ఈ రాశుల అమ్మాయిలు మంచి గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు..!
మరికొందరు ప్రేమగా ఉండవచ్చు కానీ అంత సన్నిహితంగా ఉండకపోవచ్చు. అయితే, జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశుల అమ్మాయిలు మాత్రం మంచి గర్ల్ ఫ్రెండ్స్ అవుతారట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
పురుషులందరూ తమ జీవితంలోకి మంచి గర్ల్ ఫ్రెండ్ రావాలని కోరుకుంటారు. అయితే, అందరూ మంచి స్నేహితురాలు కాలేరు. కొంతమంది యువతులు తమ బాయ్‌ఫ్రెండ్‌ను తల్లిలా చూసుకుంటారు, కొందరు అతనిపై ఆధిపత్యం చెలాయించవచ్చు, మరికొందరు ప్రేమగా ఉండవచ్చు కానీ అంత సన్నిహితంగా ఉండకపోవచ్చు. అయితే, జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశుల అమ్మాయిలు మాత్రం మంచి గర్ల్ ఫ్రెండ్స్ అవుతారట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
telugu astrology
• మేష రాశి
మేషరాశి యువతులు ఉత్తేజకరమైన (ఎగ్జిటింగ్) గర్ల్‌ఫ్రెండ్‌లు అవుతారు. వారు సంబంధాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఎనర్జీ లెవెల్ ఎక్కువ. మేషరాశి యువతులు అవసరమైనప్పుడు అండగా నిలపడతారు. కొత్త అనుభవాల పట్ల ఉత్సాహంగా ఉంటారు.
telugu astrology
• వృషభం
వారి భాగస్వామిపై ఆధారపడి ఉంటారు. సున్నితంగా ఉంటారు. సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకునే స్థిరమైన వైఖరిని కలిగి ఉంటారు. మంచి , చెడులు చెబుతుంటారు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు నిబద్ధత, విశ్వసనీయతతో కూడిన శృంగార స్వభావం కలిగి ఉంటారు. ఒక్కోసారి మొండిగా ప్రవర్తిస్తారు. కానీ, చాలా ప్రేమగా ఉంటారు.
telugu astrology
• కర్కాటక రాశి..
ఈ రాశి అమ్మాయిలు మంచి సంరక్షకులు అవుతారు. భాగస్వామికి ప్రేమపూర్వక వాతావరణాన్ని సృష్టించగలరు. ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోని, తమ భాగస్వామికి సర్ ప్రైజ్ లు ఇవ్వగలరు. క్లిష్ట పరిస్థితుల్లో భుజాన్ని అందిస్తారు. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంలో ముందుంటారు.
telugu astrology
• తుల రాశి..
తుల రాశి అమ్మాయిలు కూడా మంచి గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. సంబంధాన్ని సరసమైన, సమతుల్య పద్ధతిలో ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవడంలో ముందుంటారు. న్యాయం గురించి చాలా బలమైన భావన కలిగి ఉంటారు. శాంతియుత , సామరస్య వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు.
telugu astrology
• మీన రాశి..
దయగల, సహజమైన ప్రేమికులు. భాగస్వామి అవసరాల గురించి బాగా తెలుసు. వీరు కరుణామయులు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్ గా రావాలంటే అదృష్టం ఉండాలి. తమ భాగస్వామిని నిత్యం కాపాడుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారు.