MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Automobile
  • Cheapest Bike in India : కేవలం రూ.59999కే కొత్త బైక్.. మైలేజ్ ఎంతిస్తుందో తెలిస్తే షాకే..!

Cheapest Bike in India : కేవలం రూ.59999కే కొత్త బైక్.. మైలేజ్ ఎంతిస్తుందో తెలిస్తే షాకే..!

అతి తక్కువ ధరలో మంచి మైలైజ్, తక్కువ మెయింటెనెన్స్ కలిగిన బైక్ కావాలా? అయితే హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ పర్పెక్ట్ ఛాయిస్. దీని ధర ఎంత? మైలేజ్ ఎంత ఇస్తుంది? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 11 2026, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర తగ్గిందోచ్..!
Image Credit : Hero

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర తగ్గిందోచ్..!

భారత్‌లో తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైకుల మార్కెట్‌లో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌కు మంచి పేరుంది. రోజూ ఆఫీసుకు, ఇతర పనులకు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి కస్టమర్స్ కోసమే హీరో ఈ బైక్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ బైక్ ధర మరింత తగ్గింది… కొన్ని చోట్ల కేవలం రూ.59,999 ప్రత్యేక ధరకు అమ్ముతున్నట్లు సమాచారం. దీని ప్రారంభ ధర రూ.66,782గా ఉండేది… వివిధ ఆఫర్ల కింద ధర తగ్గించి అమ్ముతున్నారు.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌ ధరల తగ్గింపు బడ్జెట్ బైక్ కొనాలనుకునేవారి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ రూ.59,999 ధర దేశవ్యాప్తంగా అన్నిచోట్లా ఉండకపోవచ్చు. ఇది కేవలం పరిమిత కాల ఆఫర్ లేదా స్టాక్ ఉన్నంతవరకే కావచ్చు. కాబట్టి కొనేముందు మీ దగ్గర్లోని హీరో డీలర్‌ను సంప్రదించి అసలు ధర, ఆఫర్ వివరాలు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి అదనపు ఖర్చుల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్స్-షోరూమ్ ధర వేరు, ఆన్-రోడ్ ధర వేరుగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫీచర్లు
Image Credit : Hero

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫీచర్లు

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లో 97.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 8.02 PS గరిష్ట శక్తిని, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేశారు. సిటీ ట్రాఫిక్, రోజువారీ ప్రయాణాలకు ఈ బైక్ చక్కగా సరిపోతుంది. కొన్ని వేరియంట్లలో హీరో i3S టెక్నాలజీ కూడా ఉంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి, పెట్రోల్ ఆదా చేస్తుంది.

సస్పెన్షన్ విషయానికొస్తే ఈ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డ్రమ్ బ్రేకులు ఇచ్చారు. మెరుగైన భద్రత కోసం ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు. ఇలా అన్నిరకాలుగా ఇది బెస్ట్ ఫీచర్లను కలిగివుంది.

Related Articles

Related image1
Hero HF Deluxe: రూ. 70 వేల‌లో 70 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. డెలివ‌రీ బాయ్స్ ఈ బైక్ కొంటే పండ‌గే
Related image2
Hero HF 100: నెల‌కు జ‌స్ట్ 2 వేల‌తో.. ఈ బైక్ మీ సొంతం చేసుకోండి. 70 కిలోమీట‌ర్ల మైలేజ్
33
హీరో బైక్ ధర, మైలేజ్ వివరాలు
Image Credit : Hero.com

హీరో బైక్ ధర, మైలేజ్ వివరాలు

మొత్తం మీద తక్కువ బడ్జెట్‌లో రోజువారీ ప్రయాణానికి ఒక మంచి బైక్ కొనాలనుకునే వారికి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మంచి ఆప్షన్. రూ.59,999 ఆఫర్ ధర నిజంగా ఆకర్షణీయంగా ఉంది.

అయితే ఈ బైక్ మైలేజ్ అనేది రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్, నడిపే విధానం, బండి మెయింటెనెన్స్ వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అయితే 70-72 KMPL మైలేజ్ ఇస్తుందని హీరో కంపెనీ చెబుతోంది.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర తగ్గింపు ఆఫర్ అన్ని డీలర్ల దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు అధికారిక ధర, డీలర్ ఇస్తున్న ఆఫర్లు, మొత్తం ఆన్-రోడ్ ధర ఎంత అవుతుందో పోల్చి చూసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Tata Cars Offers : ఈ కారుపై డిస్కౌంటే రూ.3.5 లక్షలా..! టాటా బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Recommended image3
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Related Stories
Recommended image1
Hero HF Deluxe: రూ. 70 వేల‌లో 70 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. డెలివ‌రీ బాయ్స్ ఈ బైక్ కొంటే పండ‌గే
Recommended image2
Hero HF 100: నెల‌కు జ‌స్ట్ 2 వేల‌తో.. ఈ బైక్ మీ సొంతం చేసుకోండి. 70 కిలోమీట‌ర్ల మైలేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved