గేర్ లేదా క్లచ్ లేకుండా స్మూత్ గా డ్రైవ్ చేయండి! సీనియర్ సిటిజన్లకు బెస్ట్ కారు ఏదంటే ?
సీనియర్ సిటిజన్లు రోజు చేసే ప్రయాణాలకి అనుకూలమైన, సౌకర్యవంతమైన కారును కొనాలని అనుకుంటుంటారు. ఈ కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో ఆటోమేటిక్ కార్లు చాల పాపులారిటీ పొందుతున్నాయి. ఎక్కువ ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయడానికి ఆటోమేటిక్ కార్లు బెస్ట్ అప్షన్.
సీనియర్ సిటిజన్లు ఇష్టపడే ఈ రకమైన కార్లు గేర్‌లెస్ అండ్ క్లచ్‌లెస్. మారుతి సుజుకి స్విఫ్ట్ అండ్ హ్యుందాయ్ గ్రాండ్ i10 ఈ కోవలోకి వచ్చే రెండు పాపులర్ కార్లు.
మారుతీ సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి స్విఫ్ట్ అనేది ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ కారు అసౌకర్యం లేకుండా గేర్ మార్చుకునే ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడి ఉంటుంది. దీంతో ఈ కారు సీనియర్ల సిటీజన్లకు డ్రైవింగ్‌కు అనువైనది. కారులో విశాలమైన క్యాబిన్ కూడా అందించారు. వృద్ధ ప్రయాణీకులు సులభంగా ఎక్కవచ్చు, దిగవచ్చు. ఇంకా నమ్మదగిన పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లోని ఫీచర్లు డ్రైవింగ్ సౌకర్యవంతంగా చేస్తాయి. సీనియర్ సిటిజన్లకు ఈ కారు మరో ఆదర్శవంతమైన కారు. ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఇబ్బంది లేకుండా గేర్ మార్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఇంకా సీనియర్లు రిలాక్స్డ్ పద్ధతిలో డ్రైవింగ్ చేయడంలో సహాయపడుతుంది. రద్దీగా ఉండే సిటీ రోడ్లలో డ్రైవింగ్ చేయడానికి ఈ కారు సరైనది. దీని స్టైలిష్ డిజైన్ అండ్ నమ్మదగిన పర్ఫార్మెన్స్ సీనియర్‌లు డ్రైవింగ్ చేయడం సులభం చేస్తుంది.
కొత్త కారును కొనాలనుకునే సీనియర్ సిటిజన్లు మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు కార్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన గొప్ప కార్లు. స్విఫ్ట్ కారు మంచి మైలేజీతో కొంచెం తక్కువ ధరకే లభిస్తోంది.