తులారాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలన్నీ తీరినట్లే, ఇక అన్నింటా విజయమే
Zodiac sign: 2025 నవంబర్ 23న బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. తరువాత నవంబర్ 29న ప్రత్యక్ష గమనంలోకి వస్తాడు. ఈ మార్పులతో కొన్ని రాశుల వారికి కలిసొస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా రాశులంటే..

బుధ గ్రహం ప్రత్యేకత ఏంటంటే.?
జ్యోతిషశాస్త్రంలో గ్రహాల స్థానం లేదా సంచారం వల్ల మార్పులు తీసుకువస్తాయి. ముఖ్యంగా బుధుడు వ్యాపార విజయం, ఆర్థిక వృద్ధి, విద్య, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు ఉద్యోగ ఫలితాలపై ప్రభావం చూపుతాడు. ఈసారి బుధుని సంచారం మూడు రాశులకు ప్రత్యేకంగా లాభాలు ఇవ్వనుంది.
వృషభ రాశికి ఆర్థిక లాభాలు
వృషభ రాశికి బుధుడు రెండవ, ఐదవ ఇళ్ల అధిపతి. ఈ గోచారం వల్ల..
* పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
* పెట్టుబడులకు మంచి లాభాలు
* వ్యాపారం విస్తరించాలనుకునేవారికి మంచి సమయం
* కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవుతుంది
* వ్యాపారులు, పెట్టుబడి పెట్టే వారికి ఇది ఉత్తమ కాలం.
కర్కాటక రాశికి ఆస్తి, కెరీర్‌లో పురోగతి
కర్కాటక రాశి వారికి బుధుని ఈ సంచారం మంచి మార్పులు తెస్తుంది:
* పూర్వీకుల ఆస్తి సంబంధిత విషయాలు పరిష్కారం అవుతాయి.
* ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది
* ఉద్యోగం, వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది
* ప్రయాణాలు లేదా ఒప్పందాలు ప్రయోజనకరంగా మారవచ్చు
* ఇది కుటుంబ శాంతి, వృత్తి ఎదుగుదలకు అనుకూల సమయంగా చెప్పొచ్చు.
మకర రాశి వారికి ప్రమోషన్
మకర రాశిలో బుధుడు పదవ ఇంట్లోకి ప్రవేశించడం చాలా శుభం:
* ఉద్యోగస్తులకు నాయకత్వ బాధ్యతలు వస్తాయి
* ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు అవకాశం లభిస్తుంది.
* వ్యాపారంలో కొత్త ఒప్పందాలు
* ఆర్థిక స్థితి బలపడుతుంది
* వృత్తి పరమైన ఎదుగుదలకు ఇది అత్యుత్తమ అవకాశం.
గమనిక: ఈ వివరాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం, జ్యోతిష్యులు తెలిపిన వివరాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

