జావా, YZD బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఇదే సరైన సమయం! ఎందుకో తెలుసా..
దీపావళి వేడుకల సందర్భంగా జావా YZD మోటార్ సైకిల్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. లిమిటెడ్-పిరియడ్ ఆఫర్‌లో రూ. 1,888తో ప్రారంభమయ్యే ఆకర్షణీయమైన EMIలు అండ్ దీపావళి వరకు అన్ని డెలివరీలపై నాలుగు సంవత్సరాలు లేదా 50,000 కి.మీల వరకు అదనపు వారంటీ కూడా ఉంటుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
జావా YZD మోటార్‌సైకిల్ రేంజ్ ఎల్లప్పుడూ బెస్ట్ డిజైన్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా దశాబ్దాల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన బైక్స్ మరింత ఎక్కువ మంది కస్టమర్‌లకు అందుబాటులో ఉంచడమే ఈ ప్రత్యేక ఆఫర్ లక్ష్యం. జావా మోటార్‌సైకిల్ లైనప్‌లో జావా, జావా 42, జావా 42 బాబర్ అండ్ జావా పెరాక్ ఉన్నాయి. YZD మోటార్‌సైకిల్ లో YZD రోడ్‌స్టర్, YZD స్క్రాంబ్లర్ ఇంకా YZD అడ్వెంచర్ ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యంలోని క్లాసిక్ లెజెండ్స్ 2018లో జావాను తిరిగి తీసుకొచ్చింది. ఆ తర్వాత 2022లో YZD కూడా తిరిగి వచ్చింది.
జావా అండ్ YZD అంటే ఏమిటి?
జావా అక్టోబర్ 1929లో చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో పుట్టింది. కంపెనీని జనక్ బౌట్(Janak Bout) అండ్ వాండరర్(Wanderer) ప్రారంభించారు. వారి పేర్లలోని మొదటి అక్షరాలను కలపడం ద్వారా జావా అనే పేరు ఏర్పడింది. తొలినాళ్లలో ముంబైలోని ఇరానీ కంపెనీ, ఢిల్లీలోని భగవందాస్‌లు జావా బైక్‌లను భారత రోడ్లపైకి దిగుమతి చేసుకున్నాయి. కానీ 1950ల మధ్యలో ప్రభుత్వం ద్విచక్ర వాహనాల దిగుమతిని నిషేధించింది.
కానీ భారతీయ తయారీదారులు విదేశీ తయారీ విడిభాగాలను ఉపయోగించి వాహనాలను తయారు చేయడానికి అనుమతించింది. దాంతో దిగుమతి ఏజెంట్లలో ఒకరైన రుస్తుం ఇరానీ సొంతంగా తయారీ కంపెనీని ప్రారంభించారు. అలా మైసూర్ కేంద్రంగా 1961లో ఐడియల్ జావా కంపెనీ పుట్టింది. ఇక్కడి నుంచి మార్చి 1961లో తొలిసారిగా భారత్‌లో తయారు చేసిన జావా రోడ్డుపైకి వచ్చింది.
భారతీయ నిర్మిత జావా దశాబ్దం తర్వాత YZD గా మార్చబడింది. YZD అంటే చెక్‌లో 'run' లేదా 'go' అని అర్థం. కానీ మైసూర్ రాజభక్తులు కొందరు మైసూరు రాజు Jayachamarajendra Wadiyar పేరులోని అక్షరాలను జోడించడం ద్వారా జావా అనే పేరు సృష్టించబడిందని నమ్ముతారు.
జావా చెక్ రిపబ్లిక్ బ్రాండ్ అయితే, YZD ఇండియన్ బ్రాండ్. 1960లలో భారతదేశంలో జావా బైక్‌లను తయారు చేసి విక్రయించిన మైసూర్‌కు చెందిన ఐడియల్ జావా కంపెనీ రీబ్రాండ్ చేయబడినప్పుడు 1973లో YZD అనే పేరు తీసుకోబడింది. రోడ్ కింగ్, మోనార్క్, CL-II, 350 పేర్లతో 70, 80, 90 దశకాల్లో యువతను ఉర్రూతలూగించిన YZD బైక్‌లు ఇటీవల మళ్లీ పుంజుకున్నాయి.