- Home
- Business
- Maruti Suzuki: జీఎస్టీ తగ్గింపు తరువాత మారుతి సుజుకి ఒక్కరోజులోనే 30 వేల కార్లు అమ్మేసింది
Maruti Suzuki: జీఎస్టీ తగ్గింపు తరువాత మారుతి సుజుకి ఒక్కరోజులోనే 30 వేల కార్లు అమ్మేసింది
కొత్త జీఎస్టీ (GST) సంస్కరణలు వచ్చాక కార్ల ధరలు చాలా తగ్గాయి. దీంతో భారత ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు జోరుగా సాగాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక మొదటి రోజే మారుతి సుజుకి (Maruti Suzuki) ఏకంగా 30000 కార్లను అమ్మేసింది.

మారుతి సుజుకి కార్లకు భారీ స్పందన
జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాక కార్ల ధరలు చాలా తగ్గాయి. ఒక్కోకారుపై 70,000 రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా తగ్గింపు వస్తోంది. దసరా, దీపావళి లాంటి పండుగలు వరుసగా ఉండడంతో మారుతి సుజుకి కారుకు భారీ స్పందన వచ్చింది. కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చిన మొదటి రోజే 80,000 విచారణలు వచ్చాయిి. 25,000 డెలివరీలు జరిగాయి. దాదాపు 30,000 కార్లు అమ్మకాలు జరిగాయి
కార్లు అవుట్ ఆఫ్ స్టాక్
మారుతి సుజుకి కార్ల కోసం ఎంక్వైరీ చేసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కొన్ని వేరియంట్లు స్టాక్ అయిపోయాయి కూడా. జీఎస్టీ తగ్గింపుతో సెప్టెంబర్‌లో ఇప్పటికే 2 వేల కార్లు బుక్ అయ్యాయని చెన్నై షోరూమ్ మేనేజర్ తెలిపారు.
బైక్ కు బదులు కారు
జీఎస్టీ తగ్గింపు వల్ల కారు ధరలు భారీగా తగ్గాయి. కారు కనీస ధర రూ. 4.5 లక్షల నుంచి రూ. 3.4 లక్షలకు తగ్గింది. దీంతో ఎంతో మంది బైక్ బదులు ఈఎమ్ఐ పెట్టి కారు కొనుక్కోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారు. అందుకే కార్లు విపరీతంగా అమ్ముడవుతున్నట్టు ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీఎస్టీ ఎంత తగ్గింది
జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. దీనిలో భాగంగా చిన్న కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంలో 1200cc కంటే తక్కువ పెట్రోల్, 1500cc కంటే తక్కువ డీజిల్ ఇంజిన్ ఉన్న 4 మీటర్ల లోపు కార్లు ఈ కొత్త జీఎస్టీ స్లాబు కిందకే వచ్చాయి. దీంతో వాటి ధరలు భారీగా తగ్గాయి.
కొత్త జీఎస్టీ నియమం
కొత్త జీఎస్టీ నియమాలు ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. బైక్‌లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ట్రాక్టర్లపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. బస్సులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.