Zodiac Signs: బ్రేకప్ తర్వాత ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?
ప్రేమించిన వాళ్లు దూరం కావడం బాధాకరమైన విషయం. కానీ ప్రేమ దూరమైనప్పుడు అందరూ ఒకేలాగా స్పందించరు. ఒక్కొక్కరి మనస్తత్వం, వ్యక్తిత్వం ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి బ్రేకప్ ను ఎదుర్కొనే విధానం కూడా వేరుగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ చూద్దాం.

మేషరాశి
మేషరాశి వారు ప్రేమలో ఓడిపోయినప్పుడు కోపంలో ఎదుటి వాళ్ళ ముఖం మీద దాడి చేయొచ్చు. వీళ్లు గట్టిగా అరుస్తారు. ఓపిక కోల్పోతారు. ఈ రాశి వాళ్ళకి బ్రేకప్ చెప్పిన వాళ్ళు ఎదురుగా కనిపించకూడదు. బ్రేకప్ కావడానికి ఇంకెవరైనా కారణమైతే అంతే సంగతులు! ఈ రాశివారు వారిని వదిలిపెట్టరు. వారి వస్తువులు కూడా పగలగొట్టవచ్చు!

వృషభ రాశి
వీళ్ళు తమ ప్రేమను అంత తేలిగ్గా వదులుకోరు. నిజంగా విడిపోవడం చాలా కష్టం. ఒకసారి నిజం తెలుసుకుంటే ఇక ప్రమాదం లేదు. ఆ తర్వాత విడిపోయిన ప్రేమను తిరిగి ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకుంటారు.
మిధున రాశి
ఊహించని స్వభావం వీరిది నిరాశతో పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు. పాత లవర్ వెంట పడతారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రహస్యంగా ఫాలో అవుతారు. రహస్యాలు బయటపెడతారు. అందరి ముందు అవమానిస్తారు.
కర్కాటక రాశి
పిల్లిలా కాపు కాస్తారు. సైలెంట్‌గా ఉంటారు. కానీ ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చు. మీరు వాళ్ళ గుండె పగలగొట్టారని గుర్తు చేసేలా టైం చూసి దెబ్బ కొడతారు. అంతా బాగానే ఉందని నటిస్తూ మిమ్మల్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తారు.
సింహ రాశి
వీళ్ళు అడవికి రాజులా బిందాస్‌గా ఉంటారు. ప్రేమ విఫలమైనా రాజులా, రాణిలా ఉంటారు. బ్రేకప్‌తో దేవదాసులా అన్నీ జరుపుకుంటారు. ఒక టైమ్‌కి మిమ్మల్ని, మీ ప్రేమను మరిచిపోయి వేరే ప్రేమ వెంట పరిగెడతారు. అప్పుడు మీరు కనిపిస్తే నిప్పులు చెరుగుతారు.
కన్య రాశి
ఈ రాశి వాళ్ళకి తమ భావాలను బ్యాలెన్స్ చేయడం బాగా తెలుసు. విడిపోయిన ప్రేమలో నిరాశ, గొడవల్లాంటి డ్రామాలంటే వీళ్ళకి ఎలర్జీ. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. అందుకే వీరిపై చేసిన ఖర్చు, ఇచ్చిన గిఫ్ట్ లు అస్సలు తిరిగిరావట.
తుల రాశి
ఈ రాశి వారు చాలా ప్రాక్టికల్‌గా, డౌన్ టు ఎర్త్‌గా ఉంటారు. బ్రేకప్ కోసం కొంచెం బాధపడతారు. కానీ చాలా తేలిగ్గా ముందుకు వెళ్ళిపోతారు. వేరే ప్రేమతో మీ ముందే జెండా ఎగరేస్తారు. వారిని కోల్పోయినందుకు మీరు బాధపడేలా చేస్తారు.
వృశ్చిక రాశి
తేలులాంటి వాళ్ళు, కుట్టకుండా ఉంటారా? పాత లవర్‌ని కుట్టకుండా ఉండలేరు. మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తారు. మీ ఫ్రెండ్స్‌ని మీకు వ్యతిరేకంగా చేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు.
ధనస్సు రాశి
వీళ్ళ స్వభావం చాలా ఓపెన్‌గా ఉంటుంది. మీరు వీళ్ళని 'బలి పశువు'ని చేయలేరు. రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. అది అసాధ్యమైతే మామూలుగానే ముందుకు వెళ్ళిపోతారు. వేరే వాళ్ళని పట్టుకుంటారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో బ్లాక్ చేసి, మీ మీద ఇంట్రెస్ట్ లేదని చూపిస్తారు.
మకర రాశి
మీ బ్రేకప్ గురించి మీరు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేరు. మీరు ముసలి వాళ్ళు అయ్యాక కలిసినా, ఆ రోజు మీరు బ్రేకప్ చేయడం తప్పని అంటారు. నిజం తెలుసుకోవడానికి వీళ్ళకి టైమ్ కావాలి. నిజం మార్చడానికి కూడా ట్రై చేస్తారు.
కుంభ రాశి
అంతా విధి రాత, కర్మ అనుకుని వదిలేస్తారు. కొంచెం దేవుడి మీద భక్తి ఎక్కువ. అందుకే దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోతారు. వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. కానీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడటం కష్టం. అందుకే మోసం చేసిన వాళ్ళే బాధపడతారు.
మీన రాశి
సంతోషకరమైన ప్రపంచంలో ఉంటారు. మీన రాశి వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. బ్రేకప్ చేసేటప్పుడు వీళ్ళకి నచ్చజెప్పాలి. లేదంటే గొడవ చేస్తారు. అందరి ముందు అవమానించడానికి కూడా వెనకాడరు.

