MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Automobile
  • Maruti Brezza : మీ జేబులో రూ.11,000 ఉంటే చాలు.. మారుతి బ్రెజా కారు సొంతం చేసుకోవచ్చు

Maruti Brezza : మీ జేబులో రూ.11,000 ఉంటే చాలు.. మారుతి బ్రెజా కారు సొంతం చేసుకోవచ్చు

మారుతి సుజుకి బ్రెజా కొత్త ఫేస్‌లిఫ్ట్ త్వరలోనే అందుబాటులోకి రాాబోతోంది. దీని లుక్, అదిరిపోయే ఫీచర్లకు సంబంధించిన మొదటి టీజర్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి. కేవలం రూ.11,000 తో దీన్ని సొంత చేసుకోవచ్చు.

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 15 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రూ.11,000తో బుకింగ్స్ మొదలు
Image Credit : X

రూ.11,000తో బుకింగ్స్ మొదలు

మారుతి సుజుకి తన కొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లేదా అధీకృత అరీనా (Arena) డీలర్‌షిప్‌ల ద్వారా రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ ధరను జూలై 23న ప్రకటించనున్నారు. ఆ తర్వాతే కస్టమర్లకు కార్ల డెలివరీలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొత్త లుక్‌ లో బ్రెజా అదిరిపోయిందిగా...
Image Credit : X

కొత్త లుక్‌ లో బ్రెజా అదిరిపోయిందిగా...

మారుతి సుజుకి విడుదల చేసిన టీజర్ ప్రకారం… బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ముందు, వెనుక డిజైన్‌లో మార్పులు చేశారు. కొత్త అల్లాయ్ వీల్స్, మెరుగైన ఎల్ఈడీ లైట్ల వంటి మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ మార్పులతో కారుకు మరింత మోడ్రన్ లుక్ వస్తుందని భావిస్తున్నారు.

34
మారుతి బ్రెజా ఇంటీరియర్, ఫీచర్లు..
Image Credit : X

మారుతి బ్రెజా ఇంటీరియర్, ఫీచర్లు..

మారుతి బ్రెజా న్యూ ఫేస్‌లిఫ్ట్ లోపల కొత్త కలర్ థీమ్, అప్‌డేటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు అనేక కొత్త ఫీచర్లను ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే మరిన్ని అదనపు ఫీచర్లను కూడా ఈ మోడల్‌లో చేర్చే అవకాశం ఉంది. మరింత సౌకర్యవంతమైన సీటింగ్ తో కొత్త బ్రెజా రానుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి మరింత కంఫర్ట్ గాా ప్రయాణం సాగించేలా దీన్ని రూపొందించారు.

 

44
కొత్త ఇంజిన్ వస్తుందా?
Image Credit : Cardeko

కొత్త ఇంజిన్ వస్తుందా?

ఈ మారుతి బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేయవచ్చని తెలుస్తోంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మారుతి సుజుకి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ధర ప్రకటించే రోజు పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

భారత మార్కెట్లోకి త్వరలోనే రానున్నా ఈ కొత్త బ్రెజా.. కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, స్కోడా కైలాక్, కియా సైరోస్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Recommended image2
Top 7 Seater Cars : పెద్ద ఫ్యామిలీకి సరిపోయేలా.. చీప్ ఆండ్ బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే
Recommended image3
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Maruti Victoris : హ్యుందాయ్ క్రెటా కు గట్టి పోటీ.. ఇప్పుడు మారుతి విక్టోరిస్ కారు మరింత చీప్
Recommended image2
Maruti Ignis : రూ. 5 లక్షల్లోనే సూపర్ కారు.. ఈ నెలలో ఏకంగా రూ.57,500 డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved