జాతీయ అవార్డు గెలుచుకున్న ఆనందం: లగ్జరీ కారును గిఫ్ట్ గా తీసుకున్న క్యూట్ హాట్ బ్యూటీ..!
బాలీవుడ్ బ్యూటీ, హీరో రన్ బీర్ కపూర్ భార్యా అలియా భట్ తాజగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఆమె ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ ఆనందానికి గుర్తుగా ఓ ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్ గా తీసుకుంది. ఆ కారు ధర అడిగితే షాక్ అవుతారు.
బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల 'గంగూబాయి కతియావాడి' సినిమాకి గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు అందుకున్న తర్వాత ఆమె ఆనందానికి అవధులు లేవు. అలియా భట్ తనకు తాను రూ.కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చ్చుకుంది.
ఇటీవల, ఈ లగ్జరీ కారు వీడియో కూడా ఒకటి బయటపడింది, దానిని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. అయితే అలియా భట్ కారు ధర ఎంతో తెలుసా?
వైరల్‌గా మారిన ఒక వీడియోలో, అలియా భట్ కొత్త లగ్జరీ బ్లాక్ కారుకు పూలమాల వేసి ఉండటం చూడొచ్చు. మీడియా నివేదికల ప్రకారం, ఆలియా భట్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్ బేస్‌ను కొనుగోలు చేసింది, దీని ధర రూ. 3.81 కోట్లు. ఇప్పుడు ఈ కారు ధర విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
అయితే అలియా భట్‌కి ఈ కారు మొదటి కారు కాదు. అంతేకాకుండా, ఆమె దగ్గర ఇతర చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వీటిలో రూ. 2.5 కోట్ల రేంజ్ రోవర్ వోగ్, రూ. 1.38 కోట్ల BMW 7 సిరీస్ 730D కూడా ఉంది.
మూడవది ఆడి ఎ6, దీని ధర దాదాపు రూ.60 లక్షలు. అలియాకి ఇష్టమైన కార్ల లిస్ట్ లో ఆడి SUV Q7 కూడా ఉంది, దీని ధర దాదాపు కోటి రూపాయలు. తాజాగా ఆలియా తన కెరీర్‌లో తొలి జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా అలియాకు సపోర్ట్ గా ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ అవార్డు అందుకున్న తర్వాత అలియా మాట్లాడుతూ.. గంగూబాయి కతివాడిలో సంజయ్ లీలా బన్సాలీ నన్ను ఎంతగానో మెరుగుపరిచారని, అందుకు ఈరోజు జాతీయ అవార్డును అందుకోగలిగాను అని అన్నారు.