రాత్రిపూట గోర్లను ఎందుకు కట్ చేయకూడదో తెలుసా?
రాత్రిపూట గోర్లను కట్ చేయకూడదని పెద్దలు చెప్తూనే ఉంటారు. అయితే ఇలా చెప్పడం వెనుక కొన్ని ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం పదండి..
ఏదేమైనా రాత్రిపూట మాత్రం గోర్లను కట్ చేయకూడదని పెద్దలు చెప్తూనే ఉంటారు. ఇదొక మూడనమ్మకమని చాలా మంది దీన్ని లెక్క చేయరు.అలాగే కట్ చేస్తుంటారు. కానీ ఈ మాటకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణం రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే.. సాయంత్రం పూట గోర్లను కట్ చేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి రాకకు అడ్డు కలుగుతుందట. సాయంత్రం పూట లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.
ఇంటికి లక్ష్మీదేవి రాకతో ఇంటికి శ్రేయస్సు, సంపదలు వస్తాయి. అలాగే రాత్రిపూట ఇంట్లో చెత్తను తొలగించకూడదు. ఇది లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుంది. దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి రాత్రిపూట డబ్బు అప్పు ఇవ్వడం, గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, చెత్త తీయడం వంటివి చేయకండి.
గోళ్లు
అలాగే భూత, ప్రేత వంటి చెడు పనులకు కూడా చాలా వరకు విరిగిన గోరు ముక్కను ఉపయోగిస్తారు. కాబట్టి రాత్రిపూట గోళ్లు నేలపై పడితే, చెడు శక్తులు లేదా మనకు వ్యతిరేకంగా దుష్ట చేస్టలు చేసే వ్యక్తులు మన గోళ్లను సేకరించి మనకు హాని కలిగించడానికి వాటిని ఉపయోగిస్తారని నమ్ముతారు.