MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!

Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!

Saubhagya Yoga: మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో ఏర్పడే సౌభాగ్య యోగం ఎంతో శుభప్రదమైనది. దీనికి సెప్టెంబర్ నెలలో 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి. మీ రాశి ఉంటే మీరు చాలా లక్కీ.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 25 2026, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తుల రాశి
Image Credit : Gemini Ai

తుల రాశి

తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది. మహాలక్ష్మి దయతో కోటీశ్వరులయ్యే యోగం వీరికి వస్తుంది. సౌభాగ్య యోగం వల్ల శుభ గ్రహాల బలం పెరగడంతో వీరి కలలు నెరవేరుతాయి. వ్యాపారం చేస్తున్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కొత్త ఆస్తులు, లగ్జరీ వాహనాలు, బంగారం కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. కుటుంబంలోని గందరగోళం తొలగిపోయి ఐక్యత పెరుగుతుంది. పెళ్లి వయసులో ఉన్నవారికి మంచి సంబంధం కుదురుతుంది. శుక్రవారాల్లో మహాలక్ష్మి అమ్మవారికి తామర పువ్వులు సమర్పించి పూజించడం చాలా మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్య
Image Credit : Getty

కన్య

కన్యారాశి వారు శుభ గ్రహాల కలయిక వల్ల సెప్టెంబర్ నెలలో సౌభాగ్య యోగం పూర్తి ఫలాలను పొందుతారు. ఈ రాశివారి మాట, చేత ఇతరులకు బాగా నచ్చుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్‌తో పాటు జీతం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈ రాశి వారికి పిల్లల వల్ల గర్వపడే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బుధవారాల్లో ఆవుకు ఆకుకూరలు తినిపించడం, పెరుమాళ్‌ను పూజించడం మంచిది.

34
వృషభం
Image Credit : Getty

వృషభం

వృషభ రాశి వారికి సౌభాగ్య యోగంతో జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చాలా కాలంగా ఇతరుల చేతిలో నిలిచిపోయిన డబ్బు వీరి చేతికి అందుతుంది. స్టాక్ మార్కెట్, భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తారు. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించి పూజించాలి.

44
మిథునం
Image Credit : Pixabay

మిథునం

మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల మొత్తం ఊహించని ధనలాభాలు వచ్చి పతాయి. మంచి పేరు కూడా వస్తుంది. కళలు, మీడియా, రచన, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఇది విజయాలను అందించే నెల.కొత్త పెట్టుబడుల ద్వారా రెట్టింపు లాభాలు చూస్తారు. ప్రేమ సంబంధాల్లోని మనస్పర్థలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బుధవారాల్లో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా దానం చేయడం వల్ల యోగ ఫలాలు పెరుగుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు.. సానుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Washing Machine: మీ వాషింగ్ మెషీన్లో ఉన్న ఈ సీక్రెట్ ఫీచర్లు తెలుసా? సులువుగా మరకలు వదిలేస్తాయి
Recommended image2
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved