Bajaj Electric Scooter రూ.13,000కే ఎలక్ట్రిక్ స్కూటర్? ఎలా సొంతం చేసుకోవాలంటే..
పర్యావరణ ప్రేమికులు, పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయిన చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకి మారుతున్నారు. దానికితోడు ఈ వాహనాల వాడకాన్ని ప్రభుత్వమూ ప్రోత్సహిస్తోంది. అలాంటి వాళ్ల కోసమే Bajaj Chetak 3202 స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.

Bajaj Chetak 3202: ఇప్పుడు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముతున్నాయి. Bajaj నమ్మకానికి చిరునామాలా ఉండే కంపెనీ. ఈ సంస్థ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. దీనిని రూ.13,000 కట్టి మీ సొంతం చేసుకోవచ్చని టాక్!
బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇది ఎందుకు స్పెషల్?
మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నా, Bajaj Chetak 3202 రూపం, ఫీచర్లతో అందరి మనసులు గెలుచుకుంది. దీని ధర రూ. 1.15 లక్షలు. కానీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఫైనాన్స్ ప్లాన్ ఉంది. రూ. 13,000 కట్టి ఇంటికి తీసుకెళ్లొచ్చని కంపెనీ చెబుతోంది. దీనిపై 9.7% వడ్డీ ఉంటుంది. మిగతా మొత్తం ఈఎంఐలలో చెల్లించవచ్చు.
Bajaj ఎలక్ట్రిక్ స్కూటర్
Bajaj Chetak 3202 పనితీరు: రైడ్ ఎలా ఉంది?
Bajaj, Chetak 3202ని స్టైలిష్‌గా, ఆధునిక ఫీచర్లతో తయారు చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 137 కి.మీ వెళ్లొచ్చు. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తుంటే, Bajaj Chetak 3202 మంచి ఎంపిక. టెస్ట్ డ్రైవ్ చేసి, ఫైనాన్స్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.