ఈ రాశివారితో హాలీడేస్ ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు..
సెలవుల్ని ఎంజాయ్ చేసే తీరు ఒక్కొక్కరిదీ ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది విహారయాత్రలకు వెడితే.. మరికొందరు గెట్ టు గెదర్ లంటూ వెడతారు. అకేషన్ ఏదైనా అంతిమంగా జరిగేది ఎంజాయ్ మెంటే. అయితే కొంతమంది సెలవులను మరికాస్త ఎక్కువగా ఆనందిస్తారు. హాలిడే సీజన్ వచ్చిందంటే చాలు వీరిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు నడుస్తున్నాయి. వెంటనే న్యూ ఇయర్ వస్తుంది. ఆ తరువాత సంక్రాంతి.. ఇలా వరుసగా వస్తున్న అకేషన్స్, సెలవు దినాలు మనల్ని రిఫ్రెష్ చేస్తాయి. ఉత్సాహంగా మార్చేస్తాయి. బంధువులు, స్నేహితులతో కలవడం మనసుకు కొత్త బూస్టర్ డోస్ లా పనిచేస్తుంది.
అయితే, సెలవుల్ని ఎంజాయ్ చేసే తీరు ఒక్కొక్కరిదీ ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది విహారయాత్రలకు వెడితే.. మరికొందరు గెట్ టు గెదర్ లంటూ వెడతారు. అకేషన్ ఏదైనా అంతిమంగా జరిగేది ఎంజాయ్ మెంటే. అయితే కొంతమంది సెలవులను మరికాస్త ఎక్కువగా ఆనందిస్తారు. హాలిడే సీజన్ వచ్చిందంటే చాలు వీరిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. సంతోషం పరుగులు పెడుతుంది.
zodiac
అయితే, ఈ బిహేవియర్ కు రాశిచక్రంతో సంబంధం ఉందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కొన్ని రాశుల వారు ఇలా తాము ఎంజాయ్ చేయడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారిని కూడా ఉత్సాహపరుస్తారని చెబుతున్నారు. ఆ రాశులు ఏవో ఒక్కసారి లుక్కేయండి..
Representative Image: Capricorn
మకరం (Capricorn)
ఈ రాశివారికి సంవత్సరంలో ఈ సమయం వారి చుట్టూ ఉన్న ప్రేమ, ఆనందం, ఐక్యతను తెస్తుంది. వీరు ఏడాది పొడవునా పడ్డ రకరకాల కష్టాల నుండి కాస్త బ్రేక్ గా ఈ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తారు. విశ్రాంతి తీసుకుంటారు, రిలాక్స్ అవుతారు. అంతేకాదు ఈ విశ్రాంతి సమయాన్ని వీరిలో ప్రేమించే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
క్యాన్సర్ (Cancer)
సంవత్సరమంతా ఉద్యోగం, ట్రిప్పులు, రకరకాల బాధ్యతలతో గడిపిన మీరు ఈ సెలవుల సమయంలో సంప్రదాయం, ఆచారాలకు ఆకర్షితులయినట్టుగా భావిస్తారు. దీనివల్లే మీరు మీ కుటుంబానికి, స్నేహితులకు దగ్గరరై వారితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. అందుకే ఈ రాశివారు ఈ హాలిడే సీజన్‌ను ఇష్టపడతారు. కారణం సంవత్సరమంతా ఎలా గడిచినా ఈ హాలిడే సీజన్ లోనే ఎంతో దూరాల్లో ఉన్న వారు కూడా ఒక దగ్గరికి చేరి సంతోషంగా గడిపే సమయం ఇది కాబట్టి.
సింహ రాశి (Leo)
క్రిస్మస్, నూతన సంవత్సరం.. రెండూ కొత్త బట్టలతో.. మీరూ కొత్తగా మెరుస్తూ అద్భుతమైన వ్యక్తిత్వంతో ప్రకాశవంతంగా ప్రకాశించే సమయం. ఈ సమయంలో మీరు మీ ప్రతిభాపాఠవాలతో మీ చక్కటి నడవడికతో అందరూ మీకు అకర్షితులవ్వడంచూసి మురిసిపోతారు.
వృషభం (Taurus)
ఈ రాశివారు మీ పాత స్నేహితులతో, మీ తెగిపోయిన బంధాలను కలుపుకోవడానికి.. అలాంటి వారితో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఇది చాలా శుభ సమయం. ఇదే సమయంలో ఈ రాశివారు మీ మాజీ భర్త లేక ప్రియుడు, లేదా భార్య లేక ప్రియురాలితో మళ్లీ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి దాన్ని పూర్తిగా నివారించేందుకు ప్రయత్నించండి. ఈ రాశివారికి హ్యాంగోవర్ కూడా ఉండొచ్చు.
pisces
మీనం (Pisces)
ఈ రాశివారు ఈ హాలిడే సీజన్‌ని ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోని అన్ని చికాకుల నుండి మీకు విరామం ఇస్తుంది. బిజీగా ఉన్న రోజులు, కష్టపడి పని చేయడం ద్వారా, మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. స్పా డేని కూడా ఆనందించవచ్చు! అందరికి దూరంగా ఉండటం వల్ల బిజీ ప్రపంచం నుండి తప్పించుకోవచ్చు.