RE నుండి KTM వరకు.. ఈ నెలలో లాంచ్ కానున్న మాస్ బైక్స్ ఇవే !
ఈ మార్చిలో పలు ప్రముఖ కంపెనీలు కొత్త బైక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. అయితే వీటి ధరలు సుమారు లక్షన్నర నుండి మొదలవనున్నాయి.
ఆస్ట్రేలియన్ టూ-వీలర్ కంపెనీ అయినప్పటికీ KTM "KTM 125 డ్యూక్ 2024" బైక్‌లను ఈ నెలాఖరులోగా భారతదేశంలో లాంచ్ చేయనుంది, ఈ బైక్ భారతీయ యువతలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అయితే దీనిని దాదాపు 1,75,000 నుండి 1,80,000 ధరలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎన్నో ఏళ్లుగా భారీ విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తున్న పల్సర్ బైక్‌లలో కొత్త మోడల్ ఈ మార్చిలో విడుదల కానుంది. బజాజ్ ఇటీవలే పల్సర్ 400ని విడుదల చేసింది. మార్చి చివరి నాటికి ఈ బైక్‌ను భారత్‌లో విడుదల చేయనున్నారు. పల్సర్ ఇప్పటికే NS160 అండ్ NS200 బైక్‌లను విడుదల చేయగా, కొత్త పల్సర్ 400 బైకుకు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. భారత మార్కెట్‌లో దాదాపు 2 లక్షల రూపాయలకు విక్రయించబడుతుందని అంచనా.
ఎన్నో ఏళ్లుగా భారతీయుల కలల వాహనంగా నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త "రోడ్‌స్టర్ 450" బైక్‌ను మార్చి 15 నాటికి భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ బైక్ దాదాపు 2 లక్షల 40 వేల నుండి 2 లక్షల 60 వేల ధరతో భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది.
ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ మోటో గుజ్జీ కొత్త మోడల్ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వాహనంకి సుమారు 853సీసీ కెపాసిటీ ఉంది. దాదాపు 200 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. భారత మార్కెట్‌లో దాదాపు 14 లక్షల రూపాయలకు విక్రయించవచ్చని చెబుతున్నారు.