Best Mileage Cars: లోబడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే..
Best Mileage Cars: మనం ఏ కారును చూసినా ముందుగా గుర్తుకు వచ్చేది మైలేజీ, రెండోది ధర. భారతదేశంలో అధిక మైలేజ్ ఇచ్చే తక్కువ ధర కార్ల గురించి తెలుసుకుందాం. ఇంతకీ అలాంటి కార్లు ఏంటీ? వాటి మైలేజ్, ఫీచర్స్, ధర గురించి పూర్తి వివరాలు మీ కోసం.

మీ బడ్జెట్‌కు సరిపోయే టాప్ 5 మైలేజ్ కార్లు!
ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్న ఈ రోజుల్లో మంచి మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేయడమే సరైన నిర్ణయం. భారతీయ కారు కొనుగోలుదారులు బడ్జెట్, మైలేజ్, నిర్వహణ ఖర్చు లాంటి పలు అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ అవసరాన్ని గుర్తించిన పలు కంపెనీలు మంచి మైలేజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకవచ్చాయి. బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్ల వివరాలు మీ కోసం..
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి డిజైర్ CNG ఉత్తమమైన మైలేజ్ కార్లలో బెస్ట్ కారు. స్టైలిష్ లుక్, కుటుంబ ప్రయాణాలకు అనువైన ఫీచర్లతో ఓ బెస్ట్ సెలక్షన్‌గా నిలుస్తోంది. ఈ కారు CNG వేరియంట్‌లో సుమారు 34.12 కిమీ/కిలో మైలేజ్ ఇస్తుండగా, పెట్రోల్ వేరియంట్‌లో సుమారు 25 కిమీ/లీటర్ మైలేజ్‌ను ఇస్తుంది. విశాలమైన క్యాబిన్, సరిపడిన బూట్ స్పేస్, స్మూత్ డ్రైవింగ్ అనుభవం వంటివి దీనికి అదనపు ఆకర్షణలు. ఇక ధర విషయానికి వస్తే.. ప్రారంభ ధర ₹8.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). డిజైర్ CNG బడ్జెట్‌కు తగిన ఫ్యామిలీ కారు కావడమే కాక, నిర్వహణలో తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన సామర్థ్యం గల కారుగా మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందింది.
మారుతి సుజుకి ఆల్టో K10
మారుతి సుజుకి ఆల్టో K10 CNG బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. సిటీ ట్రాఫిక్, ఇరుకైన వీధుల్లో సులభంగా సాగిపోయే కాంపాక్ట్ డిజైన్ ఈ కారు సొంతం. ఈ కారు సుమారు 33.85 కిమీ/కిలో మైలేజ్‌ను అందిస్తుంది. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే.. రూ.5.94 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. లో మెంటనెన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ కారు ఇది.
మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో CNG భారతదేశంలో అత్యధిక మైలేజ్ కలిగిన కార్లలో ఒకటిగా నిలుస్తోంది, ఇది సుమారు 34 కిమీ/కిలో మైలేజ్‌ను అందిస్తుంది. రూ.6.89 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ కారు, ఆధునిక ఇంటీరియర్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సులభమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. రోజూ ట్రాఫిక్ లలో ప్రయాణించే వారికి ఈ కారు బెస్ట్ ఆఫ్షన్ అనే చెప్పాలి. సుదూర ప్రయాణాలకూ కూడా ఈ కారు చాలా అనువుగా ఉంటుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ CNG అనేది విశాలవంతమైన, మైలేజ్ ఫ్రెండ్లీ కారు. ఇది 33.47 కిమీ/కిలో మైలేజ్‌ను అందిస్తుంది. ఇక కారు ధర విషయానికి వస్తే.. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ CNG రూ 6.54 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఇది కుటుంబ ప్రయాణాలకు ఎంతో అనువుగా ఉంటుంది. అలాగే, విశాలమైన బూట్ స్పేస్, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కారు ప్రత్యేకతలు. ధర, స్పేస్, మైలేజ్ ఇలా అన్ని విషయాల్లో బెస్ట్ కారు ఇది.
మారుతి ఎస్-ప్రెస్సో
చివరగా ఈ జాబితాలో మారుతి ఎస్-ప్రెస్సో CNG ఉంది, ఇది SUV-ప్రేరేపిత డిజైన్‌తో స్టైలిష్‌గా కనిపించడమే కాక, సుమారు 33 కిమీ/కిలో వరకు మైలేజీని అందిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. మారుతి ఎస్-ప్రెస్సో రూ.5.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ల్లో అందుబాటు వస్తుంది. దీని కాంపాక్ట్ బాడీ సిటీ ట్రాఫిక్ కు అనుకూలంగా ఉండగా, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా కఠినమైన రోడ్లపై కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.