- Home
- Automobile
- Lightweight Scooters : తక్కువ బరువు, ఎక్కువ మైలేజ్.. మహిళలకు సరిగ్గా సరిపోయే టాప్ 5 స్కూటర్లు ఇవే
Lightweight Scooters : తక్కువ బరువు, ఎక్కువ మైలేజ్.. మహిళలకు సరిగ్గా సరిపోయే టాప్ 5 స్కూటర్లు ఇవే
సాధారణంగా మహిళలు తక్కువ బరువు, తక్కువ సీట్ హైట్ ఉన్న స్కూటర్లను నడిపేందుకు ఇష్టపడతారు. ఇలాంటి బైక్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి… వాటిలో టాప్ 5 స్కూటర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

తక్కువ సీట్ హైట్ ఉన్న స్కూటర్లు
ఎత్తు తక్కువగా ఉన్నవారు కొత్త స్కూటర్ కొనేటప్పుడు సీట్ హైట్, బండి బరువు చూసుకోవడం చాలా ముఖ్యం. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు, పార్కింగ్ చేసేటప్పుడు కాళ్లు నేలకు అందకపోతే బండి నడపడం కష్టమవుతుంది. ఈ కష్టాలకు చెక్ పెడుతూ రూ.90,000 లోపు దొరికే 5 బెస్ట్ లైట్ వెయిట్ స్కూటర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 (TVS Scooty Zest 110)
తక్కువ ఎత్తు ఉన్నవారికి బాగా సెట్ అయ్యే ప్రాక్టికల్ స్కూటర్లలో ఇది ముందుంటుంది. ఈ టివిఎస్ స్కూటీ సీట్ హైట్ కేవలం 760 మి.మీ మాాత్రమే… కాబట్టి బండి ఆపినప్పుడు కాళ్లు సులభంగా నేలకు అందుతాయి.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 ఫీచర్లు
ఇంజిన్ - 109.7cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్
బరువు - 103 కిలోలు (హ్యాండిల్ చేయడం చాలా ఈజీ)
ఫీచర్లు - 19 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ట్యూబ్‌లెస్ టైర్లు
మైలేజ్ - లీటర్‌కు 45 నుంచి 50 కి.మీ వరకు
ఎక్స్-షోరూమ్ ధర - సుమారు రూ.70,000 నుంచి రూ.75,000 వరకు
యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (Yamaha Fascino 125 Fi Hybrid)
కాస్త పవర్‌ఫుల్ 125cc ఇంజిన్ కావాలి, అదే సమయంలో బండి బరువు తక్కువగా ఉండాలి అనుకునేవారికి యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ బెస్ట్ ఛాయిస్. దీని సీట్ హైట్ 780 మి.మీ మాత్రమే.
యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ ఫీచర్లు
బరువు - 98 నుంచి 99 కిలోల వరకు
ఫీచర్లు - స్మార్ట్ మోటార్ జనరేటర్ (Smart Motor Generator) టెక్నాలజీ (యాక్సిలరేషన్ ఈజీ చేస్తుంది), 21 లీటర్ల స్టోరేజ్, ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ
మైలేజ్ - లీటర్‌కు 49 నుంచి 55 కి.మీ వరకు
ఎక్స్-షోరూమ్ ధర - సుమారు రూ.78,000 నుంచి రూ.90,000 వరకు
హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ (Hero Pleasure+ XTEC)
కాంపాక్ట్ డిజైన్, తక్కువ బరువుతో రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా ఈ హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ స్కూటర్‌ను డిజైన్ చేశారు. దీని సీట్ హైట్ 765 మి.మీ ఉంటుంది.
హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ ఫీచర్లు
బరువు - సుమారు 104 నుంచి 106 కిలోల వరకు
ఇంజిన్ - 110.9cc ఇంజిన్
ఫీచర్లు - బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్
మైలేజ్ - లీటర్‌కు సుమారు 50 కి.మీ
ఎక్స్-షోరూమ్ ధర - సుమారు రూ.70,000 నుంచి రూ.85,000 వరకు
టీవీఎస్ స్కూటీ పెప్+ (TVS Scooty Pep+)
బండి నేర్చుకునే కొత్తవాళ్లు, తక్కువ బరువున్న స్కూటర్ కావాలనుకునే వారికి టీవీఎస్ స్కూటీ పెప్+ బాగా తెలిసిన మోడల్.దీని సీట్ హైట్ సుమారు 765 మి.మీ ఉంటుంది.
టీవీఎస్ స్కూటీ పెప్+ ఫీచర్లు
బరువు - 93 నుంచి 95 కిలోలు (ఇరుకు సందుల్లో, ట్రాఫిక్‌లో ఈజీగా నడపొచ్చు)
ఇంజిన్ - 87.8cc ఇంజిన్
మైలేజ్ - లీటర్‌కు సుమారు 50 కి.మీ
ప్రస్తుతం ఈ మోడల్ కొత్తగా ఉత్పత్తి కావడం లేదు. కాబట్టి సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మాత్రమే దొరికే అవకాశం ఉంది.
యమహా రే జెడ్ఆర్ 125 హైబ్రిడ్ (Yamaha RayZR 125 Fi Hybrid)
స్పోర్టీ లుక్ కావాలి, బరువు తక్కువగా ఉండాలి అనుకునే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు యమహా రే జెడ్ఆర్ సరైన ఆప్షన్. దీని సీట్ హైట్ 785 మి.మీ ఉంటుంది.
యమహా రే జెడ్ఆర్ 125 హైబ్రిడ్ ఫీచర్లు
బరువు - 99 కిలోలు
ఇంజిన్ - ఫాసినో లాగానే ఇది కూడా 125cc హైబ్రిడ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది.
ఫీచర్లు - స్పోర్టీ డిజైన్, స్టాప్-స్టార్ట్ సిస్టమ్, మంచి యాక్సిలరేషన్
మైలేజ్ - లీటర్‌కు 49 నుంచి 55 కి.మీ వరకు
ఎక్స్-షోరూమ్ ధర - సుమారు రూ.78,000 నుంచి రూ.90,000 వరకు





