MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Maruti Victoris : హ్యుందాయ్ క్రెటా కు గట్టి పోటీ.. ఇప్పుడు మారుతి విక్టోరిస్ కారు మరింత చీప్

Maruti Victoris : హ్యుందాయ్ క్రెటా కు గట్టి పోటీ.. ఇప్పుడు మారుతి విక్టోరిస్ కారు మరింత చీప్

మారుతి సుజుకి తన పాపులర్ మిడ్-సైజ్ SUV 'విక్టోరిస్' టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ధరలను తగ్గించింది.  హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇస్తూ అమ్మకాలను పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 08 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతి విక్టోరీస్ మోడల్ ధర తగ్గింపు
Image Credit : Maruti Suzuki Website

మారుతి విక్టోరీస్ మోడల్ ధర తగ్గింపు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. తన మిడ్-సైజ్ SUV 'విక్టోరిస్' కారులోని కొన్ని పెట్రోల్ వేరియంట్ల ధరలను భారీగా తగ్గించింది. ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరపై గరిష్ఠంగా రూ.39,000 వరకు కోత విధించింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ మోడల్ ధర ఎంత తగ్గింది?
Image Credit : RushlLane

ఏ మోడల్ ధర ఎంత తగ్గింది?

ఈ ధరల తగ్గింపు కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే టాప్-ఎండ్ వేరియంట్స్ ZXi (O), ZXi ప్లస్ (O) మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోని మ్యాన్యువల్ (MT), ఆటోమేటిక్ (AT) గేర్‌బాక్స్ కలిగిన మొత్తం నాలుగు మోడళ్ల ధరలను కంపెనీ తగ్గించింది. 

ZXi (O) పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్‌పై అత్యధికంగా 2.76% ధర తగ్గింది. అలాగే ZXi (O) పెట్రోల్ ఆటోమేటిక్‌పై 2.49%, ZXi ప్లస్ (O) పెట్రోల్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ మోడళ్లపై 2.46% చొప్పున ధరలు తగ్గాయి.

35
ఈ మోడల్ ధరల్లో మార్పు లేదు
Image Credit : Maruti Suzuki

ఈ మోడల్ ధరల్లో మార్పు లేదు

విక్టోరిస్ కారులోని బేస్, మిడ్ వేరియంట్స్ LXi, VXi, ZXi, ZXi ప్లస్ (న్యాచురల్లీ ఆస్పిరేటెడ్) పెట్రోల్ ఇంజిన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అవి పాత ధరలకే అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు CNG, ఎక్కువ మైలేజీనిచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల ధరల్లో కూడా ఎటువంటి మార్పు లేదు.

45
విక్టోరిస్ కారు ధర ఎందుకు తగ్గింది?
Image Credit : X/Sunderdeep - Volk

విక్టోరిస్ కారు ధర ఎందుకు తగ్గింది?

చాలా ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్న ఈ సమయంలో, మారుతి తన పాపులర్ SUV ధరను తగ్గించడం మార్కెట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం విక్టోరిస్ కారు C-సెగ్మెంట్ మిడ్-సైజ్ SUV విభాగంలో దేశంలోనే రెండో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. అయినప్పటికీ పండుగ సీజన్‌కు ముందు కస్టమర్లను మరింత ఆకర్షించడానికి, ఈ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి కంపెనీ ఈ వ్యూహాన్ని అనుసరించిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

55
విక్టోరిస్ కారుకు పోటీదారులు ఎవరు?
Image Credit : Hyundai

విక్టోరిస్ కారుకు పోటీదారులు ఎవరు?

భారత మార్కెట్లో మారుతి విక్టోరిస్‌కు చాలా గట్టి పోటీ ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి మరో మోడల్ గ్రాండ్ విటారా, టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్, హోండా ఎలివేట్ వంటి కార్లకు నేరుగా పోటీ ఇస్తుంది. రాబోయే రోజుల్లో నిస్సాన్ టెక్టాన్ కూడా ఈ సెగ్మెంట్‌లో అడుగుపెట్టనుండటంతో పోటీ మరింత తీవ్రం కానుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bikes Offer : రూ.2,80,000 సూపర్ బైక్ కేవలం రూ.4,999 కే మీసొంతం.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్
Recommended image2
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Recommended image3
New Car Vs Used Car : కొత్త కారా లేక సెకండ్ హ్యాండ్ కారా? 2026లో ఏది కొంటే బెస్ట్!
Related Stories
Recommended image1
Maruti Cars : ఏమిటీ... ఈ మారుతి కారుపై డిస్కౌంటే రూ.2.15 లక్షలా..!
Recommended image2
Maruti Suzuki: మారుతి సుజుకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్.. కార్లపై రూ. 2.15 లక్షల దాకా డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved