కేవలం రూ.25,999కే ఈవి స్కూటర్, ఈఎంఐ ఆప్షన్ తో : మైలేజ్ ఎంతో తెలుసా?
రోజువారీ అవసరాలకు, తక్కువ దూరాల ప్రయాణాలకు అనువైన గ్రీన్ కంపెనీ సన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మార్కోట్లో అందుబాటులో ఉంది. 6 నెలల వారంటీ, ఈఎంఐ ఆప్షన్ గల ఈ స్కూటర్ ధర ఎంతో తెలుసా?

అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్
సాధారణంగా ఇంటిదగ్గర చిన్నచిన్న పనులకు వాడుకునేందుకు కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. కొందరు చిరు వ్యాపారులకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఇలా అతి తక్కువ ధరలో వచ్చే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తక్కువ ధరలో ఈవి స్కూటర్ కోసం చూసేవారికి గ్రీన్ కంపెనీ సన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. 250W మోటార్, రీఛార్జ్ చేయగల బ్యాటరీతో వస్తుంది… ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కి.మీ వరకు నాన్ స్టాప్ గా ప్రయాణించవచ్చు. 4 నుండి 6 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించే దీన్ని నడిపేందుకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. దీని ధర కేవలం రూ.25,999 మాత్రమే.
ఆరు నెలల వ్యారంటీ...
రోజువారీ ఇంటి అవసరాలకు, దగ్గర్లోని కార్యాలయాలకు వెళ్లేందుకు సన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనువైనది. LCD డిస్‌ప్లే, 10 అంగుళాల చక్రాలు, న్యూమాటిక్ టైర్లు, ఫుట్‌రెస్ట్ తో వస్తుంది. డిస్క్, డ్రమ్ బ్రేక్‌లతో చాలా సురక్షితమైనది. 6 నెలల వారంటీ ఉంటుంది… 48 గంటల్లో కస్టమర్ సర్వీస్ లభిస్తుంది.
ఆరు రంగుల్లో...
ఈ గ్రీన్ కంపెనీ సన్నీ స్కూటర్లు 6 రంగుల్లో లభిస్తుంది. అల్లాయ్ స్టీల్ ఫ్రేమ్, సస్పెన్షన్, యాంటీ-స్లిప్ ఫుట్‌బోర్డ్ ఉన్నాయి. వీటిని greenev.lifeలో బుకింగ్ చేయవచ్చు. స్క్రాచ్ కార్డ్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే అమెజాన్ లో కూడా లభిస్తాయి.
ఈఎంఐ ఆప్షన్ కూడా..
ఈ గ్రీన్ కంపనీ సన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈఎంఐ వసతి కూడా ఉంది. నెలకు కనీసం రూ.1,170 చెల్లించేలా ఈఎంఐ పెట్టుకోవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.
కేవలం మొబైల్ నంబర్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు… ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. పూర్తి సమాచారం కంపెనీ వెబ్‌సైట్ లేదంటే అమెజాన్ లో పరిశీలించండి.
ఇతర ఫీచర్లు
ఈ వెహికిల్ కొలతలు పరిశీలిస్తే... పొడవు 149 సెంటిమీటర్లు, ఎత్తు 120 సెం.మీ, వెడల్పు 40 సెం.మీ ఉంటుంది. వాహనం మొత్తం బరువు 55 కిలోగ్రామ్స్. ఇది నాన్ స్లిప్, ఎలక్ట్రిక్, లైట్ వెయిట్, రీచార్జబుల్, ఎల్ఈడి లైట్స్, డ్యుయల్ బ్రేకింగ్ సిస్టమ్ తో కూడిన వాహనం.