Your Weekly Horoscopes:ఓ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం..!
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ధన లాభం. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం.
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారం మీ జీవితంలో గొప్ప మలుపు తిరిగే సంఘటనలు గోచరిస్తున్నాయి. భగవత్ సంకల్పంతో వాటిని మీరు అందుకోవచ్చు. గృహ నిర్మాణ ఆలోచనలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహకారంతో అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. కీలకమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల యందు స్వల్ప లాభాలు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ప్రయాణాలు జాగ్రత్తలు అవసరం.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఓ చిన్న ఆలోచన ఈ వారంలో మీరు ఊహించని కొన్ని మార్పులను తీసుకువస్తుంది. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. క్రయ విక్రయాల విషయంలో తెలివిగా వ్యవహరించవలెను. నిరుద్యోగులు పట్టుదలతో ప్రయత్నించిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకార లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి. సంతాన అభివృద్ధికి ఆలోచన చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారాంతం మీకు ఓ కొత్త ప్రయాణానికి సన్నిద్దం చేస్తుంది. అది మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్నదే. అందిపుచ్చుకోండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ధన లాభం. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. రుణ శత్రు బాధలు తీరి మానసిక ప్రశాంతత లభించును. సంతానం యొక్క అభివృద్ధి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించవలెను.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం మధ్యలో మీరు చేసే ఒప్పందాలు మీకు చాలా కాలం లబ్దిని చేకూరుస్తాయి. అయితే మీరు నమ్మి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శుభకార్యాచరణ వలన స్వల్ప ఖర్చులు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం. సంఘంలో ఆదరణ పొందుతారు. బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్త వహించవలెను. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం కాస్త అటూ ఇటూగా ఉన్నా అంతిమ ఫలితం మీకు అనుకూలమే అని గుర్తు పెట్టుకోండి. ఈ స్దితిలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వస్తు వాహన సౌఖ్యం. సంతాన మూలకంగా ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. రుణ శత్రు బాధలు తొలగును. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. అనుకోని ఖర్చులు. వారాంతంలో లాభం చేకూరును.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారం మీ ఇన్నాళ్ల కష్టం మీకు చక్కటి ప్రతిఫలం తెచ్చిపెడుతుంది. ముందుకు వెళ్లమని ఉత్సాహపరుస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.సంఘంలో గౌరవ ప్రతిష్టలు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకొనవలెను. పట్టుదలతో ప్రయత్నిస్తే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
మీ చుట్టు ప్రక్కల చాలా మంది కన్నా మీరు ఆనందాన్ని అందుకునే వారం ఇది. మీ అవసరాలకు తగినట్లు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ శత్రు బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహం నందు శుభకార్యాచరణ. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తలపెట్టిన పనులను సోదరుల యొక్క సహకారంతో పూర్తి చేస్తారు. వారాంతంలో అనుకోని ఖర్చులు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం మీకు ఊహించని ఎన్నో సంతోషాలు,సుఖాలు అందచేస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ విషయంలో ఆలోచన అవసరం. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రుణాలు తీరి ఊరట పొందుతారు. వివాహ ప్రయత్నాలో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. బంధువుల నుండి కీలక సమాచారం అందును.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం మధ్య నుంచి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆరోగ్య,ఆర్దిక విషయాల్లో నష్టమైతే ఉండదు. అంతవరకూ మీకు మంచి జరుగుతున్నట్లే . కాకపోతే చేపట్టిన పనులు ముందుకు సాగవు. సన్నిహితుల నుండి సాయం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు.శ్రమాధిక్యం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పనులలో జాప్యం జరిగినప్పటికీ చివరికి పూర్తి చేస్తారు. వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వాహన సౌఖ్యం.సంఘంలో గౌరవం పొందుతారు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం పట్టిందల్లా బంగారం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. వివాదాలు కాపుతాపాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు. ప్రతి వ్యాపారాల్లో ప్రోత్సాహం. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానమునకు విద్య,ఉద్యోగ అవకాశాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు వహించవలెను. బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సామాన్య వారం ఇది. పెద్దగా ఒడిదుడుకులు ఉండవు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణ బాధలు తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చి అవకాశం ఉంది. వస్తు లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలకు సానుకూలం. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు. ఆకస్మిక ప్రయాణాల్లో లాభాలు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కొంచెం ఓపిక పట్టాల్సిన వారం ఇది. పనులు కొన్ని మీ చేతుల్లో ఉండవని అర్దం చేసుకుంటే మానసిక వ్యథ ఉండదు. తలపెట్టిన పనుల్లో జాప్యం జరిగినప్పటికీ విజయం సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చును. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం. వాహన సౌఖ్యం. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు