ఈ రాశులవారు క్రిస్మస్ పండగను బాగా ఇష్టపడతారు..!
ఇంటిని అందంగా.. విద్యుద్దీపాలతో అలంకరించి...క్రిస్మస్ చెట్టును మరింత అందంగా ముస్తాబు చేస్తారు. కాగా.. ఇంత ఆనందాన్ని ఇచ్చే ఈ క్రిస్మస్ పండగను ఈ రాశుల వారు అమితంగా ఇష్టపడతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా.

Chritmas Gift 2021
ఎంతో మంది ఇష్టంగా ఎదురుచూసే క్రిస్మస్ పండగ వచ్చేసింది. ఈ పండగ రోజు బంధవులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా.. విద్యుద్దీపాలతో అలంకరించి...క్రిస్మస్ చెట్టును మరింత అందంగా ముస్తాబు చేస్తారు. కాగా.. ఇంత ఆనందాన్ని ఇచ్చే ఈ క్రిస్మస్ పండగను ఈ రాశుల వారు అమితంగా ఇష్టపడతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా.
1.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి సంవత్సరం మొత్తంలొ అత్యంత ఇష్టమైన సమయం ఇదే. ఈ పండగ రోజున వచ్చే ఉత్సాహం వారిలో.. నూతన సంవత్సరంలోనూ అదే రెట్టింపు ఉత్సాహంతోకొనసాగుతుంది. ఈ రాశివారికి.. ఈ క్రిస్మస్ పర్వదినాన.. ప్రియమైన వారితో కలిసి ఉండటం చాలా ఇష్టం. వీరికి పండగ వాతావరణం అంటేనే చాలా ఎక్కువగా ఇష్టం.
2.కుంభ రాశి..
ఈ రాశివారికి కూడా క్రిస్మస్ పండగ అంటే చాలా ఎక్కువగా ఇష్టం. తమకు ఇష్టమైన వారికి విభిన్నంగా బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆ గిఫ్ట్ లో తమ టాలెంట్ ని భయటపెడతారు. తమకు ఇష్టమైన వారు తమకు గిఫ్ట్స్ ఇస్తే.. హ్యాపీగా ఫీలౌతారు. వీరికి బహుమతులు ఇవ్వడం.. తీసుకోవడం చాలా ఇష్టం.
3.సింహ రాశి..
క్రిస్మస్ పండగ అనగానే.. సింహ రాశివారికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. కొత్త దుస్తులు వేసుకోవడం వీరికి ఇష్టం. క్రిస్మస్ పార్టీలను ఎంజాయ్ చేయడం వీరికి ఇష్టం. పార్టీలను డిఫరెంట్ గా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మంచి ఆహారం తినడం కూడా వీరికి ఎక్కువగా నచ్చే విషయం.
4.కర్కాటక రాశి..
క్రిస్మస్ పండగ రోజున అందరూ కలుసుకోవడం కర్కాటక రాశివారికి చాలా ఇష్టం. తమ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గెట్ టూ గెదర్స్, పార్టీలు పెట్టుకొని.. సరదాగా గడుపుతారు.
5.మేష రాశి..
ఈ రాశివారు... క్రిస్మస్ పండగను అమితంగా ఇష్టపడతారు. అందరితో కలిసి సరదాగా గడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కువ గా బంధువులతో కలిసి లంచ్ చేయడాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు.