ఈ రాశివారు చాలా ఎమోషనల్.. చిన్న విషయానికే ఏడ్చేస్తారు..!
సినిమా చూస్తే ఏడుస్తారు.. ఎవరైనా ఏడ్వడం చూసినా ఏడ్చేస్తారు.. ఏదైనా బాధ కలిగించే విషయం విన్నా కూడా వెంటనే ఏడ్చేస్తారు.

మనలో చాలా మంది ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు. చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు. సినిమా చూస్తే ఏడుస్తారు.. ఎవరైనా ఏడ్వడం చూసినా ఏడ్చేస్తారు.. ఏదైనా బాధ కలిగించే విషయం విన్నా కూడా వెంటనే ఏడ్చేస్తారు. కాగా.. ఈ కింద రాశులవారు కూడా అంతేనట.. చాలా ఎమోషనల్ పర్సన్స్. పైకి ఎలా కనిపించినా.. చిన్న విషయాలకే ఏడ్చేస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా...
మేష రాశి..
వారు చాలా భయంకరంగా, బలంగా అనిపించవచ్చు, బయటకు అంత కఠినంగా ఉన్నప్పటికీ వారు.. లోపల చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైన, ఎమోషనల్ పర్సన్స్ వీరు. చిన్న విషయానికే బాధపడిపోతుంటారు. అయితే.. వీరు అందరి ముందు ఏడ్వరట. తల పట్టుకొని.. పక్క గదిలోకి వెళ్లి ఏడ్చేస్తారు.
కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు కూడా చాలా ఎమోషనల్.. వీరు ఎదుటివారి ఎమోషన్స్ కి కూడా ఎక్కువ విలువ ఇస్తారు. తమ మాటలు, చర్యల వల్ల ఎదుటివారు కూడా బాధపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటారు. వీరు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎదుటివారి విషయంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వీరు మాత్రం సులభంగా గాయపడతారు. వీరిని ఇతరులు తొందరగా బాధపెడతారు. అందుకే వెంటనే ఏడ్చేస్తారు.
3.కుంభ రాశి..
ఈ రాశివారు ఇంట్రావర్టర్స్. వీరికి చాలా సిగ్గు ఎక్కువ. వీరు తొందరగా ఎవరికీ ఏ విషయాన్ని చెప్పలేరు. ఎవరైనా తమను బాధపెట్టినా.. ఆ విషయంలో వారే ఎక్కువగా బాధపడతారు. ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎవరైనా విమర్శించినా వీరు వెంటనే ఏడ్చేస్తారు. చాలా సెన్సిటివ్.. అంతేకాకుండా వీరు చాలా ఎమోషనల్.
4.మీన రాశి..
వారు భావోద్వేగాల పట్ల చాలా సున్నితంగా ఉంటారు, కానీ అది జీవితంలోని మధురమైన, అత్యంత బాధాకరమైన భావోద్వేగాలను అనుభవించకుండా వారిని ఆపదు. వారు కొన్ని పరిస్థితులలో కూడా చాలా కఠినంగా ఉంటారు. కానీ.. ఎక్కువగా ఎమోషనల్ అవుతారు.