంటీరియర్ ఎలా ఉందో స్పష్టంగా కనిపించింది. డ్రైవింగ్ సమాచారంతో నిండిన డాష్‌బోర్డ్‌కు బదులుగా, ప్రయాణికుల కోసం మధ్యలో ఒక సింపుల్ డిస్‌ప్లే ఉంది. డ్రైవర్ లేనందున ఈ స్క్రీన్ ప్రధానంగా రైడ్ వివరాలు, ఇతర సమాచారాన్ని చూపించడానికి రూపొందించబడింది. ఇది ఇంకా ఇంజనీరింగ్ టెస్ట్ దశలోనే ఉందని, వాణిజ్యపరంగా లాంచ్ చేయడానికి ముందు వాహనాలు వాస్తవ ప్రపంచ డేటాను సేకరిస్తున్నాయని టెస్లా చెబుతోంది.

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు

చాలామంది టెస్లా పురోగతిని ప్రశంసించగా, స్టీరింగ్ వీల్ లేని డ్రైవర్‌లెస్ కార్లు రోజువారీ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయా అనే దానిపై ఈ వైరల్ వీడియో ఆన్‌లైన్‌లో పెద్ద చర్చనూ రేపింది.

It is definitely safer to have automated vehicles interacting with only other automated vehicles designed to interact with each other rather than allowing a hit and run which I had happen to me when I was driving

— JackIDE (@Jack__IDE) June 30, 2026

Imagine explaining this to someone 20 years ago: "A car with no steering wheel just drove itself through the city." They'd probably ask what movie you watched. 😅

— Gems In Ernest (@gemsinernest) June 30, 2026

ఒక యూజర్ '20 ఏళ్ల క్రితం ఎవరికైనా స్టీరింగ్ లేని కారు సిటీలో దానంతట అదే తిరుగుతోందని చెప్తే ఏ సినిమా చూశావని అడిగేవారేమో' అని సరదాగా కామెంట్ చేశారు. కొంతమంది యూజర్లు ఎప్పుడు పబ్లిక్ రైడ్స్ ప్రారంభిస్తారని అడిగేంతగా ఉత్సాహం చూపించారు.

45
సైబర్ క్యాబ్ సురక్షితమేనా?
Image Credit : X/Nic Cruz Patane (@niccruzpatane)

సైబర్ క్యాబ్ సురక్షితమేనా?

అయితే అందరూ దీన్ని స్వాగతించలేదు.  చాలామంది యూజర్లు, అవసరం లేకపోయినా స్టీరింగ్ వీల్, పెడల్స్ ఉంటేనే సురక్షితంగా ఫీలవుతామని అన్నారు. మరో వాహనం అదుపుతప్పినా, లేదా ఊహించని అత్యవసర పరిస్థితి ఎదురైనా సైబర్‌క్యాబ్ ఎలా స్పందిస్తుందని కొందరు ప్రశ్నించారు.

Man that's so scary. Took me a while to adjust to trusting fsd in my model Y with pedals and steering wheel.

— Zane Kelly (@ImZaneKelly) June 30, 2026

I have a question is this in the experimental phase or past it. 
Hypothetically speaking who is responsible in an mva because there are idiots driving ability impaired, distracted and or late for work. I’m just trying to wrap my head around this!

— Sandra (@Hawkeye___63) June 30, 2026

What is a safety monitor actually doing when FSD is doing all the work? Is there a hot stop button or voice command that halts everything, which the safety monitor can activate at any moment?

If not, then it’s just a useless part of the system and needless regulation.

— Jeff Beck (@Xapp_TV) June 30, 2026

టెస్టింగ్ సమయంలో వాహనంలో ఉండే సేఫ్టీ మానిటర్ పాత్ర ఏమిటని, ఏదైనా తప్పు జరిగితే ఎమర్జెన్సీ స్టాప్ సిస్టమ్ ఉందా అని కూడా సందేహాలు లేవనెత్తారు.

సైబర్‌ సెక్యూరిటీ కూడా మరో పెద్ద ఆందోళన. ఈ వాహనాలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందా అని అడిగారు. పూర్తిగా అటానమస్ వాహనం ప్రమాదానికి గురైతే బాధ్యత ఎవరిది అనే చట్టపరమైన ప్రశ్నలు కూడా తలెత్తాయి.

 

55
సైబర్ క్యాబ్ కు మరిన్ని టెస్టులు
Image Credit : X/Whole Mars Catalog (@wholemars)

సైబర్ క్యాబ్ కు మరిన్ని టెస్టులు

సైబర్‌క్యాబ్ ఇంకా ఇంజనీరింగ్ టెస్ట్ దశలోనే ఉన్నప్పటికీ, ఈ తాజా ప్రదర్శనలు టెస్లా వాణిజ్య వినియోగం వైపు స్థిరంగా వెళ్తోందని సూచిస్తున్నాయి. సైబర్‌క్యాబ్ ఎప్పుడు ప్రయాణికులను ఎక్కించుకోవడం ప్రారంభిస్తుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ పబ్లిక్ రోడ్లపై విజయవంతంగా టెస్టింగ్ చేయడం వల్ల రెగ్యులేటర్లు, ఆటోమోటివ్ పరిశ్రమ దృష్టి దీనిపై మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏదేమైనా సైబర్ క్యాబ్ పై చర్చ కొనసాగుతూనే ఉంది. కొందరు సైబర్‌క్యాబ్‌ను రవాణా భవిష్యత్తుగా చూస్తుంటే, మరికొందరు స్టీరింగ్ వీల్ లేని డ్రైవర్‌లెస్ వాహనాలు రోడ్లపైకి రావడానికి ముందు మరిన్ని పరీక్షలు అవసరం అని నమ్ముతున్నారు.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 
1st TEST • NZ vs IND 2026
Live
NZNZ
(101.3 ov) 368 & 226/5
INDIND
(166.0 ov)720/9
Day 5 - Session 3
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Denza Z9 GT: కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్.. కళ్ళు మూసి తెరిచేలోపే 100 కి.మీ వేగం.. సూపర్ కారు
Recommended image2
Electric Cycle : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కి.మీ ప్రయాణం.. బైక్ కాదు ఈవి సైకిల్, ధర ఎంతో తెలుసా?
Recommended image3
BMW R 12 G/S: రెట్రో లుక్‌లో రాయల్ రైడింగ్.. పవర్‌ఫుల్ ఇంజిన్‌తో అదిరిపోయే ఆఫ్‌ రోడ్ బైక్!
Related Stories
Recommended image1
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
Recommended image2
Car Buying Guide : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే జాగ్రత్త.. ఈ ఒక్కటి చెక్ చేయకపోతే బొక్కబోర్లా పడతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved