MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Automobile
  • Bikes : కేవలం రూ.50-60 వేలకే 70-80 కి.మీ మైలేజ్.. ఇండియాలో బెస్ట్ బడ్జెట్ బైక్స్ ఇవే..!

Bikes : కేవలం రూ.50-60 వేలకే 70-80 కి.మీ మైలేజ్.. ఇండియాలో బెస్ట్ బడ్జెట్ బైక్స్ ఇవే..!

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్‌తో మంచి బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే కేవలం లక్ష రూపాయల లోపు ధరలో లభించే బైక్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి... ఇందులో బెస్ట్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 11 2026, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
లక్షలోపు బడ్జెట్‌లో బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ బైక్స్...
Image Credit : stockPhoto

లక్షలోపు బడ్జెట్‌లో బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ బైక్స్...

ఓ సామాన్యుడు కొత్త బైక్ కొనడానికి షోరూమ్‌కి వెళ్తే అడిగే మొదటి ప్రశ్న 'ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది?'. పెరుగుతున్న ధరలు, పెట్రోల్ ఖర్చుల మధ్య బైక్ మెయింటెనెన్స్ అనేది కాస్ట్లీగా మారిపోయింది... అయినా వీటి వినియోగం తగ్గడంలేదు. తాజా గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారత టూ-వీలర్ మార్కెట్ 8 నుంచి 9% వృద్ధి చెందనుంది. ఈ పెరుగుదలలో ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్‌ల వాటానే ఎక్కువట. మరి తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో లభించే బెస్ట్ బైక్స్ ఏవో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)
Image Credit : stockPhoto

హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)

తక్కువ ధర బైక్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు హీరో స్ప్లెండర్. ఇది 97.2cc ఇంజిన్‌తో వస్తుంది. దీనిపై జనాలకు అపారమైన నమ్మకం ఉంది.

ధర : దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.75,600 నుంచి రూ.85,000 వరకు ఉంటుంది.

మైలేజ్ : వాస్తవ పరిస్థితుల్లో ఈ బైక్ లీటర్‌కు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

మెయింటెనెన్స్ : దీని వార్షిక నిర్వహణ ఖర్చు కేవలం రూ.6,500 నుంచి రూ.8,500 మధ్యే ఉంటుంది. దీని స్పేర్ పార్టులు దేశంలో ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి.

37
బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
Image Credit : stockPhoto

బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)

ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, ముఖ్యంగా రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో తిరిగేవారికి ప్లాటినా ఒక బెస్ట్ ఆప్షన్.

ధర : దీని ధర రూ.65,000 నుంచి రూ.78,000 మధ్య ఉంటుంది.

మైలేజ్ : రైడర్ బరువు, రోడ్డును బట్టి ఈ బైక్ లీటర్‌కు 70 నుంచి 85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ప్రత్యేకత : దీనిలోని 'కంఫర్ట్‌టెక్' (ComforTec) టెక్నాలజీ, పొడవైన సస్పెన్షన్ వల్ల గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అలసట అస్సలు ఉండదు.

47
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
Image Credit : heromotocorp.com

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)

చాలా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ బైక్ కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇది భారతదేశంలో అత్యంత చవకైన కొత్త బైక్‌లలో ఒకటి.

ధర : దీని ధర సుమారు రూ.58,600 నుంచి రూ.72,000 మధ్య ఉంటుంది.

మైలేజ్ : ఇందులో స్ప్లెండర్‌లో వాడిన 97.2cc ఇంజిన్‌నే ఉపయోగించారు. ఇది సులభంగా 70-75 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.

మెయింటెనెన్స్ : స్ప్లెండర్ ఇంజిన్ ఉండటం వల్ల దీని స్పేర్ పార్టులు ఎక్కడైనా దొరుకుతాయి. చిన్న చిన్న పల్లెటూళ్లలోని మెకానిక్‌లు కూడా దీన్ని ఈజీగా రిపేర్ చేస్తారు.

57
టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
Image Credit : TVS

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)

తక్కువ బడ్జెట్‌లో ధృడమైన, పొదుపైన బైక్‌గా టీవీఎస్ స్పోర్ట్‌కు మంచి పేరుంది.

ధర : దీని ధర సుమారు రూ.59,900 నుంచి రూ.69,800 మధ్య ఉంటుంది.

మైలేజ్ : దీని 109.7cc ఇంజిన్ వాస్తవ పరిస్థితుల్లో 65-70 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.

ప్రత్యేకత : తక్కువ బరువు, అందుబాటు ధర కారణంగా సిటీ ట్రాఫిక్‌లో నడపడానికి, మొదటిసారి బైక్ కొనేవారికి ఇది ఒక అద్భుతమైన ప్యాకేజ్.

67
హోండా షైన్ 100 (Honda Shine 100)
Image Credit : honda

హోండా షైన్ 100 (Honda Shine 100)

హోండా బైక్‌లు వాటి ఇంజిన్ క్వాలిటీ, రిఫైన్‌మెంట్‌కు ప్రసిద్ధి. షైన్ 100 కూడా అవే ఫీచర్లతో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది.

ధర : ఈ బైక్ ధర సుమారు రూ.65,700 నుంచి రూ.74,000 మధ్య ఉంటుంది.

మైలేజ్ : దీని 98.98cc ఇంజిన్ సులభంగా 65-70 కి.మీ. మైలేజ్ అందిస్తుంది.

ప్రత్యేకత : దీని సైలెంట్ స్టార్టర్ మోటార్, స్మూత్ పవర్ డెలివరీ వల్ల రోజువారీ ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

77
  కొత్త బైక్ కొనే ముందు ఈ విషయాలు గమనించండి..
Image Credit : hero, honda

కొత్త బైక్ కొనే ముందు ఈ విషయాలు గమనించండి..

కొత్త బైక్‌ను ఎప్పుడూ మీ వ్యక్తిగత అవసరాలు, రోజువారీ ప్రయాణాన్ని బట్టి ఎంచుకోవాలి. మీకు తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ రీసేల్ వ్యాల్యూ కావాలంటే హీరో స్ప్లెండర్ ప్లస్ లేదా హెచ్ఎఫ్ డీలక్స్ బెస్ట్ ఆప్షన్లు. గతుకుల రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం బజాజ్ ప్లాటినా సరైనది. ఇక స్మూత్ రైడింగ్ అనుభవం కోసం హోండా షైన్ 100 మంచి పెట్టుబడి. గుర్తుంచుకోండి, మీరు ఏ బైక్ ఎంచుకున్నా, దానికి సరైన సమయంలో సర్వీసింగ్ చేయిస్తేనే ఉత్తమ మైలేజ్ వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ వంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Honda QC3: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 145 కి.మీల మైలేజ్‌, క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image2
Top 5 Electric Scooters : లైసెన్స్ లేకున్నా రాయల్ జర్నీ.. మగువల కోసం మైండ్ బ్లోయింగ్ EV స్కూటర్స్ లిస్ట్ ఇదిగో..!
Recommended image3
Cheapest EV Car : అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏది? ధర ఎంత?
Related Stories
Recommended image1
Bike: ఈ బైక్ మైలేజ్ కింగ్‌.. ట్యాంక్ ఫుల్ చేస్తే 800 కి.మీలు వెళ్లొచ్చు. ధ‌ర రూ. 65 వేలే
Recommended image2
Bike: జీవితంలో మొద‌టిసారి బైక్ కొంటున్నారా.? ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved