Zodiacsigns: ఈ రాశులవారికి దాంపత్య జీవితంలో ఒత్తిడి ఎక్కువ..!
పాపం ఈ రాశుల వారికి మాత్రం అది సాధ్యం కాదనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ఈ కింద రాశులవారికి నిత్యం ఏదో ఒక టెన్షన్ మాత్రం తప్పదు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా ఉండదు. ఎలాంటి టెన్షన్స్, ఒత్తిడి ఉండకూడదు అనే అందరూ కోరుకుంటారు. కానీ.. మనం అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది. మరీ ముఖ్యంగా.... వైవాహిక జీవితంలో ఎలాంటి టెన్షన్లు, ఒత్తిడి ఉండకూడదు అని కోరుకుంటారు. కానీ.. పాపం ఈ రాశుల వారికి మాత్రం అది సాధ్యం కాదనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ఈ కింద రాశులవారికి నిత్యం ఏదో ఒక టెన్షన్ మాత్రం తప్పదు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
1. కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి రిలేషన్స్ చాలా ముఖ్యం. వీరు చాలా తొందరగా ఎమోషనల్ అయిపోతారు. ఎవరితో అయినా.. తమ ఎమోషన్ ని పంచుకోగలరు. వీరి హృదయం చాలా సున్నితం. కాబట్టి వెంటనే హర్ట్ అవుతారు. తాము ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకుంటామేమో అని వీరు నిత్యం భయపడిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కువగా వీరు ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ టెన్షన్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది.
2. మిథున రాశి..
మిథున రాశివారు ద్వంద్వ వ్యక్తిత్వం కలవార. వారు తమ స్వంత నమ్మకాలతో ఏకీభవించలేరు. సెక్స్ లైఫ్ సరిగా ఉండేదేమో అనే ఆందోళన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికీ వీరు చాలా స్పెషల్ గా ఉంటారు. కానీ.. ఈ టెన్షన్ మాత్రం వీరిలో చాలా ఎక్కువ. వారు తమ జీవిత భాగస్వామి అంచనాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడం ద్వారా తమపై చాలా ఒత్తిడిని తెచ్చుకుంటారు. ఇది ఆందోళన సమస్యలను కలిగిస్తుంది.
3. కన్యారాశి
ఈ రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు.ప్రతి విషయాన్ని తమదైన రీతిలో అర్థం చేసుకునే ధోరణి కారణంగా కొందరు టెన్షన్‌ను సృష్టించుకుంటారు. కన్య రాశి వారు వారిని నేరస్తులుగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారు. వీరు చాలా సెన్సిటివ్. కానీ.. తమ ఎమోషన్స్ ని మాత్రం బయటకు చెప్పరు. ఎదుటివారిని నొప్పించకూడదని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురౌతూ ఉంటారు.
4. మీన రాశి..
ఈ రాశి వారు తమ అవసరాలను కాకుండా ఇతరుల అవసరాలను తీర్చడం గురించి ఆలోచిస్తారు. ఇది అద్భుతమైన విషయమే అయినా, కొన్ని సందర్భాల్లో వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు వారి శృంగార సంబంధాలలో ఉద్రిక్తత , ఆందోళనకు కారణం కావచ్చు. వీరి మనస్తత్వాన్ని తెలుసుకొని ఇబ్బందిపెట్టేవారు ఎక్కువగా ఉంటారు. వారి సంబంధంలో తలెత్తే సమస్య గురించి వారి జీవిత భాగస్వామికి తెలియకపోయినా.. వారంతట వారే ఏదో ఒకటి ఊహించేసుకొని ఆందోళన పెంచుకుంటూ ఉంటారు.