గత జన్మలో ఏ రాశివారు ఏంటో తెలుసా?
విజయం కోసం చాలా ఎక్కువగా కష్టపడతారు. అయితే, ఈ రాశివారు ఈ జన్మలో కొంచెం డామినేటింగ్ గా ఉండకపోవడం మంచిది.
telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారు గత జన్మలో ఆధ్యాత్మను ఎక్కువగా నమ్మిన వ్యక్తి అని చెప్పొచ్చు. కాబట్టి, ఈ రాశివారు ఈ జన్మలో స్వార్థాన్ని పక్కన పెట్టాలి. అప్పుడు వారి జీవితం ఆనందంగా సాగుతుంది.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశివారు గత జన్మలో ఫైటర్ అయయి ఉండాలి. లేదంటే, విపరీతమైన కోపం ఉన్న వ్యక్తి అయ్యి ఉండాలి. అయితే, ఈ జన్మలో మాత్రం వీరు చాలా క్రియేటివ్ గా ఉండరు. విజయం కోసం చాలా ఎక్కువగా కష్టపడతారు. అయితే, ఈ రాశివారు ఈ జన్మలో కొంచెం డామినేటింగ్ గా ఉండకపోవడం మంచిది.
telugu astrology
3.మిథున రాశి...
మిథున రాశివారు గత జన్మలో భూమికి ఎక్కువ విలువ ఇచ్చిన వ్యక్తి అయ్యి ఉంటారు. ఈ జన్మలో మాత్రం మీరు సుసంపన్నమైన అనుభవాలతో మానసికంగా ఉత్తేజపరిచే జీవితం కోసం చూస్తున్నారు.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు గత జన్మలో చాలా తెలివైన వారు. కానీ మనసులో మాటను మాత్రం తొందరగా బయటపెట్టరు. ఇక ఈ జన్మలో ఈ రాశివారు మానసికంగా తమ ఆలోచనలపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
telugu astrology
5. సింహ రాశి..
సింహ రాశివారు గత జన్మలో ఎక్కువగా అభద్రతా భావంతో ఉన్న వ్యక్తి. ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు. ఈ జన్మలో మాత్రం చాలా రొమాంటిక్ గా ఉంటారు, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. అయితే, వీరు ఈ జన్మలో గోని పక్కన పెట్టడం మంచిది.
telugu astrology
6.కన్య రాశి..
గత జన్మలో ఈ రాశివారు ఎక్కువగా తమ పై మాత్రమే ఫోకస్ పెట్టారు. అందరి చుట్టూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ ఈ జన్మలో ఈ రాశివారు తమపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీరు ఈ జన్మలో త్యాగాలు చేయకుండా ఉండటం మంచిది.
telugu astrology
7. తుల రాశి..
తుల రాశివారు గత జన్మలో ఇతరుల కోసం సేవలు చేస్తూ ఉండిపోయారు. కానీ, ఈ జన్మలో మాత్రం తుల రాశివారు... ప్రతి విషయంలోనూ బ్యాలెన్సింగ్ గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
telugu astrology
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు గత జన్మలో ప్రతి విషయంలోనూ బ్యాలెన్సింగ్ గా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ జన్మలో ఈ రాశివారు అవకాశాలు కోసం పోరాడుతూ ఉంటారు.
telugu astrology
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు గత జన్మలో తమ జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయారు. ఈ జన్మలో ఈ రాశివారు మాత్రం తమకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారు గత జన్మలో చాలా సరదాగా, ఎప్పుడూ ట్రావెలింగ్ చేస్తూ, సాహసాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ జన్మలో మాత్రం ఈ రాశివారు చాలా సీరియస్ గా ఉంటారు. కేవలం లక్ష్యం మీద మాత్రమే దృష్టి ఉంటుంది.
telugu astrology
11.కుంభ రాశి..
గత జన్మలో కుంభ రాశివారు నిత్యం ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ మధ్య నలిగిపోయి ఉన్నారు. కానీ, ఈ జన్మలో మాత్రం ఈ రాశివారు మీరు ఇరతులకు పనులు చెప్పే స్థితికి వచ్చారు.
telugu astrology
12.మీన రాశి..
గత జన్మలో ఈ రాశివారు తమకు నచ్చినట్లుగా రూల్స్ పెట్టుకొని, స్వేచ్ఛగా జీవించేశారు. కానీ, ఈ జన్మలో మాత్రం ఈ రాశివారు తమ అవసరాలను కూడా పక్కన పెట్టి, ఇతరుల కోసం పనులు చేయాల్సి వస్తుంది.