maruti baleno 2022:మరింత స్మార్ట్‌గా కొత్త మారుతి బాలెనో.. 40కి పైగా కార్ టెక్ ఫీచర్లు.. టీజర్ వీడియో ఔట్..
మారుతి సుజుకి కొత్త జనరేషన్ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను మరిన్ని టెక్ అప్‌డేట్‌లతో కూడిన ఎన్నో మార్పులతో ఫిబ్రవరి 23న విడుదల చేయనుంది. అయితే లాంచ్ కి ముందే టీజర్ వీడియోలో సుజుకి కనెక్ట్ యాప్ గురించి చూపిస్తుంది.
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి (maruti suzuki) 2022 బాలెనో (baleno) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఈ వారంలో విడుదల చేయనుంది. అయితే లాంచ్ ముందు కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ కనెక్ట్ కార్ టెక్ ఫీచర్ల టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ టీజర్ వీడియోలో 2022 మారుతీ సుజుకి బాలెనో కనెక్ట్ యాప్ ని చూపించింది.
విశేషమేమిటంటే
ఈ యాప్ లేటెస్ట్ టెలిమాటిక్స్ సొల్యూషన్‌తో వస్తుంది, అంటే పాత వెర్షన్ కంటే స్మార్ట్‌గా ఉంటుందని హామీ ఇస్తు కస్టమర్‌లకు 'ఇంటెలిజెంట్ ఫీచర్‌లను' అందిస్తుంది. దీనికి అమెజాన్ అలెక్సా వాయిస్ కమాండ్‌లతో పాటు 40కి పైగా కనెక్టివిటీ ఫీచర్లు ఇచ్చారు.
సుజుకి కనెక్ట్ యాప్ ఫ్యూయేల్ గేజ్ రీడింగ్, ఓడోమీటర్ ఇంకా ఇతర ముఖ్యమైన వాహన సంబంధిత సమాచారం ఉంటుందని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ల టీజర్ వీడియో వెల్లడించింది. ఈ యాప్ కారు మొత్తం హెల్త్, రిమోట్‌గా హజార్డ్ లైట్‌లను ఆన్ చేయడం, అలాగే కారుని లాక్ చేయడం లేదా అన్‌లాక్ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఫీచర్‌తో పాటు కొత్త బాలెనోలో 9-అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360డిగ్రీ-వ్యూ కెమెరా అండ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD) స్క్రీన్ వంటి ఇతర సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లతో అందించబడుతుంది.
లుక్ అండ్ డిజైన్
2022 మారుతి సుజుకి బాలెనో త్రీ-ఎలిమెంట్ DRLలతో కొత్త సెట్ ఎల్‌ఈడి హెడ్‌లైట్‌లతో పాటు రీడిజైన్ చేయబడిన వైడ్ ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుంది. విండో లైన్‌లపై క్రోమ్ ట్రీట్‌మెంట్ కాకుండా కొత్త బాలెనో రీడిజైన్ చేయబడిన 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. కారు వెనుక భాగంలో కొత్త ఎల్‌ఈడి ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్‌లు లభిస్తాయి ఇంకా బ్యాక్ బంపర్ కూడా మరింత గుండ్రంగా కనిపించేలా అప్‌డేట్ చేయబడింది.
కొత్త బాలెనో ఇంటీరియర్
లీకైన ఫోటోలు ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి . 2022 బాలెనో క్యాబిన్ లో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌డేట్ చేయబడిన స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్ కోసం కొత్త స్విచ్‌లతో అప్‌గ్రేడ్ చేయబడింది. ఇంకా లోపలి భాగంలో ఫ్రెష్ లుక్ కోసం అప్హోల్స్టరీ కూడా మార్చింది. అయితే బాలెనోలో సన్‌రూఫ్ ఆప్షన్ ఉండదు.
బుకింగ్ అండ్ కాంపిటీషన్
ఈ వారంలో లాంచ్ కానున్న మారుతి 2022 బాలెనో బుకింగులను ఇప్పటికే ప్రారంభించింది. 2022 మారుతి బాలెనో టాటా ఆల్ట్రోజ్ (tata altroz), హ్యుందాయ్ ఐ20 (hyundai i20), హోండా జాజ్ (honda jazz) వంటి వాటితో పోటీపడుతుంది.